Hair Pack Tips: కేశ సంరక్షణను మహిళలు చాలా కీలకంగా భావిస్తారు. ఎందుకంటే మహిళల అందాన్ని నాలుగింతలు పెంచడం గానీ, తగ్గించడం గానీ కేశాలపైనే ఆధారపడి ఉంటుంది. అయితే వేసవిలో మట్టి, దుమ్ము, ధూళి, చెమట, ఎండ కారణంగా కేశాలు తీవ్రంగా దెబ్బతింటుంటాయి. ఈ సమస్య నుంచి సంరక్షించుకునేందుకు కొన్ని చిట్కాలు ఉన్నాయి..
కేశ సంబంధిత సమస్యలు చాలా మందికి ఉంటాయి. కేశాలు నిర్జీవంగా ఉండి కాంతి కోల్పోవడం, జిడ్డుగా ఉండటం, పెళుసుగా ఉండటం, డాండ్రఫ్, జుట్టు రాలడం, సిల్కీ అండ్ షైనీగా లేకపోవడం ఈ తరహా సమస్యలు ఎదుర్కొంటుంటారు. ఈ సమస్యల్నించి గట్టెక్కేందుకు హోమ్ మేడ్ హెయిర్ ప్యాక్ అద్భుతంగా పనిచేస్తుంది. ఈ హెయిర్ ప్యాక్ మీ కేశాల్ని సిల్కీగా, షైనీగా మారుస్తాయి. అంతేకాకుండా డేండ్రఫ్, జుట్టు నెరిసిపోవడం వంటి సమస్యలను తగ్గిస్తుంది.
కేశాల సంరక్షణ వేసవిలో మరింత అవసరం. ఎందుకంటే ఈ సమయంలో వాతావరణానికి అంటే ఎండకు ఎక్స్‌పోజ్ అవడం వల్ల కేశాలు దెబ్బతింటుంటాయి. మట్టి, దుమ్ము, ధూళి పడటం వల్ల జుట్టు నిగారింపును కోల్పోతుంది. దీనికోసం చాలామంది హెయిర్ స్పా లేదా కెరోటిన్ ట్రీట్‌మెంట్ తీసుకుంటుంటారు. కానీ ఇది అత్యంత ఖరీదైందే కాకుండా రసాయనికం కావడంతో దుష్పరిణామాలు కలగవచ్చు. ఆర్ధికంగా కూడా సమస్యగా మారుతుంది. అయితే మీ కేశాల్ని సిల్కీ, షైనీగా మార్చేందుకు , డేండ్రఫ్ నుంచి వముక్తి కల్గించేందుకు, తెల్ల జుట్టు సమస్య దూరం చేసేందుకు కాఫీ పౌడర్ హెయిర్ ప్యాక్ అద్భుత ప్రయోజనాలనిస్తుంది.
కాఫీ పౌడర్ హెయిర్ ప్యాక్ తయారీ ఎలా
కాఫీ పౌడర్ హెయిర్ ప్యాక్ చేసేందుకు ముందుగా ఓ గిన్నె తీసుకోవాలి. ఇందులో ఒక స్పూన్ కాఫీ పౌడర్, 2 స్పూన్‌ల కేస్టర్ ఆయిల్ కలపాలి. ఆ తరువాత ఈ రెండింటినీ బాగా కలపాలి. అంతే కాఫీ పౌడర్ ప్యాక్ సిద్ధమైనట్టే. ఈ ప్యాక్‌ను రాసేముందు కేశాల్ని తడపాలి. ఆ తరువాత జుట్టుకు బాగా పట్టించాలి. దాదాపు ఓ గంట అలానే ఉంచాలి. ఆ తరువాత మైల్డ్ షాంపూతో శుభ్రం చేసుకోవాలి. వారంలో కనీసం 2-3 సార్లు అప్లై చేస్తే మంచి ఫలితాలుంటాయి.
Also read: Vitamin b12 Deficiency: మతిమరుపు సమస్యలకు కారణం ఇదే.. ఈ లోపం ఉంటే ఈ ఆహారాలు తీసుకోవాలి..
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook