Reliance Jio Annual Plans : కొత్త జియో వార్షిక ప్రీపెయిడ్ మొబైల్ ప్లాన్ లు…ఈసారి అమెజాన్ ప్రైమ్ కూడా

Reliance Jio Annual Plans: ఎప్పుడూ ఏదో ఒక కొత్త ప్లాన్స్ తో సబ్స్క్రైబర్లకు అనేక ఆఫర్లు అందించడంలో రిలయన్స్ జియో ముందు ఉంటుంది. అంతేకాదు అనేక యాప్ లకు మనకి ఫ్రీ సబ్స్క్రిప్షన్ కూడా అందిస్తుంది. ఇక తాజాగా రిలయన్స్ వారు మరో కొత్త వార్షిక ప్రీపెయిడ్ మొబైల్ ప్లాన్లను విడుదల చేశారు. ఇందులో ఒక ప్లాన్ తో అమెజాన్ ప్రైమ్ సబ్క్క్రిప్షన్ కూడా మీకు ఫ్రీగా లభిస్తుంది. మరి ఈ ఆఫర్లు ఏవో చూద్దాం.

Written by - ZH Telugu Desk | Last Updated : Oct 24, 2023, 08:56 AM IST
Reliance Jio Annual Plans : కొత్త జియో వార్షిక ప్రీపెయిడ్ మొబైల్ ప్లాన్ లు…ఈసారి అమెజాన్ ప్రైమ్ కూడా

Reliance Jio : ఎన్ని నెట్వర్క్స్ ఉన్నా కానీ రిలయన్స్ జియోకి ఉన్న ప్రత్యేకత వేరు. ఎప్పటికప్పుడు కొత్త ప్లాన్లు డిస్కౌంట్లు విడుదల చేయడంలో రిలయన్స్ కి రిలయన్స్ వారే సాటి. ఈ ప్లాన్లతో ఫోన్ కాల్స్ మాత్రమే కాదు, డేటా  Disney+ Hotstar, SonyLIV, ZEE5 వంటి ప్రముఖ OTT సర్వీసులకు యాక్సెస్‌తో సహా అనేక బెనిఫిట్స్ అందిస్తాయి. ఇక ఎప్పుడూ అక్కడితో ఆగకుండా అమెజాన్ ప్రైమ్ కి కూడా పాకేసింది మన రిలయన్స్ ఆఫర్. ఇప్పుడు, ఎన్నో OTT ప్రయోజనాలతో కూడిన జియో వార్షిక ప్లాన్లను ఒకసారి చూసేద్దాం.

రూ. 2545 ప్లాన్ వివరాలు :

ఈ ప్లాన్ 336 రోజుల వ్యాలిడిటీతో వచ్చేసింది. ఈ ప్లాన్ వేసుకున్నవారికి అన్‌లిమిటెడ్ వాయిస్ కాల్స్, 100 రోజువారీ SMS, రోజువారీ 1.5GB డేటా, JioTV, JioCinema, JioSecurityకి ఉచిత యాక్సెస్ వంటి లాభాలు ఉంటాయి. ఈ ప్లాన్ ఎక్స్‌టెండెడ్ కనెక్టివిటీ, ఎంటర్‌టైన్మెంట్ ఎక్స్‌పీరియన్స్ అందిస్తుంది.

రూ. 3178 ప్లాన్ వివరాలు :

ఈ ప్లాన్ వాలిడిటీ కూడా ఒక సంవత్సరమే అనగా 365 రోజులు. కాగా ఈ ప్లాన్ వేసుకున్న వారికి 2GB రోజువారీ డేటా, అన్‌లిమిటెడ్ వాయిస్ కాలింగ్, 100 రోజువారీ SMSలను అందిస్తుంది. అంతేకాకుండా ఈ ప్లాన్ వారు సంవత్సరం మొత్తం  ఏడాదికి JioTV, JioCloud, JioCinema, Disney+ హాట్‌స్టార్‌లకు కూడా యాక్సెస్ పొందుతారు. 

రూ. 3,225 ప్లాన్ వివరాలు :

ఇక ఇది కూడా సంవత్సరం వాలిడిటీతో వచ్చే ప్రీపెయిడ్ ప్యాకేజ్. ఈ ప్లాన్‌ వేసుకున్న వారికి అన్లిమిటెడ్ ఫైజీ డేటా తో పాటు 2GB రోజువారీ డేటా, అన్‌లిమిటెడ్ వాయిస్ కాల్‌లు, 100 రోజువారీ SMSలు లాంటి ప్రయోగాలు ఉంటాయి. అలానే కాకుండా ప్రత్యేకమైన జీ ఫైవ్ ప్యాకేజ్ ఇంకా JioTV, JioCinema, JioCloudకి యాక్సెస్‌ను ఈ ప్యాకేజ్ అందిస్తుంది. అదనంగా, ఈ టాప్ ప్లాన్‌లో SonyLiv కూడా ఉంది. 

రూ. 3,226 ప్లాన్ వివరాలు :

365 రోజులు వాలిడిటీ తో వచ్చే ఈ ప్లాన్ తో మీరు 2GB రోజువారీ డేటా, అన్‌లిమిటెడ్ 5G డేటా, అన్లిమిటెడ్ కాల్స్, 100 రోజువారీ SMSలు, వంటి సదుపాయాలు పొందవచ్చుహ అలానే Sony LIV ప్రత్యేక బెనిఫిట్స్ కూడా పొందవచ్చు. ఇక వీటితో పాటు 
JioCinema, JioCloud,‌ JioTV కి యాక్సెస్‌ని పొందవచ్చు. 

ఉచిత అమెజాన్ ప్రైమ్‌తో జియో వార్షిక ప్లాన్ :

రూ. 3,227 ప్లాన్ వివరాలు :

ఈ సంవత్సరం విడుదలైన ప్లాంట్స్ లో ఇది ప్రత్యేకమైన ప్లాన్ అని చెప్పొచ్చు. 365 రోజుల వాలిడిటీ తో వచ్చిన ఈ ప్లాన్ తో ప్రైమ్ వీడియో మొబైల్ ఎడిషన్‌కు యాక్సెస్‌ను కలిగి ఉంటుంది. ఈ ప్లాన్ రోజుకు 2GB డేటా, అన్‌లిమిటెడ్ వాయిస్ కాల్స్, రోజుకు 100 SMSలను అందిస్తుంది. అంతేకాకుండా జియో కి సంబంధించిన అన్ని యాప్స్ ను ఈ ప్లాన్ ద్వారా పొందొచ్చు. ఈ ప్లాన్ ఎక్కువ డేటా, ప్రముఖ స్ట్రీమింగ్ సర్వీసులకు యాక్సెస్ కోరుకునే యూజర్లకు బాగా ఉపయోగపడుతుంది.

Also read: Rahul Gandhi Speech: తెలంగాణలో ఆ 6 గ్యారంటీలను అమలు చేస్తాం.. రాహుల్ గాంధీ

Also read: Rahul Gandhi Speech: తెలంగాణలో ఆ 6 గ్యారంటీలను అమలు చేస్తాం.. రాహుల్ గాంధీ

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News