Monsoon Tips: వర్షాకాలం వస్తే వేడి నుంచి ఉపశమనం లభిస్తుంది. అంతేకాకుండా మానవవు ఆరోగ్యానికి హాని కలిగించే తేమ శాతం కూడా పెరుగుతుంది. అంతేకాకుండా అనారోగ్యాన్ని తెచ్చి పెట్టే సీజనల్ వ్యాధులు కూడా వేగంగా వ్యాప్తి చెందుతాయి. ముఖ్యంగా ఈ సీజన్‌లో జలుబు, దగ్గు సమస్యలు ఉత్పన్నమవ్వడం విశేషం. అంతేకాకుండా దోమల వల్ల అనేక రోగాల వ్యాప్తి చెందుతాయి. అయితే ఇలాంటి సందర్భంలో శరీరానికి ఇన్ఫెక్షన్లు రాకుండా ఉంచుకోవడం చాలా మేలని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు. దీని కోసం వానా కాలంలో ప్రతి రోజూ శరీరానికి మేలు చేసే కషాయాలను తాగాలని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. దీని వల్ల శరీరంలో వ్యాధి నిరోధక శక్తి పెరిగి ఇన్ఫెక్షన్ల బారిన పడకుండా రక్షిస్తాయి.
డికాషన్ తాగడం వల్ల కలిగే ప్రయోజనాలు:
మారుతున్న సీజన్ కారణంలో గోరువెచ్చని డికాషన్ తప్పనిసరిగా తాగాలని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. ముఖ్యంగా వర్షాకాలంలో రోజుకు ఒకసారైన తప్పకుండా డికాషన్ తాగడం వల్ల శరీరానికి మంచి లాభాలు చేకూరుతాయి. అంతేకాకుండా శరీరానికి రోగనిరోధక శక్తి పెంచే కషాయాలను తాగడం వల్ల కూడా బాడీకి ప్రయోజనాలు లాభిస్తాయని నిపుణులు చెబుతున్నారు. ఇవి వానా కాలంలో వచ్చే సిజన్ వ్యాధులపై ప్రభావవంతంగా పని చేస్తాయని నిపునులు అభిప్రాయపడుతున్నారు. కావున ఈ సీజన్‌లో ఎలాంటి వ్యాధులు రాకుండా ఉండాలంటే తప్పకుండా డికాషన్, కషాయాలను తాగడం మంచిదని నిపుణులు చెబుతున్నారు.
ఇంట్లో కషాయాలను ఎలా తయారు చేయాలి:
1. డికాక్షన్ చేయడానికి.. ముందుగా వేయించిన కొత్తిమీర గింజలు, జీలకర్ర, సోపు తీసుకోవాలి. అంతేకాకుండా కొన్ని నల్ల మిరియాలు తీసుకోండి.
2. ఇప్పుడు ఈ మసాలా దినుసులను మొత్తాన్ని మెత్తగా గ్రైండ్ చేసి.. గాలి లేని ప్రదేశంలో నిల్వ చేసుకోవాలి.
3. డికాక్షన్ చేయడానికి ముందుగా ఒక గ్లాసు నీరుని మరిగించి.. దానికి ఒక చెంచా మసాలా పొడిని కలపండి.
4. ఇప్పుడు దానిని ఫిల్టర్ చేసి గోరు వెచ్చగా అయ్యాక తాగాలి.
Read also: Worst Breakfast Food: మార్నింగ్ బ్రేక్‌ఫాస్ట్‌లో వీటిని అస్సలు తినొద్దు..!
స్థానిక నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.Twitter , Facebook