Cockroach Remedies: మీ ఇంట్లో బొద్దింకల బెడద ఎక్కువ ఉన్నట్లయితే.. వాటిని నియంత్రించేందుకు మీరు తక్షణం చర్యలు తీసుకోక తప్పదు. ఎందుకంటే అవి మీ ఇంటిల్లిపాది ఆస్పత్రి పాలయ్యేందుకు కారణం కావొచ్చు. వాటి వల్ల ఫుడ్ పాయిజనింగ్ అవుతుంది. అలాంటి కలుషిత ఆహారాన్ని తినడం వల్ల అనారోగ్యం బారిన పడే అవకాశం ఉంది. ఈ క్రమంలో బొద్దింకల నియంత్రణకు పాటించాల్సిన 5 చిట్కాలను ఇప్పుడు తెలుసుకుందాం.
1. లవంగాలు
లవంగంలో అనేక ఔషధ గుణాలు కలిగి ఉన్నాయి. ఇది నోటి దుర్వాసన, జలుబుకు ఔషధంలా పనిచేయడం సహా శరీరంలో రోగనిరోధక శక్తి పెంచడంలో సహాయపడుతుంది. లవంగాలు.. బొద్దింకల నియంత్రణకు ఉపయోగపడతాయి. బహుశా ఈ విషయం ఎక్కువ మందికి తెలియకపోవచ్చు. ఇంట్లోని అనేక మూలల్లో లవంగాలను ఉంచడం వల్ల బొద్దింకలు పారిపోతాయి.
2. కిరోసిన్ ఆయిల్
బొద్దింకలు కిరోసిన్ ఆయిల్ వాసనను ఇష్టపడవు. ఆ వాసన నుంచి అవి దూరంగా పారిపోవడానికి ప్రయత్నిస్తాయి. ఇలా బొద్దింకల నియంత్రణలో భాగంగా కొంత మొత్తం నీటిలో కిరోసిన్ కలిపి.. ఇంటి మూలల్లో చల్లాలి. అలా చేయడం వల్ల బొద్దింకలు పారిపోతాయి.
3. బే లీవ్స్ (బిరియానీ ఆకులు)
ఆహారంలో రుచిని పెంచేందుకు ఈ బే లీవ్స్ ను ఉపయోగిస్తారు. బిరియానీలో కూడా ఈ ఆకులు వినియోగిస్తారు. బొద్దింకలను వదిలించుకోవడానికి ఇది దివ్య ఔషధం అని చాలా మందికి తెలుసు. ఈ ఆకుల నుంచి వచ్చే వాసనను బొద్దింకలు తట్టుకోలేవు. బిరియానీ ఆకులను పొడి చేసి.. దాన్ని ఇంట్లోని మూలల్లో చల్లితే బొద్దింకలు ఇంటి దరిదాపుల్లోకి కూడా రావు.
4. బోరిక్ పౌడర్
బోరిక్ పౌడర్ తినడం వల్ల బొద్దింక బతకదు. ఈ పొడిని పంచదారతో కలిపి మాత్రలు తయారు చేసి, బొద్దింకలు ఎక్కువగా వచ్చే ప్రదేశాలలో ఉంచండి. వాటిని ఇంట్లోని చిన్న పిల్లలకు దూరంగా ఉంచాలి.
5. హౌస్ క్లీనింగ్
బొద్దింకలు మురికి ప్రదేశాలలో నివసించడానికి ఇష్టపడతాయి. ఆ మురికి ప్రదేశాల్లోనే గుడ్లు పెట్టేందుకు అవి ఇష్టపడతాయి. కిచెన్ సింక్, బాత్రూమ్ మెష్, ఇంటి మూలలను శుభ్రం చేస్తే అక్కడ బొద్దింకలు కనిపించవు. బొద్దింకల నియంత్రణ కోసం ఇంటిని ప్రతిరోజూ శుభ్రపరుచుకోండి.
Also Read: UPSC Interview Questions: UPSC లెవల్ క్వశ్చన్.. మార్కెట్లో కొనలేని ఫ్రూట్ పేరు ఏంటి?
Also Read: WhatsApp Tricks: మిమ్మల్ని బ్లాక్ చేసిన వారికి మెసేజ్ చేయాలా? ఈ ట్రిక్ ఫాలో అవ్వండి!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter, Facebook