Hot Water Benefits: ఉదయాన్నే సెలెబ్రెటీలు వేడి నీళ్లు ఎందుకు తాగుతారో తెలుసా..?

Drinking Hot Water Uses: ప్రతిరోజు ఉదయం వేడి నీరు తాగడం వల్ల బోలెడు లాభాలు కలుగుతాయని ఆరోగ్యనిపుణులు చెబుతున్నారు. ముఖ్యంగా చలికాలంలో వేడి నీరు తాగడం వల్ల అనారోగ్యసమస్యల బారిన పడకుండా ఉంటాము. 

Written by - Shashi Maheshwarapu | Last Updated : Dec 13, 2024, 11:34 AM IST
Hot Water Benefits: ఉదయాన్నే సెలెబ్రెటీలు వేడి నీళ్లు ఎందుకు తాగుతారో తెలుసా..?

Drinking Hot Water Uses: సోషల్‌ మీడియాలో చాలా మంది సెలెబ్రెటీలు వారీ డైలీ రోటీన్‌ లైఫ్‌స్టైల్‌ గురించి తరుచు పోస్టులు చేస్తుంటారు. అందులో చాలా మంది సెలెబ్రిటీలు తమ రోజును వేడి నీరు తాగడంతో ప్రారంభిస్తారు. ఇది కేవలం ఒక ట్రెండ్ మాత్రమే కాదు, వేడి నీరు తాగడం వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. ముఖ్యంగా చలికాలంలో వేడి నీరు తాగడం మంచిదని ఆరోగ్యనిపుణులు చెబుతున్నారు. ఈ సమయంలో రోగనిరోధక శక్తి తక్కువగా ఉంటుంది. దీని వల్ల అనారోగ్యసమస్యల బారిన పడతుంటారు. కాబట్టి వేడి నీరు తీసుకోవడం మంచిదని వైద్యులు చెబుతున్నారు. అయితే ప్రతిరోజు వేడి నీరు తీసుకోవడం వల్ల శరీరానికి ఎలాంటి ఆరోగ్యలాభాలు కలుగుతాయి అనే విషయం తెలుసుకుందాం. 

వేడి నీరు తాగడం వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలు:

ప్రతిరోజు  ఉదయం ఖాళీ కడుపుతో వేడి నీరు తాగడం వల్ల జీర్ణవ్యవస్థ మెరుగుపడుతుందని వైద్యులు చెబుతున్నారు. దీని వల్ల మలబద్ధకం, గ్యాస్‌, అజీర్ణం వంటి సమస్యల నుంచి ఉపశమనం కలుగుతుంది.వేడి నీరు శరీరంలోని విషతుల్య పదార్థాలను బయటకు పంపడానికి సహాయపడుతుంది. ఉదయం లేచిన వెంటనే వేడినీరు తాగడం వల్ల ఆరోగ్యం మాత్రమే కాకుండా చర్మం కూడా కాంతివంతంగా మారుతుంది. వేడి నీరు జీవక్రియను వేగవంతం చేసి, కొవ్వును కరిగించడానికి సహాయపడుతుంది. వేడి నీరు శరీరాన్ని ప్రశాంతంగా చేసి, ఒత్తిడిని తగ్గిస్తుంది. వేడి నీరు రోగ నిరోధక శక్తిని పెంచి, జలుబు, దగ్గు వంటి సమస్యలను తగ్గిస్తుంది.

చలికాలంలో వేడి నీరు తాగడం ఎందుకు మంచిది?

శరీర ఉష్ణోగ్రతను నియంత్రిస్తుంది: చలికాలంలో, వేడి నీరు శరీర ఉష్ణోగ్రతను నియంత్రించడానికి సహాయపడుతుంది.
రక్త ప్రసరణను మెరుగుపరుస్తుంది: వేడి నీరు రక్త ప్రసరణను మెరుగుపరుస్తుంది, ఇది శరీరంలోని అన్ని భాగాలకు రక్తాన్ని సమర్థవంతంగా చేరుస్తుంది.
జలుబు, దగ్గును తగ్గిస్తుంది: వేడి నీరు గొంతును ప్రశాంతంగా చేసి, జలుబు, దగ్గు వంటి సమస్యలను తగ్గిస్తుంది.
వేడి నీరు తాగడం అనేది ఆరోగ్యకరమైన అలవాటు అయినప్పటికీ, అన్ని సమస్యలకు పరిష్కారం కాదు. ఏదైనా ఆరోగ్య సమస్య ఉన్నట్లయితే, వైద్యుని సలహా తీసుకోవడం చాలా ముఖ్యం.

చిట్కాలు:

ఉదయాన్నే ఖాళీ కడుపుతో వేడి నీరు తాగడం మంచిది.
నీటి ఉష్ణోగ్రత చాలా ఎక్కువగా ఉండకూడదు.
వేడి నీటిలో నిమ్మరసం లేదా తేనె కలిపి తాగవచ్చు.
ప్రతిరోజు కనీసం 2-3 గ్లాసుల వేడి నీరు తాగడం మంచిది.

Also Read: Huge King Cobra Video: వీడే అసలైన మగాడ్రా బామ్మర్ది.. 10 అడుగుల కింగ్ కోబ్రాను ఉత్తి చేతులతో పట్టుకున్నాడు.. వీడియో చూశారా?

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.

Trending News