Diabetes control tips in Summer Season: ప్రస్తుతం జీవన విధానం పూర్తిగా మారిపోయింది. ఆహారపు అలవాట్లు, జీవనశైలీ మన ఆరోగ్యంపై ఎంతో ప్రభావం చూపిస్తున్నాయి. ఒకప్పుడు.. నలభై ఏళ్ల తర్వాత కన్పించే అనారోగ్యసమస్యలు ఇరవైలోనే కన్పిస్తున్నాయి. శరీరంలో అనేక మార్పులు వస్తున్నాయి. యుక్తవయసుల్లోనే వెంట్రుకలు తెల్లగా మారిపోతున్నాయి. కొందరిలో చర్మం ముడతలు పడిపోతుంది. బీపీ, షుగర్, బెల్లీఫ్యాట్ వంటి సమస్యలు చిన్న వయస్సులో వస్తున్నాయి. ముఖ్యంగా ఈ మధ్య కాలంలో డయాబెటిస్ సమస్య అనేది చాలా మందిలో కన్పిస్తుంది. ఇది ఒకసారి వస్తే మాత్రం, ఎంతో జాగ్రత్తగ ఉండాలి. నిరంతరం షుగర్ లెవల్స్ లను అబ్జర్వ్ చేస్తు ఉండాలి. కొందరిలో షుగర్ మోతాదు ఎంతో భారీగా ఉంటుంది. ఇలాంటి వారికి డాక్టర్లు ఇన్సులిన్ తీసుకొవాలని చెప్తుంటారు. అందుకు అన్నం తినేముందు ఈ పెషెంట్లు పొట్టకు లేదా చేతులకు ఇన్సులిన్ వేసుకుంటారు. ముఖ్యంగా సమ్మర్ లో డయాబెటిస్ పెషెంట్లు ఈ ఆహారం మాత్రం వారి డైట్ లో తప్పనిసరిగా ఉండేలా చూసుకొవాలి.
పుచ్చకాయలు..
సమ్మర్ లో మన శరీరంలో నీరును ఎక్కువగా కొల్పోతుంటుంది. అందుకే ఎండాకాలంలో నీటిని ఎక్కువగా తాగాలి. ముఖ్యంగా షుగర్ ఉన్న వారు పుచ్చకాయలను ఎక్కువగా తినాలి. దీనిలో 95 శాతం నీరు ఉటుందని చెబుతుంటారు. ఇది మధుమేహానం ను కంట్రోల్ లో ఉంచుతుంది.
నల్ల ద్రాక్ష..
మధుమేహంతో బాధపడే వారు నల్ల ద్రాక్షను ఎక్కువగా తినాలని, దీనిలో చక్కెరను తగ్గించే గుణాలు ఉంటాయంట. అందుకు నిపుణులు ఎక్కువగా నల్ల ద్రాక్షను తినాలని సూచిస్తుంటారు. సమ్మర్ లో ప్రతిరోజు పది వరకు నల్ల ద్రాక్షలను తినాలి.
గ్రీన్ వెజిటెబుల్స్..
ఆకుకూరలను ఎక్కువగా తింటే మధుమేహం కంట్రోల్ లో ఉంటుంది. దీనిలో ముఖ్యంగా మన శరీరానికి కావాల్సిన మినరల్స్, విటమన్లు లభిస్తాయి. పచ్చని ఆకుకూరల్లో విటమిన్ ఏ, బీ, సీ లు ఉంటాయి. ఇది మన శరీరంలో ఇమ్యునిటీని పెంచడంలో ఉపయోగపడుతుది.
కీర దోసకాయ..
కీరలో కూడా వాటర్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది. అందుకే కీరను కూడా తినోచ్చని నిపుణులు చెబుతుంటారు. దీనిలో ఉండే ఫైబర్ లు షుగర్ లెవల్స్ ను కంట్రోల్ లో ఉంచుతాయి. కీరను ఉప్పులేకుండా తినాలి. అదే విధంగా కొందరు కీర జ్యూస్ లను కూడా తాడుతుంటారు. ఇది కూడా ఎంతో ఆరోగ్యానికి మేలు చేస్తుంది.
ఇడ్లీ, చపాతీలు..
డయాబెటిస్ సమస్యతో బాధపడుతున్న వారు.. ఎక్కువగా అన్నంకు దూరంగా ఉండాలి. అలాగనీ పూర్తిగా తినడం మాత్రం మానేయకూడదు. ఇలాంటి వారికిఎక్కువగా ఆకలేస్తుంటుంది. అందుకు కొద్ది కొద్దిగా షుగర్ కంటెంట్ లేని ఫుడ్ ఐటమ్స్ తినాలి. ఇడ్లీ, చపాతీలు రాత్రిపూట తింటే ఎలాంటి సమస్యలు ఉండవు. మధుమేహంతో బాధపడేవారు సమ్మర్ లో రెగ్యులర్ గా చెకప్ లకు వెళ్తుండాలి.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Facebook, Twitter