Nail Cutting Myths: రాత్రిపూట గోర్లు కట్ చేయకూడదని పెద్దలు అంటారు.. కారణమేంటో తెలుసా?

Nail Cutting Myths: మనం తరచూ ఎక్కడో అక్కడ వింటూనే ఉంటాం.. రాత్రి పూట గోర్లు కట్ చేయకూడదని!! ఇంట్లో మన పెద్దలు కూడా ఇలానే హెచ్చరిస్తుంటారు. దీన్ని ఇప్పటి వరకు చాలా మంది నమ్ముతారు. కానీ, దీని వెనుక చాలా కారణాలు ఉన్నాయి. అయితే రాత్రి పూట గోర్లు కట్ చేయోద్దని అనేది మూఢ నమ్మకమా? లేదా ఏవైనా ఇతర కారణాలు ఉన్నాయా? అని ఇప్పుడు తెలుసుకుందాం.   

Written by - ZH Telugu Desk | Last Updated : Mar 4, 2022, 09:22 AM IST
Nail Cutting Myths: రాత్రిపూట గోర్లు కట్ చేయకూడదని పెద్దలు అంటారు.. కారణమేంటో తెలుసా?

Nail Cutting Myths: రాత్రిపూట గోర్లు ఎందుకు కట్ చేయకూడదు? రాత్రిళ్లు గోళ్లు కొరకకూడదని ఇంట్లో పెద్దలు కూడా అంటుంటారు. అయితే రాత్రి వేళలో గోర్లను ఎందుకు కట్ చేయకూడదో కారణం మాత్రం చెప్పరు. ఎవర్ని అడిగినా దీనికి సమాధానం దొరకదు. కానీ, అందుకు సమాధానం ఇప్పుడు దొరికేసింది. రాత్రి పూట గోర్లు ఎందుకు కట్ చేయకూడదో ఇప్పుడు తెలుసుకుందాం. 

గోర్లు కట్ చేసేందుకు సరైన సమయం..

అమెరికన్ అకాడమీ ఆఫ్ డెర్మటాలజీ అసోసియేషన్ ప్రకారం.. గోర్లలో కెరాటిన్ అనే పదార్థం ఉంటుంది. స్నానం చేసిన తర్వాత గోళ్లను కట్ చేయడం ఉత్తమమని కొందరు భావిస్తున్నారు. ఎందుకంటే మనం స్నానం చేసిన తర్వాత చాలా సేపటికి నీళ్లు లేదా సబ్బు నీటిలో గోర్లు నానడం వల్ల తేలికగా కత్తిరించవచ్చు. రాత్రిపూట వాటిని కత్తిరించే సమయంలో వాటికి తగినంత తేమ లేకపోవడం వల్ల గోర్లు గట్టిగా తయారవుతాయి. ఆ సమయంలో గోర్లు కత్తిరించే సమయంలో నొప్పి లేదా ఇబ్బందికి గురయ్యే అవకాశం ఉంది. 

మరో కారణం

రాత్రిపూట గోళ్లు కత్తిరించకూడదనే సలహా వెనుక మరొక కారణం ఉంది. అదేంటంటే.. పాత రోజుల్లో నెయిల్ కట్టర్లు అందుబాటులో లేవు. ఆ రోజుల్లో కత్తితో గానీ.. పదునైన వాటితో గోళ్లు కత్తిరించేవారు. అప్పట్లో రాత్రిపూట కరెంట్ లేదు. ఈ కారణంగా రాత్రి పూట గోర్లు కట్ చేయకూడదని పెద్దలు అంటుంటారు. కానీ, కాలం గడిచే కొద్ది అది మూఢనమ్మకంగా మారి అపోలకు దారి తీసింది. అయితే దీన్ని ఇప్పటికే నమ్మేవారు చాలా మంది ఉన్నారు. 

గోర్లు తడిగా ఉంచాలి

గోళ్లను కత్తిరించడానికి సరైన మార్గం ఏంటంటే.. ముందుగా మీ గోళ్లను తేలికపాటి నూనెలో లేదా నీటిలో నానబెట్టాలి. దీని వల్ల మీ గోర్లు మృదువుగా మారి.. ఇబ్బంది లేకుండా కట్ చేసేందుకు అవకాశం ఉంది. అయితే గోర్లు కత్తిరించిన తర్వాత కూడా వాటిని తడి చేయడం మర్చిపోవద్దు. అలాగే గోర్లు కత్తిరించిన వెంటనే మీ చేతులను శుభ్రంగా కడుక్కోవాలి. ఆ తర్వాత చేతికి మాయిశ్చరైజర్ లేదా వాజిలైన్ వంటి వాటిని అప్లై చేయాలి. దీంతో మీ గోర్లు ఎప్పడూ అందంగా ఉంటాయి.  

Also Read: Weight Loss with Ragi: ఒకేఒక్క చిట్కాతో కొద్ది రోజుల్లోనే బరువు తగ్గే మార్గం ఉంది!

Also Read: White Hair Treatment: తెల్ల జుట్టును నల్లగా మార్చేందుకు ఈ ఇంటి చిట్కాలను పాటించండి!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.

Trending News