Walking Benefits: ప్రస్తుతం ఉన్న బిజీ లైఫ్ లో చెడు ఆహారపు అలవాట్లు, జీవనశైలిలో మార్పులు కారణంగా ప్రజలు అనేక రకాల వ్యాధుల బారిన పడుతున్నారు. కరోనా తర్వాత చాలా మంది ఆరోగ్యంపై శ్రద్ధ పెడుతున్నారు. హెల్తీగా ఉండేందుకు యోగా, వ్యాయామం, మంచి ఆహారం తీసుకోవడం వంటివి చేస్తున్నారు. ఆరోగ్యకరమైన జీవితం కోసం నడకను మించిది లేదు. రోజూ ఓ అరగంటపాటు వాకింగ్ చేయడం వల్ల డిమెన్షియా, కార్డియోవాస్కులర్ మరియు క్యాన్సర్ వంటి వ్యాధులు దూరమవుతాయి. రోజువారీ నడక వల్ల కలిగే ప్రయోజనాలు ఏంటో తెలుసుకుందాం.
నడక ప్రయోజనాలు
** రోజూ నడిచేలా కాకుండా కొంచెం వేగంగా నడవండి. దీనినే బ్రిస్క్ వాక్ అంటారు. మీరు ప్రతిరోజూ ఒక గంట బ్రిస్క్ వాక్ చేస్తే అది మీ గుండె పనితీరును ఆరోగ్యంగా ఉంచడంలో సహాయపడుతుంది.
** ఏ వయస్సు వారైనా వాకింగ్ చేయడం మంచిది. నడవడం వల్ల ఒత్తిడి దూరమవుతుంది. అంతేకాకుండా ఫిట్ గా కూడా ఉంటారు. తీవ్ర వ్యాధులు కూడా దూరమవుతాయి. కాబట్టి రోజూ వ్యాయామాలు చేయండి.
నడిచేటప్పుడు ఈ విషయాలను గుర్తుంచుకోండి:
1. మీ బూట్లు సౌకర్యవంతంగా ఉండేలా చూసుకోండి. మీరు డయాబెటిక్ పేషెంట్ అయితే ఫిట్ కాని షూ వల్ల ఇన్ఫెక్షన్ వచ్చే అవకాశం ఉంది.
2. సీజన్‌కు తగినట్లుగా దుస్తులు ఉండాలి.
3. మీ శరీరాన్ని బాగా కవర్ చేసి చలికాలంలో బయటకు వెళ్లండి. వెచ్చని సూర్యరశ్మిలో నడవండి.
4. సురక్షితమైన మరియు పరిశుభ్రమైన వాతావరణంలో నడవండి.
5. ఎల్లప్పుడూ నడుము నిటారుగా ఉంచి ముందుకు వంగకుండా నడవండి.
6. తిన్న తర్వాత తేలికగా నడవండి. ఇది జీర్ణక్రియకు సహాయపడుతుంది.
7. నడవడం వల్ల శరీరం మరియు మనస్సు ఫిట్‌గా ఉంటాయి. అంతేకాకుండా మంచి నిద్ర కూడా వస్తుంది.
8. స్థూలకాయం, మధుమేహం, క్యాన్సర్, డిమెన్షియా మొదలైన వాటికి దూరంగా ఉండేందుకు ఇది సహాయపడుతుంది.
9. వాకింగ్ వల్ల పల్స్ నియంత్రణలో ఉంటుంది. ఇది రక్తపోటును నియంత్రించడం ద్వారా గుండె సామర్థ్యాన్ని మెరుగుపరుస్తుంది.
10. బ్రిస్క్ వాక్ క్యాన్సర్ మరియు గుండె జబ్బుల ప్రమాదాన్ని 25 శాతం తగ్గిస్తుంది.
Also Read: Premature White Hair: తెల్ల జుట్టు సమస్యలకు ఇలా 9 రోజుల్లో గుడ్ బై చెప్పండి..
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook