Diet For Diabetes: చలి కాలంలో సులభంగా ఈ డ్రింక్‌తో మధుమేహానికి చెక్‌ పెట్టొచ్చు..

Diet For Diabetes: మధుమేహాన్ని నియంత్రించుకోవడానికి చాలా మంది వివిధ రకాల ప్రయత్నాలు చేస్తున్నారు. అయితే దీని నుంచి సులభంగా ఉపశమనం పొందడానికి ఆయుర్వేద నిపుణులు తెలుపుతున్న ఈ చిట్కాలను వినియోగించాల్సి ఉంటుంది.

Written by - ZH Telugu Desk | Last Updated : Nov 11, 2022, 03:31 PM IST
Diet For Diabetes: చలి కాలంలో సులభంగా ఈ డ్రింక్‌తో మధుమేహానికి చెక్‌ పెట్టొచ్చు..

Diet For Diabetes: ఆధునిక జీవన శైలి కారణంగా ప్రతి ఇంట్లో ఒకరు మధుమేహం సమస్యలతో బాధపడుతున్నారు. శరీరంలో చక్కెర పరిమాణాలు అధికంగా పెరగడాన్నే డయాబెటిస్ అంటారు. షుగర్ లెవెల్స్ ఎక్కువగా ఉండడం వల్ల పాదాల్లో పొక్కులు రావడం, చూపు కోల్పోవడం, ఆకస్మికంగా బరువు తగ్గడం, గుండె జబ్బులు, పక్షవాతం, కిడ్నీ ఫెయిల్యూర్ వంటి తీవ్రమైన వ్యాధులు వచ్చే ప్రమాదం ఉంది. అందుకే ఎంత సులభంగా రక్తంలో చక్కెర పరిమాణాలు నియంత్రించుకుంటే అంత మంచిదని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు. మధుమేహాన్ని నియంత్రించుకోవడానికి తప్పకుండా పలు రకాల డ్రింక్స్‌ను వినియోగించాల్సి ఉంటుంది.

డయాబెటిస్‌ ఉన్నవారికి మెంతి నీరు తీసుకోవడం వల్ల కలిగే ప్రయోజనాలు:
మధుమేహాన్ని నియంత్రించడానికి మెంతి గింజలు నీరు ప్రభావవంతంగా పని చేస్తుందని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు. మెంతి గింజలలో కరిగే ఫైబర్ అధికంగా ఉంటుంది. ఇది జీర్ణక్రియను మెరుగు పరిచి రక్తంలో చక్కెర స్థాయిలు తగ్గుతాయి. అంతేకాకుండా మెంతుల్లో ఉండే కార్బోహైడ్రేట్లు శరీరానికి చాలా రకాలుగా ఉపయోగపడుతుంది.

మెంతి డ్రింక్‌ను ఇలా తయారు చేసుకోండి:
రక్తంలోని చక్కెర పరిమాణాలను నియంత్రించుకోవడానికి తప్పకుండా మెంతులతో చేసిన డ్రింక్ తాగాల్సి ఉంటుంది. అయితే దీని కోసం రాత్రిపూట ఒక గ్లాసు నీటిలో ఒక చెంచా మెంతి గింజలను నానబెట్టాలి. మరుసటి రోజు ఉదయం వడగట్టి తాగాలి. ఇలా క్రమం తప్పకుండా తాగితే శరీరానికి చాలా రకాల ప్రయోజనాలు కలుగుతాయి. అంతేకాకుండా మధుమేహం కూడా సులభంగా నియంత్రణలో ఉంటుంది.

మెంతి నీరు కాకుండా.. వీటితో కూడా..
ఇతర వంటకాలు వండుకునే క్రమంలో కూడా మెంతులను వినియోగించవచ్చని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు. మొలకెత్తిన మెంతి గింజలను తినడం వల్ల రెట్టింపు ప్రయోజనాలు పొందే అవకాశాలున్నాయని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు. కావాలనుకుంటే మెంతి గింజలను మజ్జిగలో వేసుకుని కలిపి కూడా తీసుకోవచ్చు.

NOTE: ఇక్కడ ఇవ్వబడిన సమాచారం సాధారణ సమాచారంపై ఆధారపడి ఉంటుంది. దయచేసి దీనిని స్వీకరించే ముందు వైద్య సలహా తీసుకోండి. ZEE NEWS దీన్ని ధృవీకరించలేదు

Also Read: Ind vs Eng Semi Final Match: ఇండియా vs ఇంగ్లండ్ మ్యాచ్ ఓటమికి కారణాలు ఇవేనా ?

Also Read: T20 World Cup: రోహిత్, విరాట్ కోహ్లి గుడ్ బై.. బీసీసీఐ సంచనల నిర్ణయాలు..? 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 

ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

 

Trending News