Foods For Healthy Gut: ఆధునిక కాలంలో మారిన జీవనశైలి కారణంగా చాలా మంది అనారోగ్య సమస్యల బారిన పడుతున్నారు. ముఖ్యంగా పొట్ట ఆరోగ్య సమస్యలు ఈ మధ్య కాలంలో అధికంగా కనిపిస్తున్నాయి. గ్యాస్, అజీర్ణం, మలబద్ధం, కడుపు నొప్పి ఇలా బోలెడు సమస్యలు తలెత్తతున్నాయి. ఈ సమస్యలకు మూల కారణం మన తీసుకొనే ఆహారం, జీవనశైలి. ఈ సమస్య బారిన పడకుండా ఉండాలి అంటే పొట్ట ఆరోగ్యంగా ఉండటం చాలా అవసరం. దీని వల్ల తీసుకున్న ఆహారం త్వరగా జీర్ణం అవుతుంది. దీని కోసం మీరు ఆరోగ్యకరమైన ఆహారపదార్థాలను తీసుకోవాల్సి ఉంటుంది. పొట్ట ఆరోగ్యాన్ని పాడు చేసే పదార్థాలు కాకుండా మంచి ఫైబర్ కంటెంట్ ఉన్న ఆహారం తీసుకోవడం వల్ల పొట్ట సమస్యలు తగ్గుతాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.
అయితే ఎలాంటి ఆహారపదార్థాలు తీసుకోవడం వల్ల పొట్ట సంబంధిత సమస్యలు తలెత్తుతాయి అనేది మనం తెలుసుకుందాం.
1 ప్రాసెస్డ్ చేసిన ఆహారం: అధునిక కాలంలో పిల్లలు, పెద్దలు ప్రాసెస్డ్ చేసిన ఆహారపదార్థాలను తీసుకోవడానికి ఇష్టపడుతుంటారు. వీటిని తీసుకోవడం వల్ల జీర్ణవ్యవస్థ దెబ్బతింటుందని నిపుణులు చెబుతున్నారు. అంతేకాకుండా వీటిలో కొవులు కలిగి ఉంటాయి. చెడు కొలెస్ట్రాల్ పెంచడంలో సహాయపడుతాయి. అంతేకాకుండా పొట్ట మైక్రో బయోమ్‌ను తీవ్రంగా దెబ్బతీస్తాయి. దీని కారణంగా జీర్ణ సమస్యలు, వాపు, కడుపు నొప్పి, మలబద్ధకం వంటి సమస్యలు కలుగుతాయి. ప్రాసెస్డ్ చేసిన పదార్థాలను తీసుకోకుండా ఆరోగ్యకరమైన ఆహారపదార్థాలను తీసుకోవడం వల్ల ఈ సమస్యలు రాకుండా ఉంటాము. ఫైబర్ కంటెట్ ఉన్న పదార్థాలు తీసుకోవడం ఆరోగ్యానికి చాలా మంచిది.
2 ఆధిక చెక్కర: చాకెట్ల్, స్వీట్, చెక్కర పదార్థాలు తీసుకోవడం వల్ల పొట్ట సమస్యలు కలుగుతాయి. ఇవి ప్రేగు ఆరోగ్యానికి దెబ్బతీస్తుంది. దీని వల్ల కడుపు నొప్పి సమస్యలు తలెత్తతాయి. వీటిని అధికంగా తీసుకోవడం మంచిది కాదు. చెక్కర అధికంగా తీసుకోవడం వల్ల జీర్ణవ్యవస్థతో పాటు డయాబెటిస్ వచ్చే అవకాశం ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. మితంగా తీసుకోవడం వల్ల అనారోగ్యసమస్యలు కలగకుండా ఉంటాయి.
