blood boosting diet: బిజీ లైఫ్, మారిన జీవనశైలి, చెడు ఆహారపు అలవాట్లు కారణంగా మనం అనారోగ్యం బారిన పడతాం. అంతేకాకుండారక్తహీనతకు గురవుతాం. మీ శరీరంలో బలహీనత, మైకం, నిద్రలేమి, అలసట వంటి లక్షణాలు కనిపిస్తే మీకు రక్తం తక్కువగా ఉందని అర్థం చేసుకోండి. శరీరంపై పసుపు రంగు కనిపించినా, కళ్ల కింద నల్ల వలయాలు కనిపించినా మీకు బ్లడ్ తక్కువగా ఉంటుంది. బాడీలో తక్కువ హిమోగ్లోబిన్ కారణంగా శరీరంలో ఆక్సిజన్ కొరత ఏర్పడుతుంది. శరీరం ఆరోగ్యంగా మరియు ఫిట్‌గా ఉండాలంటే ఐరన్ అవసరం. పండ్లు ఆరోగ్యానికి చాలా మేలు చేస్తాయి. కొన్ని పండ్లు తినడం వల్ల మీ రక్తం అమాంతం పెరిగిపోతుంది. ఆ ఫ్రూట్స్ ఏంటో తెలుసుకుందాం.
దానిమ్మ
రక్తహీనత తొలగిపోవాలంటే మీరు రోజూ దానిమ్మ తినాలి. ఇందులో ఐరన్ పుష్కలంగా ఉంటుంది. దీన్ని తినడం వల్ల శరీరంలో హిమోగ్లోబిన్ లోపం ఉండదు.
ద్రాక్ష
బ్లడ్ పెరగాలంటే ద్రాక్ష పండ్లను ఎక్కువగా తీసుకోవాలి. దీని జ్యూస్ తాగడం వల్ల మీకు ఎంతో ప్రయోజనం కలుగుతుంది. ఈ పండును ఆహారంలో భాగంగా తీసుకోవడం వల్ల కంటి చూపు మెరుగుపడుతుంది. అంతేకాకుండా ఐరన్ లోపం పోతుంది.
ఆపిల్
యాపిల్ రక్తహీనతను కూడా తొలగిస్తుంది. బ్లడ్ పెరగడానికి యాపిల్ చాలా మేలు చేస్తుంది. రోజూ ఒక యాపిల్ తింటే శరీరంలోని అనేక సమస్యలను దూరం చేయడంతోపాటు రక్తహీనతను దూరం చేస్తుంది.
బీట్‌రూట్
రక్తం త్వరగా పెరగాలంటే బీట్‌రూట్ తినడం మంచిది. ఇందులో ఐరన్ పుష్కలంగా ఉంటుంది, ఇది హిమోగ్లోబిన్‌ని పెంచుతుంది. రోజూ బీట్‌రూట్ తింటే వారం రోజుల్లోనే శరీరంలో రక్తం పెరుగుతుంది.
(Note: ఇక్కడ ఇవ్వబడిన సమాచారం ఇంటి నివారణలు మరియు సాధారణ సమాచారంపై ఆధారపడి ఉంటుంది. దానిని స్వీకరించే ముందు తప్పనిసరిగా వైద్య సలహా తీసుకోవాలి. ZEE NEWS దానిని ధృవీకరించలేదు.)
Also Read: Peanuts Health Benefits: వేరుశెనగ పల్లీలు... ఆరోగ్యానికి ఎంతో మేలు..!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.