Google New Feature: గూగుల్‌తో ఇంగ్లీషు ఈజీ ఇక, సరికొత్త ఫీచర్

Google New Feature: ఏదొచ్చిన రాకపోయినా ఇంగ్లీషు వస్తే చాలు ఎక్కడికెళ్లైనా బతికేయొచ్చంటారు. ప్రపంచవ్యాప్తంగా కామన్ లాంగ్వేజ్ కావడంతో ఆ భాషకు అంత క్రేజ్. అందుకే గూగుల్ సరికొత్త ఫీచర్ ప్రవేశపెట్టింది.  

Written by - Md. Abdul Rehaman | Last Updated : Oct 23, 2021, 02:35 PM IST
  • గూగుల్ ఇక కొత్త అర్ధాన్ని నేర్పిస్తుంది మీకు
  • గూగుల్ తో ఇంగ్లీషు నేర్చుకోవడం ఇక చాలా సులభం
  • ఇంగ్లీషు నేర్చుకునేందుకు కొత్త ఫీచర్ ప్రవేశపెట్టిన గూగుల్
Google New Feature: గూగుల్‌తో ఇంగ్లీషు ఈజీ ఇక, సరికొత్త ఫీచర్

Google New Feature: ఏదొచ్చిన రాకపోయినా ఇంగ్లీషు వస్తే చాలు ఎక్కడికెళ్లైనా బతికేయొచ్చంటారు. ప్రపంచవ్యాప్తంగా కామన్ లాంగ్వేజ్ కావడంతో ఆ భాషకు అంత క్రేజ్. అందుకే గూగుల్ సరికొత్త ఫీచర్ ప్రవేశపెట్టింది.

ప్రస్తుతం అంతా పోటీ ప్రపంచమే. పోటీ ప్రపంచంలో ముఖ్యంగా కావల్సింది లాంగ్వేజ్ స్కిల్స్(Language Skills). చదువుకున్నా లేకపోయినా ఇంగ్లీషు మాట్లాడటం, చదవడం, రాయడం వస్తే చాలు అవకాశాలు అన్నీ హాయిగా వచ్చేస్తాయి. ఇప్పుడందుకే గూగుల్ సరికొత్త ఫీచర్ (Google New Feature)ప్రవేశపెట్టింది. యూజర్లకు ఉచితంగా ఇంగ్లీషు నేర్పించేందుకు సిద్దమైంది. ఈ ఫీచర్ సహాయంతో ప్రతిరోజూ కొత్త ఇంగ్లీషు అర్ధాన్ని నేర్చుకోవచ్చు. యూజర్లు తమ ఫోన్‌లలో ఈ ఫీచర్‌ను యాక్టివేట్ చేసుకుంటే గూగుల్ ప్రతి రోజూ కొత్త అర్ధాన్ని నేర్పిస్తుంది. దీనికోసం సెర్చ్ ఇంజన్ ఇంగ్లీషులో ప్రావీణ్యులైన అధ్యాపకుల్ని నియమించినట్టు గూగుల్ తెలిపింది. ఈ ఫీచర్ ద్వారా ఇంగ్లీషు భాషపై పట్టు సాధించవచ్చని గూగుల్ అభిప్రాయం వ్యక్తం చేస్తోంది. 2021 సెప్టెంబర్ నెలలో గూగుల్ ట్రెండ్స్‌లోని టాప్ సెర్చ్‌లో కొన్ని ఇంగ్లీషు అర్ధాలకై ఎక్కువగా సెర్చ్ చేసినట్టు గూగుల్ తెలిపింది. ఇందులో ఇంట్రోవర్ట్, ఇంటిగ్రిటీ అనే పదాలున్నాయని గూగుల్ స్పష్టం చేసింది. అందుకే యూజర్ల రోజువారీ జీవితాల్లో అవసరమైన ఇంగ్లీషులో నైపుణ్యం సాధించేలా ఈ ఫీచర్ అందుబాటులో తెచ్చినట్టు గూగుల్ వెల్లడించింది. 

గూగుల్ కొత్త ఫీచర్ ఎలా యాక్టివేట్ చేసుకోవాలి(How to Activate Google new Feature)

ముందుగా గూగుల్(Google)క్రోమ్ ఓపెన్ చేయాలి. ఓపెన్ చేసిన తరువాత సెర్చ్ బార్‌లో ఉదాహరణకై ఇంటిగ్రిటీ అనే పదానికి అర్ధం తెలుసుకోవాలంటే ముందుగా Define అని టైప్ చేయాలి. ఆ వర్డ్ పక్కనే ఇంటిగ్రిటీ అని టైప్ చేస్తే అర్ధం వస్తుంది. సెర్చ్ బార్ పక్కన బెల్ ఐకాన్ కన్పిస్తుంది. ఆ ఐకాన్‌ను యాక్టివేట్ చేసుకుంటే గూగుల్ ప్రతిరోజూ ఓ కొత్త అర్ధాన్ని నేర్పించేలా మొబైల్‌కు నోటిఫికేషన్ వస్తుంది. 

Also read: Trekking Tragedy: హిమాచల్‌ప్రదేశ్ ట్రెక్కింగ్ విషాదంలో 11కు చేరిన మృతుల సంఖ్య

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter , Facebook

Trending News