Monsone Hair Care Tips: ప్రతి ఒక్కరూ పొడవాటి, మందపాటి, అందమైన జుట్టును కోరుకుంటారు. ఆధునిక జీవన శైలి కారణంగా జుట్టును సంరక్షించుకోవాడానికి ఖరీదైన ఉత్పత్తులను వినియోగిస్తున్నారు. అయితే వీటిని వినియోగించే క్రమంలో చాలా మంది వివిధ రకాల జుట్టు సమస్యలతో బాధపడుతున్నారు. ఈ ఉత్పత్తులను వాడే క్రమంలో ఈ అందులో ఉండే పదార్థాల గురించి తప్పకుండా తెలుసుకోవాలని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు. అయితే వానా కాలంలో ఈ ఉత్పత్తులను వినియోగిస్తే చాలా మందిలో పలు రకాల జుట్టు సమస్యలు వస్తున్నాయి. అంతేకాకుండా ఈ సీజన్‌లో జుట్టు జిగటగా, నిర్జీవంగా మారుతుంది. అయితే వర్షాకాలంలో జుట్టును ఎలా సంరక్షించుకోవాలో తెలుసుకుందాం..
వర్షాకాలంలో జుట్టును ఇలా సంరక్షించుకోండి:
జుట్టు కోసం టీ ట్రీ ఆయిల్(Tea tree oil for hair):
టీ ట్రీ ఆయిల్‌లో జుట్టుకు కావాల్సిన అన్ని రకాల పోషకాలుంటాయి. కావున దీనిని జుట్టుకు రాయడం వల్ల వెంట్రుకలు కుదుల్ల నుంచి బలంగా మారుతాయి. ముఖ్యంగా వర్షాకాలంలో స్కాల్ప్ ఇన్ఫెక్షన్లు, చుండ్రుని నియంత్రించే అన్ని రకాల యాంటీ బాక్టీరియల్స్ ఇందులో ఉంటాయి. కావున స్కాల్ప్‌పై వచ్చే దురదను తగ్గిస్తుంది. వర్షాకాలంలో వచ్చే జుట్టు సమస్యలన్నిటిని నుంచి సంరక్షిస్తుంది.
అలోవెరా(Aloe vera for hair):
కలబందలో అనేక రకాల ఔషధ గుణాలుంటాయి. ఇది ఆరోగ్యాన్ని సంరక్షించడమే కాకుండా జుట్టుకు మంచి మంచి పోషకాలను అందిస్తుంది. ఇందులో ఉండే గుణాలు వర్షాకాలంలో జుట్టును రక్షిస్తుంది. ఇందులో యాంటీ ఇన్‌ఫ్లమేటరీ, యాంటీఆక్సిడెంట్, యాంటీ బాక్టీరియల్ లక్షణాలు ఉన్నాయి. ఇవి వర్షాకాలంలో వచ్చే స్కాల్ప్ సమస్యను తొలగించడానికి సహాయపడుతుంది.
ఓట్స్(Oats):
వానా కాలంలో చాలా మందిలో జుట్టు రాలిపోవడం, జుట్టు సమస్యల రావడం సాధరణం. అయితే సమస్యలు రావడానికి ప్రధాన కారణం వాతావరణంలో పెరిగే తేమేనని నిపుణులు తెలుపుతున్నారు. అయితే ఈ సమస్యల నుంచి విముక్తి పొందడానికి ఓట్స్(Oats)ను తీసుకోవాలని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు. ఇందులో ఉండే పోషకాలు జుట్టును కుదుల్ల నుంచి బలంగా చేయడమే కాకుండా మంచి పోషణను ఇస్తాయి. కావున వానా కాలంలో జుట్టు సమస్యలుంటే తప్పకుండా ఓట్స్‌ను తీసుకోవాలని నిపుణులు పేర్కొన్నారు.
(NOTE: ఇక్కడ ఇవ్వబడిన సమాచారం ఇంటి నివారణలు, సాధారణ సమాచారంపై ఆధారపడి ఉంటుంది. దీనిని స్వీకరించే ముందు, ఖచ్చితంగా వైద్య సలహా తీసుకోండి. ZEE NEWS దీన్ని ధృవీకరించలేదు.)
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.Twitter , Facebook