Banana Fruit: ఖాళీ పొట్టతో బనానా తింటున్నారా..?.. మీరు డెంజర్ లో పడ్డట్లే..

Life Style: కొందరు ఉదయాన్నే బ్రష్ చేసుకుని బనానా తింటారు. ఆ తర్వాత తమ దినచర్యను ప్రారంభించడం వంటివి చేస్తుంటారు. ఇలా చేస్తు కడుపులో మలబద్దకంతో పాటు అనేక సమస్యలు వస్తాయంట..

Written by - Inamdar Paresh | Last Updated : Feb 1, 2024, 04:46 PM IST
  • - ఖాళీ పొట్టతో బనానా తినొద్దంట..
    - కొందరిలో అరటి వల్ల మలబద్దకం కల్గుతుంది..
Banana Fruit: ఖాళీ పొట్టతో బనానా తింటున్నారా..?.. మీరు డెంజర్ లో పడ్డట్లే..

Eating Banana on Empty Stomach: మనకు మార్కెట్లో ఎక్కువగా బనానా దొరుకుతుంటాయి. తక్కువ ధరలో ఉండటం వల్ల ఎక్కువ మంది తరచుగా కొంటుంటారు. యువకులు, జిమ్ లకు, ఆఫీసులకు వెళ్లే వారు బనానాలను ఉదయం పూట తినడం చేస్తుంటారు. మరికొందరైతే టిఫిన్ కు బదులుగా రెండు లేదా నాలుగు బనానాలను తినేస్తుంటారు. ఇలా ఖాళీ పొట్టతో బనానాలు తినడం వల్ల అనేక ఆరోగ్య సమస్యలు వస్తాయని నిపుణులు చెబుతున్నారు. 

బనానాలను సహజంగా కాకుండా రసాయనాలలో ముంచి పక్వానికి వచ్చేలా చేస్తున్నారు. అందుకే దీని వల్ల మంచికన్న, చెడు ప్రభావమే ఎక్కువ. బనానాలో ఆమ్లత్వం,మెగ్నిషియం లు అధికంగా ఉంటుంది. దీని వల్ల రక్త ప్రవాహంపై ప్రభావం చూపిస్తాయి. దీంతో గుండె జబ్బుల కూడా వచ్చే ప్రమాదం ఉంటుంది.

Read Also: Wedding: ''ఇదేంది భయ్యా ".. పెళ్లి కూతుళ్లంతా తమకు తామే దండలు వేసుకున్నారు... వైరల్ గా మారిన ఘటన..

ఆయుర్వేదం ప్రకారం.. ఏ సీజన్ లో దొరికే పండ్లను అప్పుడే తినాలి. అరటి పండ్లను, పాలను కలసి అస్సలు తినకూడదు. ప్రెగ్నెంట్ లేడీస్ ముఖ్యంగా బనానా కు దూరంగా ఉండాలి.  కొందరిలో బనానా అస్సలు అరగదు. కానీ ఏదైన టిఫిన్ చేశాక, ఆహారం తిన్నాక బనానాను తినవచ్చు. దీనిలో ఫైబర్ ఉంటుంది.

పండిన అరటి పండ్లను మాత్రమే ఎక్కువగా తినాలి.  పండిన అరటిలో విటమిన్లు, మినరల్స్ , ఎక్కువగా ఉంటాయి. ఇవి శరీరానికి కావాల్సిన శక్తిని అందిస్తాయి.  (Disclaimer: పైన పేర్కొన్న అంశాలు కేవలం ఇంటర్నెట్ లో అందుబాటులో ఉన్నవి వాటినే మేము అందిస్తున్నాము. దీన్ని Zee Mediaధృవీకరించలేదు.)

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి. 

Android Link: https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu 

Apple Link: https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook
 

Trending News