Mango Leaves For Diabetes: మామిడి పండ్లను పండ్లకు రారాజుగా పిలుస్తారు. ఈ పండ్లకు ప్రపంచవ్యాప్తంగా మంచి గుర్తింపు ఉంది. మామిడి పండ్లు తినడం వల్ల నోటికి రుచిని అందించడమే కాకుండా ఆరోగ్యానికి కూడా చాలా రకాల ప్రయోజనాలను కలిగిస్తాయి. అయితే మామిడి పండ్లే కాకుండా ఆకులు కూడా శరీరానికి చాలా రకాల ప్రయోజనాలను కలిగిస్తాయని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు. తీవ్ర దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడేవారు ఈ ఆకులను నీటిలో మరిగించి తీసుకోవడం వల్ల మంచి ఫలితాలు పొందుతారు. ఇందులో ఉండే గుణాలు డయాబెటీస్ వంటి సమస్యల తీవ్ర అనారోగ్య సమస్యల నుంచి కూడా ఉపశమనం కలిగిస్తుంది. తరచుగా రక్తంలోని చక్కెర పరిమాణాలు పెరిగితే తప్పకుండా ఈ నీటిని తీసుకోవాల్సి ఉంటుంది. అంతేకాకుండా చర్మం, ఇతర అనారోగ్య సమస్యల నుంచి కూడా ఉపశమనం లభిస్తుంది. అయితే ఈ నీటిని ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు మనం తెలుసుకుందాం.
మామిడి ఆకులు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి:
చర్మం, జుట్టును ఆరోగ్యంగా ఉంచుతుంది:
మామిడి శరీరంలోని అవయవాలకు ఔషధంగా పని చేయడమేకాకుండా చర్మం, జుట్టు సమస్యల నుంచి కూడా సులభంగా ఉపశమనం కలిగిస్తాయి. ఇందులో అధిక పరిమాణంలో విటమిన్ ఎ, సి వంటి గుణాలు లభిస్తాయి. కాబట్టి వీటిని వినియోగించడం వల్ల శరీరంలో కొల్లాజెన్ పెరుగుతుంది. దీని కారణంగా జుట్టు, చర్మం ఆరోగ్యంగా ఉంటుంది.
Also Read: IND vs WI Highlights: ఒక్క బంతి పడలేదు.. వరుణుడి ఖాతాలోకి విజయం.. రెండో టెస్టు డ్రా
రాళ్ల సమస్యల నుంచి ఉపశమనం కలిగిస్తుంది:
మామిడి ఆకుల్లో అనేక ఔషధ గుణాలు లభిస్తాయి. కాబట్టి వీటిని రసంలా చేసి తీసుకోవడం వల్ల పొట్ట సంబంధింత సమస్యలు కూడా తగ్గుతాయని ఆయుర్వేద నిపుణులు చెబుతున్నారు. తరచుగా పొట్టలోని రాళ్ల సమస్యతో బాధపడేవారికి కూడా మామిడి ఆకులతో తయారు చేసిన రసం ప్రభావంతంగా సహాయపడుతుంది.
ఉబ్బసం, డయాబెటిస్:
ఊబకాయం సమస్యల కారణంగా ఉబ్బసం, డయాబెటిస్ సమస్యలు వస్తాయి. కాబట్టి ఇలాంటి సమస్యలతో బాధపడేవారు తప్పకుండా పలు రకాల జాగ్రత్తలతో పాటు మామిడి ఆకులతో తయారు చేసిన రసాన్ని తీసుకోవాల్సి ఉంటుంది. ఈ రసాన్ని ప్రతి రోజు తీసుకోవడం వల్ల రక్తంలోని చక్కెర పరిమాణాల కూడా సులభంగా తగ్గుతాయి. తరచుగా తీవ్ర మధుమేహం సమస్యలతో బాధపడేవారు ప్రతి రోజు ఈ రసాన్ని తీసుకోవాల్సి ఉంటుంది.
(నోట్: ఇక్కడ ఇవ్వబడిన సమాచారం ఇంటి నివారణలు, సాధారణ సమాచారంపై ఆధారపడి ఉంటుంది. దానిని స్వీకరించే ముందు తప్పనిసరిగా వైద్య సలహా తీసుకోవాలి. ZEE NEWS దానిని ధృవీకరించలేదు.)
Also Read: IND vs WI Highlights: ఒక్క బంతి పడలేదు.. వరుణుడి ఖాతాలోకి విజయం.. రెండో టెస్టు డ్రా
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook