Reduce Cholesterol: చెడు కొలెస్ట్రాల్‌ను కరిగించే నూనెలు ఇవే..మీరు ట్రై చేయండి..

Reduce Cholesterol: తీవ్ర కొలెస్ట్రాల్ సమస్యలతో బాధపడుతున్న వారు ప్రతిరోజు ఆరోగ్య నిపుణులు సూచించిన కొన్ని వంట నూనెలను వినియోగించడం వల్ల మంచి ఫలితాలు పొందుతారు. ఇందులో ఉండే గుణాలు చెడు కొవ్వును తగ్గించి మంచి కొలెస్ట్రాల్ ను పెంచేందుకు సహాయపడుతుంది. కాబట్టి మీరు కూడా ఓసారి ట్రై చేయండి.

Written by - ZH Telugu Desk | Last Updated : Jan 7, 2024, 08:56 PM IST
Reduce Cholesterol: చెడు కొలెస్ట్రాల్‌ను కరిగించే నూనెలు ఇవే..మీరు ట్రై చేయండి..

Reduce Cholesterol: కొలెస్ట్రాల్ అనేది శరీరంలో పేరుకుపోయే జిడ్డుగల స్టెరాయిడ్..ఆరోగ్యకరమైన శరీరానికి కొలెస్ట్రాల్ చాలా అవసరం. కొలెస్ట్రాల్ అనేది కణాల నిర్మాణాన్ని, కండరాలను మెరుగుపరిచేందుకు ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది. అంతేకాకుండా నాడీ కణాలను రక్షించేందుకు శరీరంలోని హార్మోన్ల తయారీకి ఎంతగానో సహాయపడుతుంది. కొలెస్ట్రాల్ అనేది ప్రధానంగా రెండు రకాలు ఒకటి మంచి కొలెస్ట్రాల్ రెండు చెడు కొలెస్ట్రాల్.. శరీరానికి మంచి కొలెస్ట్రాల్ ఎంతో అవసరం..కానీ చెడు కొలెస్ట్రాల్ పెరిగితే తప్పకుండా దీర్ఘకాలిక వ్యాధుల బారిన పడతారు. శరీరంలో చెడు కొలెస్ట్రాల్ పెరగడం ప్రారంభమైతే మొదటగా గుండె సమస్యలతో ప్రారంభమై మనిషి ప్రాణాలు కోల్పోయే అవకాశాలు కూడా ఉన్నాయి. కాబట్టి చెడు కొలెస్ట్రాల్ అనేది శరీరానికి చాలా ప్రమాదకరమైనది.

శరీరంలోని చెడు కొలెస్ట్రాల్ పెరగడానికి అనేక ప్రధాన కారణాలు ఉన్నాయి ముఖ్యంగా ఆధునిక జీవనశైలి అనారోగ్యకరమైన ఆహారాలు అతిగా తీసుకోవడం వల్లే ప్రస్తుతం చాలామందిలో చెడు కొలెస్ట్రాల్ సమస్యలు వస్తున్నాయి. కొంతమందిలో మద్యపానం సేవించడం ఇతర కారణాల వల్ల కూడా చెడు కొలెస్ట్రాల్ వస్తుంది. అయితే ప్రస్తుతం చాలామంది మార్కెట్లో కొన్ని బ్రాండ్లతో కూడిన కొలెస్ట్రాల్ అధిగా ఉండే నూనెలను వినియోగిస్తున్నారు. వీటిని వినియోగించడం వల్ల కూడా కొలెస్ట్రాల్ విపరీతంగా పెరిగిపోతుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. కాబట్టి కొలెస్ట్రాల్ సమస్య బారిన పడకుండా ఉండడానికి ప్రతిరోజు ఆరోగ్య నిపుణులు సూచించిన వంటనూనెలను వినియోగించండి.

ఆలివ్ నూనె: 
ఆలివ్ నూనెలో కొలెస్ట్రాల్ ఉండదు.. కాబట్టి తక్కువ ప్రాసెస్ చేసిన ఈ నూనె వినియోగించడం వల్ల శరీరానికి చాలా రకాల ప్రయోజనాలు లభిస్తాయి. ఇందులో యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు తక్కువగా లభిస్తాయి. అప్పటికి శరీరానికి అనేక రకాల పోషకాలను అందిస్తుంది. దీంతోపాటు ఇందులో మోనోశాచురేటెడ్ కొవ్వులు కూడా లభిస్తాయి. కాబట్టి ప్రతిరోజు సలాడ్స్, ఆహారాల్లో వినియోగించడం వల్ల శరీరంలోని కొలెస్ట్రాల్ పరిమాణాలు తగ్గుతాయి. అంతేకాకుండా చెడు కొవ్వుల పరిమాణాలు పెరగకుండా ఉంటాయి.

Also read: Ram Mandir: అయోధ్య వెళ్లేవారు తప్పకుండా సందర్శించాల్సిన పర్యాటక ప్రదేశాలు..

నువ్వుల నూనె:
నువ్వుల నూనె కూడా శరీరానికి ఎంతో మంచిది. ప్రతి టేబుల్ స్పూన్లో 5 గ్రాముల మోనోశాచురేటెడ్ కొవ్వు, 2 గ్రాముల సంతృప్త కొవ్వు లభిస్తుంది.. కాబట్టి ప్రతిరోజు ఆహారాల్లో ఈ నూనెను వినియోగించడం వల్ల శరీరంలోని కణాలు అభివృద్ధి చెందుతాయి. అంతేకాకుండా దీర్ఘకాలిక వ్యాధుల బారిన పడకుండా ఉంటారు. 

అవోకాడో ఆయిల్:
అవోకాడో నుంచి తీసిన ఆయిల్ కూడా శరీరానికి చాలా రకాల ప్రయోజనాలు కలిగిస్తుంది. అవకాడో నూనెలో మోనోశాచురేటెడ్ కొవ్వులు అత్యధికంగా ఉంటాయి. అంతేకాకుండా ఈ నూనెలో యాంటీఆక్సిడెంట్ కూడా లభిస్తాయి. కాబట్టి ప్రతిరోజు ఈ నూనెను ఆహారాల్లో వినియోగించడం వల్ల గుండె ఆరోగ్యం మెరుగుపడుతుంది. అంతేకాకుండా గుండెపోటు ఇతర తీవ్రవ్యాధుల బారిన పడకుండా ఉంటారు. కాకుండా ఇది కంటి ఆరోగ్యాన్ని మెరుగుపరిచేందుకు కూడా సహాయపడుతుంది.

Also read: Ram Mandir: అయోధ్య వెళ్లేవారు తప్పకుండా సందర్శించాల్సిన పర్యాటక ప్రదేశాలు..

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

 సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి FacebookTwitter

Trending News