Curd Lemon Benefits: ఆ రెండు పదార్ధాలు కలిపి రాస్తే..మీ ముఖం అందంగా కళకళలాడుతుంది

Curd Lemon Benefits: అందమైన ముఖం, చర్మం నిగారింపు ఉండాలని ప్రతి ఒక్కరికీ ఉంటుంది. ముఖ సౌందర్యం కోసం కొన్ని సులభమైన చిట్కాలు మంచి ఫలితాలనిస్తాయి. ఆ వివరాలు తెలుసుకుందాం..

Written by - Md. Abdul Rehaman | Last Updated : Nov 4, 2022, 12:59 AM IST
Curd Lemon Benefits: ఆ రెండు పదార్ధాలు కలిపి రాస్తే..మీ ముఖం అందంగా కళకళలాడుతుంది

అందంగా కన్పించేందుకు, ముఖం కళకళలాడేందుకు, స్కిన్ గ్లో కోసం చాలామంది చాలా రకాలుగా ప్రయత్నిస్తుంటారు. అన్నింటికంటే ఉత్తమమైంది సహజసిద్ధమైన పద్ధతి. ఏ మాత్రం దుష్పరిణామాల్లేని ఆ పద్ధతి గురించి పరిశీలిద్దాం..

అందాన్ని తీర్చిదేందుకు కొన్ని హోమ్ మేడ్ రెమిడీస్ అద్భుతమైన ప్రయోజనాల్ని ఇస్తాయి. ఇందులో అతి ముఖ్యమైంది పెరుగు, నిమ్మ మిశ్రమం.  ఈ మిశ్రమంతో చాలా రకాలైన సమస్యలు దూరమౌతాయి. పెరుగులో ఉండే గుణాలు చర్మాన్ని మెరుగుపర్చడం, యాక్నే, పింపుల్స్ సమస్యల్ని దూరం చేయడం చేస్తుంది. ఇక నిమ్మలో ఉండే విటమిన్ సి, ఇతర గుణాలు చర్మ సంబంధిత సమస్యల్ని తొలగిస్తాయి. ఈ క్రమంలో పెద్దగా ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే పెరుగు, నిమ్మ మిశ్రమాన్ని సులభంగా తయారు చేసుకోవచ్చు.

పెరుగు, నిమ్మరసం మిశ్రమం ఎలా చేయాలంటే..ముందుగా రెండు స్పూన్స్ పెరుగు,1 స్పూన్ నిమ్మరసం బాగా కలుపుకోవాలి. అంతే..తయారైపోయినట్టే. ఈ మిశ్రమాన్ని ముఖంపై రాసుకుని..అరగంట తరువాత శుభ్రంగా కడిగేయాలి.

పెరుగు, నిమ్మ మిశ్రమం డ్రై స్కిన్‌ సమస్యను తొలగిస్తుంది. పెరుగు, నిమ్మలో ఉండే గుణాలు ముఖ సంరక్షణ, పింపుల్స్ వంటి సమస్యల్ని దూరం చేస్తాయి. ఒకవేళ మీ స్కిన్ డ్రైగా ఉంటే..మీ ముఖంపై పెరుగు, నిమ్మ కలిపి రాయవచ్చు. ఇలా చేస్తే డ్రైనెస్ దూరమౌతుంది. 

యాక్నే, పింపుల్స్ దూరం చేసేందుకు పెరుగు, నిమ్మ ఉపయోగం చాలా కీలకమిక్కడ. ఇందులో ఉండే యాంటీ ఇన్‌ఫ్లమేటరీ గుణాలు, పింపుల్స్ కారణంగా తలెత్తే వాపు కూడా దూరమౌతుంది. చర్మాన్ని తేమగా ఉంచేందుకు పెరుగు, నిమ్మ అద్భుతంగా ఉపయోగపడతాయి. ఈ మిశ్రమాన్ని రాయడం వల్ల చర్మంలో తేమ ఉంటుంది. అంతేకాకుండా..చర్మం కోమలంగా, మృదువుగా ఉంటుంది. పెరుగులో నిమ్మరసం కలిపి రాయడం వల్ల స్కిన్ సెల్స్ తెర్చుకుంటాయి. ముఖచర్మంపై ఉండే దుమ్ము ధూళి వంటి వ్యర్ధాలు తొలగిపోతాయి.

Also read: Healthy Weight Reduction: సహజంగా, ఆరోగ్యంగా బరువు తగ్గేందుకు ఏం చేయాలి

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.    

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu  

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News