Weight Loss Recipe: ఈ ల‌డ్డూను తిన‌డం వ‌ల్ల బరువు సమస్యకు చెక్‌ పెట్టవచ్చు!

Weight Loss Ladoo Recipe: అధునిక జీవనశైలిలో చాలా మంది అధిక బరువు, ఎముక‌లు నొప్పి, జుట్టు రాలడం వంటి సమస్యలతో బాధపడుతున్నారు. దీని కారణంగా తీవ్రమైన అనారోగ్య సమస్యల బారిన పడాల్సి ఉంటుంది. కానీ ఈ ల‌డ్డూల‌ను తిన‌డం ఈ సమస్యలకు చెక్‌ పెట్టవచ్చని ఆరోగ్యనిపుణులు చెబుతున్నారు.  

Written by - ZH Telugu Desk | Last Updated : Jan 24, 2024, 09:13 PM IST
Weight Loss Recipe: ఈ ల‌డ్డూను తిన‌డం వ‌ల్ల బరువు సమస్యకు చెక్‌ పెట్టవచ్చు!

Weight Loss Ladoo Recipe: మనం తీసుకొనే ఆహారంలో పలు మార్పులు మారడం కారణంగా తీవ్ర అనారోగ్యసమస్యల తలెత్తుతున్నాయి. ముఖ్యంగా కీళ్ల నొప్పి, ఎముకలు బలహీనంగా మారడం, జుట్టు రాలడం వంటి సమస్యల బారిన పడుతున్నారు.  అయితే ఈ సమస్యల నుంచి విముక్తి పొందడానికి అనేక మందులను, ప్రొడెక్ట్స్‌ను ఉపయోగిస్తున్నారు. ఎలాంటి ఖర్చు లేకుండా సహజంగా ఈ సమస్యల నుంచి బయటపడవచ్చని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. దీని కోసం మీ ఇంట్లో లభించే ఆహార పదార్థాలను తీసుకుంటే సరిపోతుంది.  అయితే ఈ లడ్డు ఎలా తయారు చేసుకోవాలి అనేది మనం ఇప్పుడు తెలుసుకుందాం.

ల‌డ్డూల‌ త‌యారీకి కావాల్సిన ప‌దార్థాలు:

నువ్వులు ఒక క‌ప్పు, అవిసె గింజ‌లు  పావు క‌ప్పు, గుమ్మ‌డి గింజ‌లు రెండు టేబుల్ స్పూన్స్, బాదం పలుకులు రెండు టేబుల్ స్పూన్స్, పిస్తా ప‌లుకులు  రెండు టేబుల్ స్పూన్స్, జీడిప‌ప్పు ప‌లుకులు  రెండు టేబుల్ స్పూన్స్,  సోంపు గింజ‌లు ఒక టీ స్పూన్, యాల‌కులు మూడు, ప‌ల్లీలు రెండు టేబుల్ స్పూన్స్, బెల్లం తురుము పావు క‌ప్పు, ఖ‌ర్జూర పండ్లు  ఒక క‌ప్పు.

ల‌డ్డూ త‌యారీ విధానం:

ముందుగా అడుగు భాగం మందంగా ఉండే క‌ళాయిని తీసుకోవాలి.  అందులో నువ్వుల‌ను వేసి వేయించాలి. నువ్వులు వేగిన త‌రువాత వాటిని ఒక ప్లేట్ లోకి తీసుకోవాలి. ఇదే విధంగా బెల్లం తురుము, ఖ‌ర్జూ పండ్లు త‌ప్ప మిగిలిన ప‌దార్థాల‌ను  వేయించి ప్లేట్ లోకి తీసుకోవాలి. 

Also Read: Dried Apricots: ఆప్రికాట్ లో తీసుకోవడం వల్ల అద్భుతమైన ప్రయోజనాలు పొందవచ్చు!

ఇవి అన్నీ కూడా చ‌ల్లారిన త‌రువాత ఒక జార్ లోకి తీసుకోవాలి. ఇందులోనే బెల్లం త‌రుము, ఖ‌ర్జూర పండ్లు వేసి మిక్సీ ప‌ట్టుకుని ఒక గిన్నెలోకి తీసుకోవాలి.

ఇప్పుడు ఈ మిశ్ర‌మాన్ని ల‌డ్డూలుగా చుట్టుకోవాలి. ఇలా చేయ‌డం వ‌ల్ల చ‌క్క‌టి రుచితో ఆరోగ్యానికి మేలు చేసే ల‌డ్డూలు త‌యార‌వుతాయి. 

వీటిని  తిన‌డం వ‌ల్ల మ‌న ఆరోగ్యానికి ఎంతో మేలు క‌లుగుతుంది. ల‌డ్డూల‌ను తిన‌డం వ‌ల్ల ఎముక‌లు దృఢంగా, ఆరోగ్యంగా ఉంటాయి. అధిక బ‌రువు త‌గ్గుతారు. శరీరానికి కావ‌ల్సిన పోష‌కాలన్నీ ల‌భిస్తాయని ఆరోగ్యనిపుణులు చెబుతున్నారు.
Also Read: PPF Benefits: నెలకు 5 వేలు డిపాజిట్..మెచ్యూరిటీ తరువాత 26 లక్షలు ఎలాగంటే..

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News