Reduce Obesity Weight In 5 Days: కరోనా వైరస్ మహమ్మారి కారణంగా చాలా కంపెనీలు వర్క్ ఫ్రం హోమ్ అనే విధానాన్ని తీసుకువచ్చాయి. అయితే కరోనా వైరస్ ప్రారభమైన 2 సంవత్సరాలైనా చాలా కంపెనీలు ఇప్పటికీ వర్క్ ఫ్రమ్ హోమ్‌నే కొనసాగిస్తున్నాయి. అయితే చాలా మంది ఒకే చోట కూర్చొని పని చేయడం వల్ల వారు తీవ్ర అనారోగ్య సమస్యల బారిన పడుతున్నారు. అంతేకాకుండా ఇంట్లో తయారు చేసిన ఆహారాలు తీసుకుని బరువు కూడా పెరుగుతున్నారు. శరీర బరువు పెరగడం వల్ల చెడు కొలెస్ట్రాల్ సమస్యలు వస్తున్నాయి. దీంతో వీరు గుండె పోటుకు గురవుతున్నారు. అయితే ఈ సమస్యల నుంచి ఆరోగ్యంగా ఉపశమనం పొందడం చాలా మంచిదని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు. శరీర బరువును ఎలా ఆరోగ్యంగా తగ్గించుకోవచ్చొ ఇప్పుడు తెలుసుకుందాం..
1. మధ్యమధ్యలో నడుస్తూ ఉండండి:
8 నుంచి 10 గంటల పాటు నిరంతరంగా కుర్చీలో కూర్చొని పని చేయడం వల్ల చెడు కొలెస్ట్రాల్ పెరుగుతోంది. అయితే ఈ సమస్య నుంచి సులభంగా ఉపశమనం పొందడానికి ప్రతి గంటకు 4 నుంచి 5 నిమిషాలు విరామం తీసుకోవాల్సి ఉంటుంది. ఇలా చేయడం వల్ల శరీర బరువు కూడా అదుపులో ఉంటుంది.
2. నీటిని ఎక్కువగా తాగండి:
పని చేసే క్రమంలో నీటి తీసుకోవడం మానుకుంటారు. అయితే దీని కారణంగా కూడా తీవ్ర అనారోగ్య సమస్యలు వచ్చే అవకాశాలున్నాయి. కాబట్టి తప్పకుండా వర్క్ ఫ్రాం హోమ్ చేసే వారు ఒక గంటకి ఒక సారీ నీటిని తీసుకోవాల్సి ఉంటుంది. అంతేకాకుండా ప్రతి రోజు వ్యాయామాలు చేయడం కూడా శరీనికి చాలా మంచిదని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు. నీటిని అతిగా తీసుకోవడం వల్ల శరీరంలో చెడు కొలెస్ట్రాల్ కూడా తగ్గుతుంది.
3. ఫైబర్ రిచ్ ఫుడ్స్:
ఇంట్లోనే సులభంగా బరువు తగ్గాలనుకునేవారు కచ్చితంగా ఫైబర్ రిచ్ ఫుడ్స్ తీసుకోవాల్సి ఉంటుంది. ఇలా వీటిని తీసుకోవడం వల్ల సులభంగా బరువు తగ్గడమేకాకుండా అనారోగ్య సమస్యలు కూడా దూరమవుతాయి. కాబట్టి బరువు తగ్గాలనుకునేవారు తప్పకుండా వ్యాయామాలు చేస్తూ నీటిని తీసుకోవాల్సి ఉంటుంది.
(NOTE: ఇక్కడ ఇవ్వబడిన సమాచారం ఇంటి నివారణలు, సాధారణ సమాచారంపై ఆధారపడి ఉంటుంది. దీనిని స్వీకరించే ముందు, దయచేసి వైద్య సలహా తీసుకోండి. ZEE NEWS దీన్ని ధృవీకరించలేదు.)
Also Read: Pranitha Subhash Latest Photoshoot : ప్రణీత.. ఏంటీ అందాల ఆరబోత.. తల్లైనా తగ్గేదేలే
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3P3R74U
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter , Facebook