Applying Turmeric On Face Side Effects: వేసవికాలంలో చర్మం పొడి, మంట, మొటిమలు, మచ్చలు వంటి సమస్యలు తలెత్తుతాయి. దీని కోసం మార్కెట్లో లభించే వివిధ క్రీములు, ప్రొడెట్స్‌ను ఉపయోగిస్తారు. దీని వల్ల కొంత ఉపశమనం కలుగుతుంది. అయితే చాలా ముఖానికి డైరెక్ట్‌గా పసుపును రాసుకుంటారు. నిపుణులు ప్రకారం పసుపును ముఖానికి నేరుగా రాసుకోవడం వల్ల కొన్ని చర్మ సమస్యలు కలుగుతాయని చెబుతున్నారు. అయితే దీని వల్ల కలిగే నష్టాలు ఏంటో మనం తెలుసుకుందాం.
పసుపు అనేది ప్రతి భారతీయులు ఇళ్లల్లో ఖచ్చితంగా ఉండే పదార్థం. దీనిని కూరలకు ఉపయోగిస్తారు. అంతేకాకుండా ఏదైనా గాయలు తగ్గిలినప్పుడు పసుపును వాడుతారు. ఇది యాంటీ బ్యాక్టీరియా లక్షణాలు కలిగి ఉంటుంది. అంతేకాకుండా ఔషధ గుణాలు కూడా ఉంటాయి. ఇన్ని ప్రయోజనాలు ఉన్నాయి కాబట్టి దీనిని ప్రతిఒకరు ఉపయోగిస్తారు.
అంతే కొందరు ఆహారంలోనే కాకుండా సౌందర్య కోసం వాడుతుంటారు. దీని రాసుకోవడం వల్ల చర్మం కాంతివంతంగా, మొటిమలు, మచ్చలు, పొడి బారకుండా ఉంటుందని నమ్ముతారు. కానీ సౌందర్య నిపుణులు ప్రకారం ఇలా నేరుగా ముఖానికి పసుపు రాసుకోవడం వల్ల కొన్ని చర్మం సమస్యలు కలుగుతాయని చెబుతున్నారు. అందులో ముఖ్యంగా అలర్జీ, చికాకు, దురద, ఎర్రటి మచ్చలు కలుగుతాయని అంటున్నారు.
కాబట్టి పసుపును నేరుగా ఉపయోగించకుండా ఎలా ఉపయోగించవచ్చు..
పసుపు ముసుగులు: పెరుగు, పాలు, తేనె లేదా అరటిపండు వంటి ఇతర పదార్థాలతో పసుపును కలపడం ద్వారా చర్మాన్ని తేమగా ఉంచే ముసుగులను తయారు చేయవచ్చు.
పసుపు స్నానం: ఒక టేబుల్ స్పూన్ పసుపును మీ స్నానపు నీటికి కలపడం ద్వారా ఒక ఉత్తేజకరమైన, శుభ్రపరిచే స్నానం చేయవచ్చు.
పసుపు సబ్బు: పసుపుతో చేసిన సబ్బును ముఖం శరీరానికి శుభ్రపరచడానికి ఉపయోగించవచ్చు.
పసుపు క్రీం: పసుపుతో చేసిన క్రీం లేదా మాయిశ్చరైజర్‌ను రోజువారీ చర్మ సంరక్షణలో భాగంగా ఉపయోగించవచ్చు.
పసుపు పాలు: ఒక గ్లాసు పాలలో ఒక టీస్పూన్ పసుపు కలిపి తాగడం వల్ల చర్మానికి మంచిది.
పసుపును ఉపయోగించేటప్పుడు ఈ క్రింది జాగ్రత్తలు తీసుకోవడం ముఖ్యం:
మీ చర్మానికి ఒక చిన్న పాచ్ టెస్ట్ చేయడం ద్వారా పసుపుకు మీకు అలెర్జీ లేదా సున్నితత్వం లేదని నిర్ధారించుకోండి.
మీ కళ్ళు, నోటి నుంచి దూరంగా ఉంచండి.
చర్మాన్ని పొడిగా లేదా చికాకుగా మార్చినట్లయితే, ఉపయోగించడాన్ని మానేసి, చర్మవ్యాధి నిపుణుడిని సంప్రదించండి.
పసుపును నేరుగా ఉపయోగించకుండా ఉపయోగించడం ద్వారా, మీరు ఇప్పటికీ దాని అనేక సౌందర్య ప్రయోజనాలను పొందవచ్చు, మీ చర్మాన్ని దెబ్బతీసే ప్రమాదం లేకుండా.
Also Read 2024 Bajaj Pulsar N250: మార్కెట్లోకి కొత్త పల్సర్ N250 వచ్చేసింది.. ఫీచర్స్, స్పెషిఫికేషన్స్ ఇవే!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి