Benefits of Mango: మామిడి పండు తినడం వల్ల ఇన్ని లాభాలు ఉన్నాయా?

Mango Benefits: వేసవిలో దొరికే రుచికరమైన పండ్లలో మామిడి ఒకటి. ఇది ఆరోగ్యానికి చాలా మేలు చేస్తుంది. మామిడి ఎన్నో రకాల వ్యాధులను దూరం చేస్తాయి. దీనిని తినడం వల్ల కలిగే ప్రయోజనాలేంటో తెలుసుకుందాం.  

Written by - Samala Srinivas | Edited by - ZH Telugu Desk | Last Updated : May 12, 2023, 07:19 PM IST
Benefits of Mango: మామిడి పండు తినడం వల్ల ఇన్ని లాభాలు ఉన్నాయా?

Health Benefits of Mangoes: పండ్లలో రారాజుగా మామిడి పండును పిలుస్తారు. ఇది వేసవిలో ఎక్కువగా దొరికే ప్రూట్. దీనిని తినడం వల్ల ఎన్నో ఆరోగ్యకర ప్రయోజనాలు ఉన్నాయి. ఇందులో పైబర్, విటమిన్లు మరియు ఖనిజాలు పుష్కలంగా ఉంటాయి. బంగినపల్లి, సువర్ణరేఖ మరియ రసాలు వంటి అనేక రకాల మామిడి పండ్ల మన తెలుగు రాష్ట్రాల్లో ప్రసిద్ధి చెందాయి. మ్యాంగో తినడం వల్ల కలిగే అద్భుత ప్రయోజనాలేంటో తెలుసుకుందాం. 

మామిడి పండు ప్రయోజనాలు
1. మామిడి పండులో పైబర్ ఎక్కువగా ఉంటుంది. ఇది జీర్ణవ్యవస్థకు చాలా మేలు చేస్తుంది. 
2. మ్యాంగో ప్రూట్ లో యాంటీ యాక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఇది క్యాన్సర్‌తో పోరాడడంలో అద్భుతంగా సహాయపడుతుంది. 
3. మామిడి పండులో విటమిన్లు పుష్కలంగా ఉంటాయి. ఇది కొలెస్ట్రాల్ స్థాయిని నియంత్రించడంలో సహాయపడుతుంది. 
4. మ్యాంగ్ ప్రూట్ లో పోషకాలు మెండుగా ఉంటాయి. ఇది గుండెను ఆరోగ్యంగా ఉంచుతుంది.
5. డయాబెటిక్ ను కంట్రోల్ చేయడంలో మామిడి పండు సూపర్ గా పనిచేస్తుంది. 
6.  అంతేకాకుండా ఇది చర్మానికి నిగారింపు ఇవ్వడంలో, చర్మం ఆయిల్ ఉత్పత్తిని తగ్గించడంలో సహాయపడుతుంది. 
7. మామిడిలో సిట్రిక్ యాసిడ్ అధికంగా ఉంటుంది. ఇది శరీరంలో క్షార నిల్వను నిర్వహించడంలో తోడ్పడుతుంది. 

Also read: Benefits Of Apricot: ఆప్రికాట్ పండ్లతో చర్మ, జుట్టు సమస్యలేవైనా సులభంగా చెక్‌ పెట్టొచ్చు!

8. మామిడి పండులో విటమిన్లు, పైబర్ ఎక్కువగా ఉంటాయి. ఇది బరువును తగ్గించడంలో బాగా పనిచేస్తుంది. 
9. మ్యాంగోలో ప్రోటీన్ కంటెంట్‌ అధికంగా ఉంటుంది. ఇది అనేక ఉదర సంబంధిత వ్యాధులను దూరం చేస్తాయి. 
10. వడదెబ్బ నుంచి ఉపశమనం కలిగించడంలో మామిడి చాలా చక్కగా పనిచేస్తోంది. అంతేకాకుండా శరీరానికి వెంటనే రిప్రెష్ ఇస్తుంది. 
11.  మామిడి పండ్లలో విటమిన్ సి, ఎ మరియు ఇతర రకాల కెరోటినాయిడ్లు సమృద్ధిగా ఉంటాయి. ఇది మీ రోగ నిరోధక శక్తిని మెరుగుపరచడంలో హెల్ప్ చేస్తుంది. 
12. ఇది బీపీని కంట్రోల్  చేయడంలో సహాయకారిగా ఉంటుంది. 

Also Read: White Hair: తెల్ల జుట్టుతో బాధపడే వారందరికీ గుడ్ న్యూస్.. సులభంగా వైట్ హెయిర్ బ్లాక్ హెయిర్ గా మారడం ఖాయం!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe

TwitterFacebook మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.

 

Trending News