Itch Relief: చర్మంపై దురద సమస్యలతో బాధపడుతున్నారా? ఇలా 20 నిమిషాల్లో చెక్!

Itch Relief 20 Minutes: ప్రస్తుతం చాలా మంది దురద వంటి చర్మ సమస్యలతో బాధపడుతున్నారు. అయితే ఈ సమస్యల నుంచి ఉపశమనం పొందడానికి తప్పకుండా ఇంటి చిట్కాలను పాటించాల్సి ఉంటుంది. అవేంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం.  

Written by - ZH Telugu Desk | Last Updated : Feb 26, 2023, 12:02 PM IST
 Itch Relief: చర్మంపై దురద సమస్యలతో బాధపడుతున్నారా? ఇలా 20 నిమిషాల్లో చెక్!

Itch Relief 20 Minutes: వాతావరణంలో వేడి తీవ్రత కారణంగా చాలా రకాల చర్మ సమస్యలు వస్తూ ఉంటాయి. అంతేకాకుండా ఎండా కాలంలో బిగుతుగా ఉండే దుస్తులు వేసుకోవడవం వల్ల తొడలలో దురద, ఇతర చోట్ల దురద సమస్యలు వస్తూ ఉంటాయి. అంతేకాకుండా దురద తర్వాత దద్దుర్లు రావడం ప్రారంభమవుతాయి. అయితే ఇలాంటి సమస్యలతో బాధపడేవారు తప్పకుండా పలు రకాల జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. ఇలాంటి సమస్యలను విస్మరించడం వల్ల భవిష్యత్‌లో తీవ్ర సమస్యలు వస్తాయి. కాబట్టి ఇలాంటి సమస్యలు ఉన్నవారు పలు రకాల ఇంటి చిట్కాలను పాటించాల్సి ఉంటుంది. అంతేకాకుండా పలు ఆరోగ్యకరమైన ఆహారాలు కూడా తీసుకోవాల్సి ఉంటుంది.

వీటితో దురదకు చెక్‌:
తేనె:

తేనెలో యాంటీ ఇన్ఫ్లమేటరీ, క్రిమినాశక లక్షణాలు ఉంటాయి. దీంతో చర్మపు దద్దుర్లు సులభంగా తొలగించబడతాయి. అయితే దీని కోసం 2 చెంచాల తేనెలో ఒక చెంచా నీటిని మిక్స్ చేసి కాటన్‌ సహాయంతో దురద ఉన్న ప్రదేశంలో అప్లై చేయండి. తేనె ఆరిపోయిన తర్వాత నీటితో శుభ్రం చేసుకోండి.

పచ్చి కొత్తిమీర:
కొత్తిమీర ఆకులను గ్రైండ్ చేసి అందులో నిమ్మరసం కలపాలి. ఇప్పుడు ఈ పేస్ట్‌ని దురద ఉన్న భాగాలపై అప్లై చేసి సుమారు 20 నిమిషాల పాటు అలాగే ఉంచండి. ఇలా అది ఆరిపోయిన తర్వాత నీటితో కడిగేయాలి.

అలోవెరా జెల్:
అలోవెరా జెల్ చర్మ సౌందర్యాన్ని పెంచడానికి కీలక పాత్ర పోషిస్తుంది. అందుకే చాలా మంది దీనిని వినియోగిస్తారు. అయితే ఇది సౌందర్యానికే కాకుండా చర్మ సమస్యలకు కూడా ప్రభావవంతంగా సహాయపడుతుందని నిపుణులు తెలుపుతున్నారు. దీని కోసం అలోవెరా జెల్‌తో కొన్ని చుక్కల టీ ట్రీ ఆయిల్‌ను కలపండి. దీన్ని దురద ఉన్న ప్రదేశంలో అప్లై చేసి ఆరిపోయే దాకా ఉంచి శుభ్రమైన నీటితో కడగాలి.

కర్పూరం:
పూజకు చాలా మంది కర్పూరాన్ని వినియోగిస్తూ ఉంటారు. అయితే ఇందులో చాలా రకాల ఔషధ గుణాలు లభిస్తాయి. కాబట్టి దీని పొడిని ప్రభావిత ప్రాంతంలో రాస్తే దురదలు, దద్దుర్లు తగ్గుతాయి.

కొబ్బరి నూనె:
కొబ్బరి నూనెలో విటమిన్లు, ఖనిజాల లభిస్తాయి.అంతేకాకుండా ఇందులో యాంటీ ఫంగల్‌తో పాటు యాంటీ బాక్టీరియల్ లక్షణాలు లభిస్తాయి. కాబట్టి  దురద, అలెర్జీలను సులభంగా తగ్గించడానికి సహాయపడతాయి.

(నోట్‌: ఇక్కడ ఇవ్వబడిన సమాచారం ఇంటి నివారణలు, సాధారణ సమాచారంపై ఆధారపడి ఉంటుంది. దానిని స్వీకరించే ముందు తప్పనిసరిగా వైద్య సలహా తీసుకోవాలి. ZEE NEWS దానిని ధృవీకరించలేదు.)

Also Read:  Samantha Ruth Prabhu : నాకు అప్పుడూ, ఇప్పుడూ, ఎప్పుడూ తోడున్నది అదే : సమంత

Also Read: Deepthi Sunaina : స్ట్రెస్ ఉంది.. అక్కడ చెమటలు పడుతున్నాయ్.. దీప్తి సునయన కామెంట్స్

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 

ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook

 

Trending News