Diabetes Breakfast Recipes: డయాబెటిస్ ఉన్నవారు తీసుకోనే ఆహారం పట్ల పలు జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. అయితే తీసుకొనే ఆహారంలో షుగర్ లెవల్స్ అదుపులో ఉండే చూసుకోవాలి. అయితే ప్రతిరోజు ఉదయం ఈ ఆహారపదార్థాలను మీ బ్రేక్ ఫాస్ట్‌లో చేరచుకోవడం వల్ల ఎన్నో లాభాలు పొందుతారు. ఎట్టువంటి ఆహార పదార్థాలు తీసుకోవడం వల్ల షుగర్ కంట్రోల్‌లో ఉంటుంది అనేది మనం తెలుసుకుందాం.
ఉదయం బ్రేక్ ఫాస్ట్‌లో ఈ ఆహారపదార్థాలను తీసుకోవడం వల్ల ఎన్నో లాభాలు:
డయాబెటిస్ ఉన్నవారు ప్రతిరోజు ఉదయం నట్స్‌ను తీసుకోవడం వల్ల ఎన్నో లాభాలు పొందవచ్చు. అందులో ముఖ్యంగా బాదం, వాల్‌నట్, ఎండుద్రాక్ష, జీడిపప్పు తీసుకోవడం వల్ల ఎన్నో లాభాలు కలుగుతాయి. ప్రతిరోజు రెండు లేదా మూడు తీసుకోవడం వాటర్‌లో నానబెట్టి ఉదయం ఖాళీ కడుపుతో తీసుకోవడం చాలా మంచిదని ఆరోగ్యానిపుణులు చెబుతున్నారు.
శరీరం ఆరోగ్యంగా ఉండాలి అంటే మీరు ప్రతిరోజు మీ డైట్‌లో పండ్లను తీసుకోవాల్సి ఉంటుంది. అందులో బొప్పాయి ఒకటి. దీనిని తీసుకోవడం వల్ల ఎన్నో లాభాలు కలుగుతాయి. డయాబెటిస్ ఉన్నవారికి ఈ బొప్పాయి ఎన్నో లాభాలను అందిస్తుంది. ఇందులో ఫైబర్ కంటెంట్ ఎక్కువగా ఉండటం వల్ల షుగర్‌ను నియంత్రించడంలో ఎంతో మేలు చేస్తుంది.
ప్రతిరోజు ఉదయం మీరు మొలకెత్తిన గింజలను తీసుకోవడం వల్ల షుగర్ కంట్రోల్‌లో ఉంటుంది. ముఖ్యంగా మొలకెత్తిన మెంతులను తీసుకోవడం వల్ల ఎన్నో లాభాలు పొందవచ్చు. ఆహారంలో దాల్చిన చెక్కను తీసుకోవడం వల్ల ఎన్నో రోగలకు చెక్ పెట్టవచ్చు. దీనిని మీరు వాటర్‌లో వేడి చేసి తీసుకోవడం వల్ల షుగర్ లెవల్స్‌ను తీసుకోవచ్చు. అతిగా కాకుండా మితంగా దీనిని తీసుకోవడం చాలా మంచిది. లేకుంటే శరీర ఉష్టోగ్రతులు పెరిగే అవకాశం ఉంటుంది. డయాబెటిస్ ఉన్నవారు పెసరపప్పును తీసుకోవడం వల్ల బోలెడు లాభాలు కలుగుతాయి. ఇందులో తక్కువగా గ్లైసెమిక్ ఇండెక్స్ కలిగి ఉంటుంది. ఇది రక్తంలో చెక్కరను నియంత్రించడంలో ఎంతో ఉపయోగపడుతుంది.
వీటితో పాటు మీరు తృణధాన్యాలను తీసుకోవడం వల్ల ఆరోగ్యానికి ఎంతో మేలు కలుగుతుంది. ఇందులో కూడా అనేక రకాల పోషకాలు ఉంటాయి. ముఖ్యంగా షుగర్ లెవల్స్‌ను కంట్రోల్ చేయడంలో కూడా ఎంతో సహాయపడుతుంది. మీరు వీటిని తీసుకోవడంతో పాటు ప్రతిరోజు వ్యాయామం, వాకింగ్, పోషకరమైన జ్యూస్‌లు తీసుకోవడం చాలా మంచిది. మీరు ఏదైన అనారోగ్య సమస్యలతో ఇబ్బంది పడుతుంటే ముందుగా వైద్యుల సలహాను తీసుకోవడం చాలా మంచిది.
Also Read 2024 Bajaj Pulsar N250: మార్కెట్‌లోకి కొత్త పల్సర్ N250 వచ్చేసింది.. ఫీచర్స్, స్పెషిఫికేషన్స్ ఇవే!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి