Gourd Juice In Telugu: ప్రస్తుతం చాలా మంది అధిక బరువుతో బాధపడుతున్నవారు. అంతేకాకుండా కొంతమంది జీర్ణక్రియ సమస్యల బారిన కూడా పడుతున్నారు. నిజానికి ఇవి చిన్న సమస్యలైనప్పటికీ అనేక రకాల దీర్ఘకాలిక వ్యాధుల బారిన పడే అవకాశాలు ఉన్నాయని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు. ఆరోగ్య నిపుణులు తెలిపిన వివరాల ప్రకారం, ఇలాంటి సమస్యలతో బాధపడేవారు తప్పకుండా ప్రతి రోజు ఆహారాలు డైట్ పద్ధతిలో చేర్చుకోవాల్సి ఉంటుంది. ముఖ్యంగా డైట్‌లో భాగంగా సొరకాయ రసం తీసుకోవడం వల్ల అద్భుతమైన లాభాలు పొందుతారని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు. ప్రతి రోజు ఈ సొరకాయ రసం తాగడం వల్ల కలిగే ప్రయోజనాలేంటో ఇప్పుడు తెలుసుకోండి.
సొరకాయ రసం తాగడం వల్ల కలిగే ప్రయోజనాలు:
జీర్ణ వ్యవస్థకు మేలు:
సొరకాయలో పుష్కలంగా పీచు ఉంటుంది. ఇది మలబద్ధకం, అజీర్ణం వంటి సమస్యలను నివారించేందుకు కీలక పాత్ర పోషిస్తుందని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు. ఇందులో ఉండే కొన్ని మూలకాలు జీర్ణక్రియను మెరుగుపరచి ఆరోగ్యకరమైన జీర్ణవ్యవస్థను తయారు చేసేందుకు కీలక పాత్ర పోషిస్తుందని నిపుణులు తెలుపుతున్నారు.
బరువు తగ్గడానికి సహాయపడుతుంది:
సొరకాయ రసంలో కేలరీలు అతి తక్కువగా ఉంటాయి. కాబట్టి రోజు ఉదయాన్నే ఈ రసం తాగడం వల్ల శరీరంలోని జీవక్రియ మెరుగుపడుతుంది. అంతేకాకుండా అదనపు కేలరీల నుంచి కూడా విముక్తి కలుగుతుంది. ఫలితంగా బరువు తగ్గడానికి దోహదపడుతుందని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు. ముఖ్యంగా సులభంగా బరువు తగ్గాలనుకునేవారు ప్రతి రోజు ఈ రసాన్ని ఉదాన్నే తాగండి.
హైబీపీని నియంత్రిస్తుంది:
సొరకాయ రసంలో ఎక్కువ మోతాదులో పొటాషియం కూడా లభిస్తుంది. ఇది రక్తపోటును నియంత్రించడానికి సహాయపడుతుందని ఆరోగ్య నిపుణులు తెలుపులున్నారు. అంతేకాకుండా రోజూ సొరకాయ రసం తాగడం వల్ల హైబీపీ సమస్య పూర్తిగా తగ్గుతుందని ఆయుర్వేద నిపుణులు తెలుపుతున్నారు.
మధుమేహాన్ని నియంత్రిస్తుంది:
సొరకాయ రసంలో తక్కువ పరిమాణంలో చక్కెర శాతం లభిస్తుంది. కాబట్టి రోజు తాగడం వల్ల మధుమేహం నుంచి విముక్తి కలుగుతుంది. అంతేకాకుండా సులభంగా రక్తంలోని చక్కెర పరిమాణాలు కూడా నియంత్రణలో ఉంటాయని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు. ఇవే కాకుండా మధుమేహం ఉన్నవారికి ఈ రసం రోజు తాగడం వల్ల అద్భుతమైన ప్రయోజనాలు కలుగుతాయి.
ఇదీ చదవండి: మాజీ మంత్రి ఎన్సీపీ లీడర్ బాబా సిద్ధిఖీ దారుణ హత్య.. సల్మాన్ ఖాన్‌కు ఈ మర్డర్‌తో ఉన్న లింక్ అదేనా?
జుట్టు ఆరోగ్యానికి మేలు:
సొరకాయలో విటమిన్లు, ఖనిజాలు అధిక పరిమాణంలో లభిస్తాయి. కాబట్టి ప్రతి రోజు దీనితో తయారు చేసిన రసం తాగడం వల్ల జుట్టు ఆరోగ్యం మెరుగుపడుతుంది. అంతేకాకుండా జుట్టు రాలడం, చుండ్రు సమస్యల నుంచి కూడా విముక్తి కలుగుతుందని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు.
ఇదీ చదవండి: మాజీ మంత్రి ఎన్సీపీ లీడర్ బాబా సిద్ధిఖీ దారుణ హత్య.. సల్మాన్ ఖాన్‌కు ఈ మర్డర్‌తో ఉన్న లింక్ అదేనా?