Treatment For High Blood Pressure: ప్రతిరోజూ ఆహారంలో ఇది తింటే రక్తపోటుకు గుడ్‌బై చెప్పొచ్చు!

Reduce High Blood Pressure Naturally: రక్తపోటు అనేది  ప్రవహించే రక్తం వల్ల కలిగే ఒత్తిడిని కొలుస్తుంది. ధమనులు మీ గుండె నుంచి శరీరంలోని ఇతర భాగాలకు రక్తాన్ని తీసుకువెళతాయి. సాధారణ రక్తపోటు 120/80 Mmhg కంటే తక్కువగా ఉంటుంది. అధిక రక్తపోటు 140/90 Mmhg కంటే ఎక్కువగా ఉంటుంది.

Written by - ZH Telugu Desk | Last Updated : Apr 29, 2024, 10:56 PM IST
Treatment For High Blood Pressure: ప్రతిరోజూ ఆహారంలో ఇది తింటే రక్తపోటుకు గుడ్‌బై చెప్పొచ్చు!

Reduce High Blood Pressure Naturally: ప్రస్తుత కాలంలో వయసుతో సంబంధం లేకుండా చాలా మంది యువత, వృద్ధుల్లో బ్లడ్ ప్రెషర్ (రక్తపోటు) బారిన పడ్డారు. వీరిలో 25 నుంచి 30 ఏళ్ల మధ్య వయసున్న వారు ఎక్కువ అవ్వడం గమనార్హం. మారిన జీవన విధానం, ఒత్తిడి, ఆహారపు అలవాట్లే అధిక రక్తపోటుకు ప్రధాన కారణంగా పరిగణిస్తున్నారు. అయితే ఈ రక్తపోటు బారిన పడితే జీవితాంతం మందులు వాడాల్సిన పరిస్థితి నెలకొంది. కానీ, అలా మందులు వాడినా ఆశించిన ఫలితాలు లభించకపోవడం బాధాకరం. అలా మాత్రలు వాడినా బీపీ కంట్రోల్ కాకపోగా నానాటికి పెరిగే అవకాశం ఎక్కువగా ఉంది. 

అయితే రక్తపోటు సమస్యను నిర్లక్ష్యం చేయకూడదు. రక్తపోటు కారణంగా గుండెజబ్బులు, పక్షవాతం వంటి సమస్యలు వచ్చే అవకాశం ఉంది. కాబట్టి ఈ సమస్యను వీలైనంత త్వరగా అదుపులో ఉంచుకునే ప్రయత్నం చేస్తే మంచిది. కొన్నిసార్లు మందులు వాడినా బీపీ అదుపులోకి రానప్పుడు ఓ 3 నియమాలను పాటిస్తే మంచి ఫలితం లభిస్తుంది. ఈ చిట్కాలను అనుసరించడం వల్ల బీపీ త్వరగా అదుపులోకి వస్తుంది. 
అధిక బీపీతో బాధపడేవారు పాటించాల్సిన నియమాలు..
అధిక రక్తపోటు (బీపీ)తో బాధపడే వారు పాటించాల్సిన మొదటి నియమం రోజూలో నీరు ఎక్కువగా తీసుకోవడం. రోజూ కనీసం 4 లీటర్ల నీటిని తాగడం వల్ల బీపీ తగ్గుముఖం పట్టే అవకాశం ఉంది. ఇలా 4 లీటర్ల నీటిని తాగడం వల్ల శరీరంలోని అధిక లవణాలు మూత్రం ద్వారా బయటకి విసర్జించబడతాయి. దీంతో రోజుకు శరీరంలో నుంచి 5 గ్రాముల మోతాదులో బయటకు పోవడం వల్ల రక్తనాణాలు మృదువుగా తయారవుతాయి. రక్తం చిక్కబడే సమస్య తగ్గుతుంది. దీంతో గుండపై ఒత్తిడి తగ్గిపోతుంది.  
హైబీపీతో బాధపడే వారు పాటించాల్సిన రెండో నియమం తినే ఆహారంలో ఉప్పు తగ్గించడం. తినే ఆహారంలో ఉప్పు ఎక్కువగా జోడించడం వ్లల రక్తనాళాల గోడల వెంట మలినాలు పేరుకుపోయి అవి గట్టిగా మరతాయి. దీంతో గుండెకు రక్తాన్ని సరఫరా చేయడంలో గుండెపై ఒత్తిడి మరింత పెరిగిపోతుంది. కాబట్టి ఉప్పు వినియోగాన్ని తగ్గించుకోవాల్సిన అవసరం ఉంది. ముఖ్యంగా ఊరగాయల నిల్వ పచ్చళ్లని తినడం తగ్గిస్తే మంచిది. కూరల్లో కూడా ఉప్పును తక్కువగా తీసుకోవడం చాలా మంచిది. ఉప్పు లేకుండా ఆహారాన్ని తినేందుకు ప్రయత్నించాలి. అయితే ఉప్పుకు బాగా అలవాటు పడిన వారు ఉప్పుకి బదులుగా సైంధవ లవణాన్ని వాడితే మేలు జరుగుతుంది. సైంధవ లవణం శరీరంపై ఎలాంటి దుష్ప్రభావాలను చూపించదు. ఇలా చేయడం వల్ల బీపీ నియంత్రణలోకి వస్తుంది. 

ఇక బీపీతో బాధపడే వారు పాటించాల్సిన ఆఖరి నియమం ఉండికించిన ఆహారాన్ని తీసుకోవడం. ఉదయాన్నే మొలకెత్తిన విత్తనాలు, నట్స్ ను ఆహారంగా తీసుకోవాలి. ఇలా తీసుకోవడం వల్ల బీపీ నియంత్రణలోకి వస్తుంది. ఈ విధంగా మూడు నియమాలను పాటిస్తూ అధిక రక్తపోటును నియంత్రించుకోవచ్చు. 

(NOTE: అంతర్జాలంలో సేకరించిన సమాచారానికి అనుగుణంగా ఈ వివరాలను మీకు అందించడం జరిగింది. అయితే పైన పేర్కొన్న వాటిని పాటించే ముందు సంబంధిత వైద్య నిపుణుల సలహాలను పాటించాల్సిందిగా కోరుతున్నాము. ఇందులో పేర్కొన్న అంశాలను మేము ధ్రువీకరించడం లేదు.)

Also Read 2024 Bajaj Pulsar N250: మార్కెట్‌లోకి కొత్త పల్సర్ N250 వచ్చేసింది.. ఫీచర్స్‌, స్పెషిఫికేషన్స్‌ ఇవే!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

TwitterFacebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

Trending News