Best Breakfast: బరువు తగ్గించేందుకు దోహదపడే రుచికరమైన ఐదు అల్పాహారాలివే

Best Breakfast: ఓ పూట భోజనం మానేసినా ఫరవాలేదు గానీ..నెవర్ ఎవర్ స్కిప్ బ్రేక్‌ఫాస్ట్ అంటారు వైద్యులు. మరి వెయిట్ లాస్ ప్రోగ్రామ్‌లో ఉన్నప్పుడు ఎలా. అందుకే బరువు తగ్గేందుకు దోహదపడే రుచికరమైన అల్పాహారాలేంటో తెలుసుకుందాం..

Written by - Md. Abdul Rehaman | Last Updated : Mar 29, 2022, 11:42 AM IST
Best Breakfast: బరువు తగ్గించేందుకు దోహదపడే రుచికరమైన ఐదు అల్పాహారాలివే

Best Breakfast: ఓ పూట భోజనం మానేసినా ఫరవాలేదు గానీ..నెవర్ ఎవర్ స్కిప్ బ్రేక్‌ఫాస్ట్ అంటారు వైద్యులు. మరి వెయిట్ లాస్ ప్రోగ్రామ్‌లో ఉన్నప్పుడు ఎలా. అందుకే బరువు తగ్గేందుకు దోహదపడే రుచికరమైన అల్పాహారాలేంటో తెలుసుకుందాం..

ఆధునిక జీవనశైలితో వస్తున్న ప్రధాన మార్పుల్లో ఒకటి స్థూలకాయం. అందుకే చాలామంది వెయిట్ లాస్ ప్రోగ్రామ్ పాటిస్తుంటారు. ఇది కాస్త సవాళ్లతో కూడుకున్నదే. తక్కువ కార్బోహైడ్రేట్లు, తక్కువ కేలరీలు ఉండే అల్పాహారం తీసుకోవడం చాలా మంచిది. అయితే ఆ ఆల్పాహారాలు ఏంటి, ఎలా తయారు చేయాలనేది పరిశీలిద్దాం. ఇందులో ఐదు రుచికరమైన అల్పాహారాలున్నాయి. ఇవి మీ వెయిట్ లాస్ జర్నీపై ఏ విధమైన ప్రభావం చూపించవు. అదే సమయంలో ఆరోగ్యానికి మేలు చేకూరుస్తాయి.

స్పినాచ్ ఆమ్లెట్

ముల్లంగితో కూడిన ఆమ్లెట్ ఆరోగ్యానికి చాలా మంచిది. రుచికరమైన ఛీజ్‌తో కలిపి తీసుకుంటే రుచి కూడా ఉంటుంది. ఇది తయారు చేసేందుకు పెద్దగా శ్రమ పడాల్సిన అవసరం లేదు. చాలా సులభంగా 5 నిమిషాల్లోనే చేసేయవచ్చు. ఇది పూర్తిగా లో కార్బ్ డైట్

కెటో ఉప్మా

వెజ్ ఉప్మా చేయడమంత సులభం మరొకటి లేదు. కాలిఫ్లవర్, కూరగాయలు, మసాలాతో కలిపి వండే ఉప్మా ఆరోగ్యానికి..అటు వెయిట్ లాస్‌కు చాలా మంచిది. అదనపు రుచికి ఇంకేమైనా మిక్స్ చేసుకోవచ్చు.

యాపిల్ మరియు చియా సీడ్ 

ఇది ఆరోగ్యానికి మంచిది..చాలా రుచికరమైంది. మూడు ప్రధాన వస్తువులతో కేవలం 5 నిమిషాల్లో చేయవచ్చు. యాపిల్ చియా సీడ్స్‌ను అల్పాహారంగా తీసుకుంటే చాలా ప్రయోజనాలున్నాయి. ఫైబర్ ఎక్కువ మోతాదులో ఉండటం వల్ల శరీరంలో మెటాబొలిక్ ప్రక్రియ సజావుగా సాగుతుంది. 

థెప్లా

ఇదొక గుజరాతీ సాంప్రదాయ వంటకం గోధుమ పిండితో చేసే అల్పాహారం ఇది. ఇందులో ఫ్లెక్స్ సీడ్స్ మెంతినీరు ఉంటుంది. ఇది పూర్తిగా లో కార్బ్ కావడంతో ఆరోగ్యానికి చాలా మంచిది. 

కెటో పోహా

కెటో పోహా అనేది కాలిఫ్లవర్ ఫ్లోరెట్స్, బియ్యంతో కలిపి వండుతారు. కాలిఫ్లవర్ స్టెమ్స్‌ను బంగాళాదుంపలకు ప్రత్యామ్నాయంగా ఉపయోగించవచ్చు. చాలా త్వరగా కేవలం 5 నిమిషాల్లోనే వండవచ్చు. 

Also read: Insomnia: ఇన్‌సోమ్నియాకు కారణాలేంటి, మీకూ ఆ సమస్య ఉందా..ఈ చిట్కాలు పాటించండి

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News