Skin Care Mistakes: ఎండకాలంలో చర్మాన్ని సంరక్షించుకోవడం చాలా ముఖ్యం. లేదంటే చర్మ సమస్యలు వచ్చే అవకాశాలున్నాయి. అయితే చాలా మంది చర్మానికి వివిధ రకాల ఉత్పత్తులు వినియోగించడం వల్ల చర్మం, ముఖం మీద మొటిమలు వస్తున్నాయి. హానికరమైన చర్మానికి సంబంధించిన ప్రోడక్ట్‌ను వినియోగించడం వల్ల ముఖం అందహీనంగా మారి, మొటిమలు పెద్ద మొత్తంలో వచ్చే అవకాశాలున్నాయి. అయితే పొరపాటు ఎక్కడ జరుగుతుందో..మొటిమల నుంచి విముక్తి పొందడం ఎలాగో తెలుసుకుందాం..
తప్పుడు చర్మ సంరక్షణ ప్రోడక్ట్:
చర్మ ఉత్పత్తులను వినియోగించే ముందు..మీరు ఎదుర్కొంటున్న చర్మంకు అనుగుణంగా ప్రోడక్ట్‌ను వినియోగించడం చాలా ముఖ్యం. ఒకవేళా తప్పుడు ఉత్పత్తిని ఉపయోగిస్తే..చర్మానికి హాని కలిగించి మోటిమలకు దారి తీస్తుంది.
హానికరమైన మేకప్ కిట్‌లను ఉపయోగించడం:
మేకప్ చేసుకోవడం వల్ల ముఖ సౌందర్యం మరింత పెరుగుతుంది. అయితే మేకప్ చేసుకునేందుకు అనేక ఉత్పత్తులు మార్కెట్‌లో ఉన్నాయి. ఈ ఉత్పత్తుల్లో రసాయనాల శాతం ఎక్కువగా ఉంటుంది. వీటిని వాడడం వల్ల ముఖానికి ఆక్సిజన్ అందక మొటిమలు రావడం మొదలవుతాయి.
తప్పుడు ఫేష్ వాష్:
ముఖాన్ని రోజుకు రెండు లేదా ముడు సార్లు మంచి నీటితో శుభ్రపరుచుకోవాలి. దీని కోసం మంచి ఫేష్ వాష్‌ను వాడాలి. అలాగే చర్మాన్ని ఎక్స్‌ఫోలియేట్ చేయడానికి క్లెన్సర్‌లను ఉపయోగించకూడదు. ఇలా చేయడం వల్ల చర్మం పగిలిపోవడం, చర్మ సమస్యలు అధికమవుతాయి.
మేకప్ తొలగించడంలో జాగ్రత్తలు:
మేకప్ తీసేయడానికి వైప్స్ వాడితే మంచిదని చర్మ సౌందర్య నిపుణులు తెలుపుతున్నారు. దాన్ని వాడిన తర్వాత ఫేస్ వాష్ ప్రొడక్ట్స్ కూడా వాడాలని వారు చెబుతున్నారు.
(NOTE: ఇక్కడ ఇవ్వబడిన సమాచారం ఇంటి నివారణలు, సాధారణ సమాచారంపై ఆధారపడి ఉంటుంది. దానిని స్వీకరించే ముందు, ఖచ్చితంగా వైద్య సలహా తీసుకోండి. ZEE NEWS దీన్ని ధృవీకరించలేదు.)
Also Read: Thin Body Tips: మీ బాడీని స్లిమ్‌గా మార్చుకోవాలనుకుంటున్నారా..అయితే ఈ ఆహార నియమాలు పాటించండి..!!
Also Read: Dead Body in JNU: జేఎన్‌యూలో డెడ్ బాడీ కలకలం... చెట్టుకు వేలాడుతూ కుళ్లిపోయిన స్థితిలో మృతదేహం
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter, Facebook