Pulipirlu Remove Medicine: పులిపిర్ల సమస్యతో బాధపడుతున్నారా.. అయితే ఇది మీ కోసమే..!

Pulipirlu Remove Medicine: ప్రస్తుతం చాలా మంది పులిపిర్ల స‌మ‌స్య‌తో బాధపడుతున్నారు. ముఖ్యంగా ఇది చర్మ సౌందర్యాన్ని హీనంగా చేసి.. చర్మ సమస్యలకు దారీ తీస్తుంది. ఇవి ముఖంపైనే కాకుండా చర్మంలో వివిధ భాగాలపై కూడా వస్తాయి.

Written by - ZH Telugu Desk | Last Updated : Jun 29, 2022, 01:32 PM IST
  • పులిపిర్ల సమస్యతో బాధపడుతున్నారా..
  • పులిపిర్లకు మేడి చెట్టు పాలు ఔషధంగా పని చేస్తుంది
  • ఇవి ఉన్న వారి వస్తువులను ఇతరులు వాడకూడదు
Pulipirlu Remove Medicine: పులిపిర్ల సమస్యతో బాధపడుతున్నారా.. అయితే ఇది మీ కోసమే..!

Pulipirlu Remove Medicine: ప్రస్తుతం చాలా మంది పులిపిర్ల స‌మ‌స్య‌తో బాధపడుతున్నారు. ముఖ్యంగా ఇది చర్మ సౌందర్యాన్ని హీనంగా చేసి.. చర్మ సమస్యలకు దారీ తీస్తుంది. ఇవి ముఖంపైనే కాకుండా చర్మంలో వివిధ భాగాలపై కూడా వస్తాయి. శరీరానికి వీటి వల్ల ఎలాంటి హాని జరగదు కానీ.. ఇది కొన్ని సందర్భాల్లో కాన్సర్‌కు దారీ తీసే అవకాశాలున్నాయి. పులిపిర్లు కేవలం ఓ వైరస్‌ వల్ల వచ్చే  ఇన్ ఫెక్ష‌న్. ఇది శరీరంలో ఒక చోటు నుంచి మరో చోటికి సులభంగా వ్యాప్తి చెందుతుంది.

ఈ పులిపిర్లు ఉన్న వారి వస్తువులను ఇతరులు తాకడం వల్ల ఇతరులకు కూడా సులభంగా వ్యాప్తి చెందే అవకాశాలున్నాయి. అయితే ఇతరులు ఈ వస్తువులను వినియోగించకపోవడం మంచిదని నిపుణులు సూచిస్తున్నారు. ఒక వేళా తాకితే.. వెంటనే చెతులు శుభ్రం చేసుకోవడం మేలని నిపుణులు తెలుపుతున్నారు. అయితే ఈ సమస్యల నుంచి విముక్తి పొందడానికి మార్కెట్‌లో చాలా రకాల ఉత్పత్తులున్నాయి. కానీ ఇవి ఆశించిన ఫలితాలు ఇవ్వలేకపోతున్నాయి. ప్రస్తుతం చాలా మంది వీటిని శరీరం నుంచి తొలగించుకునేందురకు.. క‌త్తితో కోయ‌డం, క‌త్తిరించ‌డం వంటివి చేస్తూ ఉన్నారు. అయితే ఇలా చేసిన మళ్లీ శరీరంపైన పుట్టుకొస్తున్నాయి. అయితే ఇవి రాకుండా ఎలాంటి ఔష‌ధాలను ఉపయోగించాలో ఇప్పుడు తెలుసుకుందాం..

ఆనారోగ్య సమస్యల నుంచి ఉపశమనం పొందడానికి ఆయుర్వేదం చాలా రకాల ఔష‌ధాలను పేర్కొన్నారు. అయితే ఈ పులిపిర్ల నుంచి విముక్తి పొందడానికి కూడా పలు రకాల ఔషధాలున్నాయి. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం.. పులిపిర్లకు మేడి చెట్టును కోయగా వచ్చే పాలు వీటిని తొలగిస్తాయని నిపుణులు పేర్కొన్నారు. ఈ పాలలో ఉండే గుణాలు పులిపిర్లకు కార‌ణ‌మ‌య్యే వైర‌స్ శరీరం నుంచి తొలగిస్తాయని నిపుణులు తెలుపుతున్నారు. ఈ సమస్యతో బాధపడుతున్న వారు తప్పకుండా ఈ పాలను ఉపయోగించాలని సూచిస్తున్నారు.

(NOTE: ఇక్కడ అందించిన సమాచారం ఇంటి నివారణలు, సాధారణ సమాచారంపై ఆధారపడి ఉంటుంది. దీనిని స్వీకరించే ముందు, ఖచ్చితంగా వైద్య సలహా తీసుకోండి. ZEE NEWS దీన్ని ధృవీకరించలేదు.)

 

Also Read:  White Hair Treatment At Home: తెల్ల జుట్టు సమస్యలతో బాధపడుతున్నారా.. అయితే ఇది మీ కోసమే..!

Also Read: Meena Husband Vidyasagar: పావురాల వల్ల ప్రాణాలు కోల్పోయిన మీనా భర్త... అప్పట్లోనే జీహెచ్ఎంసీ కీలక నిర్ణయం.. కానీ?

 

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

 

Trending News