Skin Care Tips: ఈ ఫేస్‌మాస్క్ వారానికి రెండుసార్లు రాస్తే చాలు, చర్మం మృదువుగా నిగనిగలాడటం ఖాయం

Skin Care Tips: అందం, ఆరోగ్యం రెండూ ముఖ్యమే. చర్మ సంరక్షణ అనేది సీజన్‌తో సంబంధం లేకుండా చూసుకోవల్సిన పని. ఎందుకంటే అందం అనేది చర్మ సంరక్షణపైనే ఆధారపడి ఉంటుంది. సౌందర్య పరిరక్షణకు ఏం చేయాలనేది తెలుసుకుందాం..

Written by - Md. Abdul Rehaman | Last Updated : May 12, 2023, 05:16 PM IST
Skin Care Tips: ఈ ఫేస్‌మాస్క్ వారానికి రెండుసార్లు రాస్తే చాలు, చర్మం మృదువుగా నిగనిగలాడటం ఖాయం

Skin Care Tips: ప్రకృతిలో లభించే వివిధ రకాల పదార్ధాల్లో ఎన్నో రకాల పోషకాలున్నాయి. వీటిని సక్రమంగా ఉపయోగించగలిగితే చాలు అటు ఆరోగ్యం ఇటు అందం రెండూ దక్కుతాయి. చర్మం ఎంత మృదువుగా, ఎంత నిగారింపుతో ఉంటే అంత అందంగా ఉంటారు ఎవరైనా.

ఆధునిక జీవనశైలి, వివిధ రకాల ఆహారపు అలవాట్లు, ఎండకు వానకు తిరగడం, చలికి ఎక్స్‌పోజ్ అవడం ఇలా వివిధ కారణాలతో ముందుగా దెబ్బతినేది చర్మమే. చర్మం అందం కోల్పోయి నిర్జీవంగా మారుతుంటుంది. ఈ నేపధ్యంలో కోకోనట్ ఆయిల్ ఫేస్‌మాస్క్ అత్యద్భుతంగా పనిచేస్తుంది. ఇందులో ఉండే యాంటీ ఇన్‌ఫ్లమేటరీ గుణాల కారణంగా కొలాజెన్ వృద్ధి చెందుతుంది. మీ చర్మం మరింత మృదువుగా మారి, నిగనిగాడుతుంది. 

కొబ్బరి నూనె అనేది యాంటీ బ్యాక్టీరియల్, యాంటీ ఆక్సిడెంటల్, యాంటీ ఫంగల్ వంటి గుణాలతో నిండి ఉంటుంది. దాంతోపాటు కోకోనట్ ఆయిల్ సహాయంతో చర్మం డ్రైనెస్ తగ్గుతుంది. చర్మంలో తేమను స్థిరంగా ఉంచుతుంది. అందుకే కోకోనట్ ఆయిల్ ఫేస్‌మాస్క్ వినియోగించమని సౌందర్య నిపుణులు సూచిస్తున్నారు. ఈ ఫేస్‌మాస్క్ కాఫీ సహాయంతో తయారౌతుంది. కాఫీలో ఉండే యాంటీ ఇన్‌ఫ్లమేటరీ గుణాలు కొలాజెన్ ఉత్పత్తికి కారణమౌతాయి. ఫలితంగా ఈ ఫేస్‌మాస్క్ అప్లై చేసినప్పుడు చర్మంలో తేమ స్థిరంగా ఉంటుంది. చర్మం మరింత మృదువుగా మారుతుంది. మీ చర్మంపై కన్పించే ఏజీయింగ్ లక్షణాల్ని తగ్గించడంలో కోకోనట్ ఆయిల్ కీలకపాత్ర పోషిస్తుంది. క్రమం తప్పకుండా వాడటం వల్ల నిత్య యౌవనం, నిగారింపు, మెరిసే చర్మం మీ సొంతమౌతాయి. అసలీ కోకోనట్ ఆయిల్ ఫేస్‌మాస్క్ ఎలా తయారు చేయాలి, ఎలా అప్లై చేయాలో తెలుసుకుందాం..

కోకోనట్ ఆయిల్ ఫేస్‌మాస్క్ తయారు చేసేందుకు కాఫీ గ్రౌండ్ కొద్దిగా అవసరమౌతుంది. కొబ్బరి నూనె కూడా ఒక స్పూన్ అవసరం. ముందుగా కొబ్బరినూనెను తీసుకుని కొద్దిగా వేడి చేసి ఓ చిన్న గిన్నెలో వేయాలి. ఆ తరువాత ఇందులో కాఫీ గ్రౌండ్ కలపాలి. ఈ రెండింటినీ బాగా కలపాలి. అంతే మీకు కావల్సిన కోకోనట్ ఆయిల్ ఫేస్‌మాస్క్ సిద్ధం.

కోకోనట్ ఆయిల్ ఫేస్‌మాస్క్ రాసేముందు ముఖాన్ని నీళ్లతో శుభ్రం చేసుకుని తుడుచుకోవాలి. ఇప్పుడీ ఫేస్‌మాస్క్‌ను ముఖానికి పూర్తిగా అప్లై చేయాలి. ఆ తరువాత వృత్తాకారంలో నెమ్మదిగా మసాజ్ చేసుకోవాలి. ఓ పది నిమిషాల తరువాత నీళ్లతో శుభ్రం చేసుకుంటే చాలు. ఇలా  వారానికి రెండుసార్లు అప్లై చేస్తే చాలు మీ చర్మం మరింత మృదువుగా, కాంతివంతమై నిగనిగలాడుతుంది.

Also read; Cholesterol Tips: శరీరంలో కొలెస్ట్రాల్ పెరుగుతోందా, ఈ సంకేతాలుంటే తస్మాత్ జాగ్రత్త

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News