Flax Seed Benefits: చర్మ, జుట్టు సమస్యలున్నవారికి అవిసె గింజలతో చక్కటి చిట్కాలు..

Flax Seed Benefits:  అవిసె గింజలను ఆహారంలో వినియోగించడం వల్ల శరీరానికి చాలా రకాల ప్రయోజనాలు కలుగుతాయి. అంతేకాకుండా శరీరాన్ని వ్యాధుల నుంచి సులభంగా సంరక్షిస్తుంది. కాబట్టి అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న వారు తప్పకుండా వీటిని ఆహారాల్లో వినియోగించండి.

Written by - ZH Telugu Desk | Last Updated : Nov 10, 2022, 02:14 PM IST
Flax Seed Benefits: చర్మ, జుట్టు సమస్యలున్నవారికి అవిసె గింజలతో చక్కటి చిట్కాలు..

Flax Seed Benefits: అవిసె గింజల గురించి అందరికీ తెలిసే ఉంటుంది. అవిసె గింజలు ఆరోగ్యానికి చాలా మేలు చేస్తాయి. వీటిరి ఆహారంలో క్రమం తప్పకుండా తీసుకుంటే మధుమేహం, బరువు తగ్గడం, రక్తపోటు మొదలైన సమస్యలు కూడా సులభంగా దూరమవుతాయని వైద్య నిపుణులు తెలుపుతున్నారు. కానీ ఇందులో ఉండే గుణాలు చర్మం, జుట్టుకు కూడా చాలా మేలు చేస్తుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ప్రస్తుతం ఆధునిక జీవన శైలి కారణంగా చాలా మంది అనారోగ్య సమస్యలతో పాటు చర్మం, జుట్టు సమస్యలతో బాధపడుతున్నారు. అయితే ఈ సమస్యల నుంచి సులభంగా ఉపశమనం పొందడానికి ఈ అవిసె గింజలను వినియోగించాల్సి ఉంటుంది.

అవిసె గింజల్లో ప్రొటీన్, డైటరీ ఫైబర్, ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్, యాంటీ ఆక్సిడెంట్లు, విటమిన్ ఇ, విటమిన్ బి, మాంగనీస్, సెలీనియం, లినోలిక్ యాసిడ్ వంటి పోషకాలు పుష్కలంగా లభిస్తాయి. ఇవి జుట్టు ఆరోగ్యానికి చాలా మేలు చేస్తాయని వైద్య నిపుణులు చెబుతున్నారు. జుట్టులో సమస్యలు, చర్మ సమస్యలు ఉంటే వీటిని ఎలా వినియోగించాలో ఇప్పుడు మనం తెలుసుకుందాం..

జుట్టుకు కండిషన్:
ఫ్లాక్స్ సీడ్ జుట్టును కండిషన్ చేయడానికి కీలక పాత్ర పోషిస్తుంది. కాబట్టి వీటిని క్రమం తప్పకుండా తీసుకోవడం వల్ల జుట్టు లోపలి నుంచి పోషణను పొందుతుంది. దీంతో జుట్టు సమస్యలన్నీ తగ్గి జుట్టు పొడి బారడం ఇతర సమస్యలు కూడా సులభంగా దూరమవుతాయని నిపుణులు చెబుతున్నారు. వీటిని క్రమం తప్పకుండా ఆహారాల్లో వినియోగిస్తే జుట్టు రాలడం వంటి సమస్యలు కూడా దూరమవుతాయి. కాబట్టి జుట్టు సమస్యలతో బాధపడుతున్న వారు తప్పకుండా వీటిని ఆహారంలో తీసుకోండి.

కర్లీ హెయిర్ కోసం చక్కటి చిట్కా:
కర్లీ హెయిర్‌ ను హ్యాండిల్ చేయడం అంత తేలికైన పని కాదు. అయితే కర్లీ హెయిర్ ఉండడం వల్ల జుట్టు విరిగిపోతుంది. ఈ సమస్యల నుంచి సులభంగా ఉపశమనం పొందడానికి విటమిన్ ఇ, ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్‌ కలిగి అవిసె గింజలను వినియోగించాలని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు. వీటిని క్రమం తప్పకుండా వినియోగిస్తే జుట్టును మృదువుగా, ఒత్తుగా మారుతుంది.

NOTE: ఇక్కడ ఇవ్వబడిన సమాచారం సాధారణ సమాచారంపై ఆధారపడి ఉంటుంది. దయచేసి దీనిని స్వీకరించే ముందు వైద్య సలహా తీసుకోండి. ZEE NEWS దీన్ని ధృవీకరించలేదు.

 

Also Read: Giant Python Viral Video: యువకుని మెడకు చుట్టుకున్న కొండచిలువ.. చివరి ఏం జరిగిందో మీరు తప్పకుండా చూడాలి..

Also Read: Python Snake: పక్కగా ఫ్లాన్‌ వేసి.. కొండ చిలువను ఈ అమ్మాయి ఎలా పట్టిందో చూడండి.!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

Android Link https://bit.ly/3P3R74U

Apple Link - https://apple.co/3loQYe 

Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి 

 

 

Trending News