3 నూనె కలిగిన పదార్థాలు: సాధారణంగా చాలా మంది జంక్ ఫూడ్స్ తీసుకోవడానికి ఇష్టపడుతుంటారు. కానీ ఈ జంక్ ఫుడ్స్ అన్ని అతిగా వేయించి నూనెలో తయారు చేస్తుంటారు. వీటిలో అనారోగ్య కొవ్వులు ఎక్కువగా ఉంటాయి. ఇవి ప్రేగు ఆరోగ్యాన్ని, పొట్ట ఆరోగ్యానికి నష్టం కలిగిస్తుంది.
దీని వల్ల తీవ్రమైన కడుపులో మంట కలుగుతుంది.
4 అధికంగా మాంసం: అంతేకాకుండా విపరీతంగా మాంసం తీసుకోవడం వల్ల జీర్ణ వ్యవస్థ దెబ్బతింటుందని నిపుణులు చెబుతున్నారు. దీని వల్ల మీ పొట్ట ఆరోగ్యం దెబ్బతింటుంది. వీటిలో ప్రోటిన్ ఉన్నప్పటికి ప్రేగులకు అంత మంచిది కాదు. ప్రేగు క్యాన్సర్ వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. వీటికి బదులుగా మీరు గుడ్డు, చేపలు తీసుకోవడం చాలా మంచిది.
5 కృతిమ స్వీటెనర్లు: కృతిమ స్వీటెనర్ ఉపయోగించి తయారు చేసే ఆహారం కూడా పొట్ట సమస్యలకు దారి తీస్తుంది. వీటిని తీసుకోవడం వల్ల జీర్ణవ్యవస్థ దెబ్బతింటుంది. దీని బదులుగా మీరు తేనెను తీసుకోవడం చాలా మంచిది.
6 ఆల్కహాల్: వయసుతో సంబంధం లేకుండా చాలా మంది ఆల్కహాల్ తీసుకుంటారు. వీటిని అధికంగా తీసుకోవడం కారణంగా జీర్ణ సమస్యలు కలుగుతాయి. అలాగే శరీరంలో రోగనిరోధక శక్తి తగ్గుతుంది. తక్కువ మోతాదులో తీసుకోవడం చాలా మంచిది. వీటికి బదులుగా మీరు హెర్బల్ టీ, పండ్ల రసాలు తీసుకోవడం చాలా మంచిది.
7 కెఫిన్: కెఫిన్ పదార్థాలు మితంగా తీసుకోవడం చాలా మంచిది. అతిగా కెఫిన్ తీసుకోవడం వల్ల ఇది పొట్టలో ఉండే బ్యాక్టీరియాను సమతుల్యతను దెబ్బతీస్తుంది. దీని కారణంగా గుండెలో మంట కలుగుతుంది. వీటికి దూరంగా ఉండటం చాలా మంచిది.
8 కూల్ డ్రింక్స్: వేసవికాలంలో చాలా మంది డీహైడ్రేషన్ సమస్య నుంచి ఉపశమనం పొందటం కోసం కూల్ డ్రింక్స్‌ను తీసుకుంటారు. కానీ వీటిలో హానికరమైన కెమికల్స్ ఉండటం వల్ల ఇవి పొట్ట సమస్యలకు దారి తీస్తుంది. వీటికి బదులుగా మీరు పండ్ల రసాలు, మజ్జిగ ఇతర ఆరోగ్యకరమైన పదార్థాలు తీసుకోవడం చాలా మంచిది.
మీరు పైన చెప్పిన ఆహారపదార్థాలను తరుచుగా తీసుకుంటున్నారా.. అయితే వీటిని తీసుకోవడం మంచిది కాదు వీటికి బదులుగా మీరు ఆరోగ్యకరమైన ఆహారపదార్థాలను తీసుకోవడం వల్ల పొట్ట సమస్యలు తగ్గుతాయి.
Also Read 2024 Bajaj Pulsar N250: మార్కెట్‌లోకి కొత్త పల్సర్ N250 వచ్చేసింది.. ఫీచర్స్, స్పెషిఫికేషన్స్ ఇవే!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి