Reasons Of Dark Circles Around Eyes: ప్రస్తుతం చాలా మంది మహిళలు కళ్ల కింద నల్లటి వలయాల సమస్యలతో బాధపడుతున్నారు. ఇది పెద్ద సమస్య కాకపోయినప్పటికీ..ముఖం అందహీనంగా కనిపిస్తుంది. అయితే వీటిని కవర్ చేసుకోవడానికి చాలా మంది మార్కెట్‌లో లభించే రసాయనాలతో కూడిన మేకప్‌లను వినియోగిస్తున్నారు. అంతేకాకుండా దీని నుంచి ఉపశమనం పొందడానికి ఖరీదైన సౌందర్య చికిత్సలు కూడా తీసుకుంటారు. అయినప్పటికీ ఎలాంటి ఫలితాలు పొందలేకపోతున్నారు. ఇంతకీ ఈ డార్క్ సర్కిల్స్ రావడాని కారణాలేంటి..? రాకుండా ఉండడానికి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో మనం ఈ రోజు తెలుసుకోబోతున్నాం..
డార్క్ సర్కిల్స్‌కు కారణాలు:
✾ స్మోకింగ్ లేదా వేపింగ్ పరికారాలు ఎక్కువగా వినియోగించడం వల్ల కూడా డార్క్ సర్కిల్స్ వచ్చే అవకాశాలు ఉన్నాయి. వీటిని అతిగా వినియోగించడం వల్ల ఫ్రీ రాడికల్స్‌ను విడుదలై డార్క్ సర్కిల్స్ సులభంగా పెరిగే అవకాశాలు ఉన్నాయని సౌందర్య నిపుణులు తెలుపుతున్నారు.
✾ అలసట, తగినంత నిద్ర కారణంగా ముఖంలోని చిన్న సిరలు నల్లగా మారి, ముఖం క్రమంగా నల్లగా తయారవుతుంది. దీని కారణంగా డార్క్ సర్కిల్స్ పెరిగే అవకాశాలు కూడా ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు. .
✾ ముఖాన్ని అతిగా రుద్దడం వల్ల కూడా పోస్ట్ ఇన్ఫ్లమేటరీ హైపర్పిగ్మెంటేషన్ ఏర్పతాయి. అంతేకాకుండా చాలా మంది ప్రస్తుతం కళ్లను పదే పదే రుద్దుతున్నారు. ఇలా చేయడం వల్ల కూడా సులభంగా డార్క్ సర్కిల్స్ సమస్య రావచ్చని సౌందర్య నిపుణులు చెబుతున్నారు.
ఇది కూడా చదవండి : Cats Vs Snakes Fighting Videos: పిల్లులకు, పాములకు ఫైటింగ్ జరిగితే ఏది గెలుస్తుంది ?
✾ చర్మాన్ని హైడ్రేట్ చాలా ముఖ్యం..కళ్ల కింద మాయిశ్చరైజర్, సన్‌స్క్రీన్ అప్లై చేయకపోవడం వల్ల కూడా ఈ సమస్యలు రావచ్చని సౌదర్య నిపుణులు చెబుతున్నారు.
✾ ప్రస్తుతం డార్క్ సర్కిల్స్ శరీరంలోని లోపాల కారణంగా కూడా వస్తున్నాయని సౌందర్య నిపుణులు చెబుతున్నారు. ఐరన్ లోపం వల్ల శరీరంలో ఆక్సిజన్ కొరత ఏర్పడి..సులభంగా కంటి కింద నల్లటి వలయాలు వస్తున్నాయి.
డార్క్ సర్కిల్స్ నుంచి ఉపశమనం కలిగించే రెమెడీ:
డార్క్ సర్కిల్స్ నుంచి ఉపశమనం పొందడానికి మార్కెట్‌లో చాలా రకాల ప్రోడక్ట్స్ ఉన్నాయి. వీటికి బదులుగా సాధరణంగా ఇంట్లో లభించే కొన్ని వస్తువులతో తయారు చేసిన రెమెడీస్‌ను వినియోగించాల్సి ఉంటుంది. దీని కోసం మీరు టమాటోను మిశ్రమంగా తయారు చేసుకుని అందులో నిమ్మరసం కలిపి డార్క్ సర్కిల్స్ అప్లై చేయాల్సి ఉంటుంది. 10-15 నిమిషాల పాటు అలాగే ఉంచి..మంచి నీటితో శుభ్రం చేయడం వల్ల మంచి ఫలితాలు పొందుతారు.
ఇది కూడా చదవండి : Cats Vs Snakes Fighting Videos: పిల్లులకు, పాములకు ఫైటింగ్ జరిగితే ఏది గెలుస్తుంది ?
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3P3R74U
Apple Link - https://apple.co/3loQYe
Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి