Skin Care Tips: వేసవి కాలంలో చర్మ సంరక్షణకు ప్రత్యేక చర్యలు తీసుకోవాలి. డీ హైడ్రేషన్, ట్యానింగ్ వంటి సమస్యలతో చర్మం నల్లబడటం, నిర్జీవంగా మారడం జరుగుతుంటుంది. చర్మ సంరక్షణ విషయంలో ఏమాత్రం పొరపాట్లు చేసినా లేనిపోని సమస్యలు చుట్టుముడతాయి.
ఎండాకాలం ఎండలు దంచి కొడుతున్నాయి. బయటకు వెళితే ఎండ తీవ్రత కారణంగా చర్మం ట్యానింగ్‌కు గురవుతోంది. మరోవైపు డీ హైడ్రేట్ అయి నిర్జీవంగా మారుతుంటుంది. ఈ క్రమంలో వేసవిలో చర్మ సంరక్షణకు ప్రత్యేక శ్రద్ధ అవసరం. చాలామంది పగలు చర్మంపై శ్రద్ధ తీసుకున్నా, రాత్రి వేళ వదిలేస్తుంటారు. దీనివల్ల చర్మ సంబంధిత సమస్యలు చాలా ఎదురౌతాయి. అందుకే రాత్రి సమయంలో చర్మాన్ని సంరక్షించేందుకు ఏం చేయాలనేది తెలుసుకుందాం..
చాలామంది మహిళలు రాత్రి నిద్రించేముందు పగలు వేసుకున్న మేకప్ తొలగించడం మర్చిపోతుంటారు లేదా నిర్లక్షం వహిస్తుంటారు. ఈ అలవాటు చర్మానికి ఏ మాత్రం మంచిది కాదు. బయట్నించి వచ్చిన తరువాత ఎట్టి పరిస్థితుల్లోనూ మేకప్ తొలగించుకోవడం మర్చిపోకూడదు.
ఇంకొంతమంది చలి పెరిగినప్పుడు అదే పనిగా నూనె రాస్తుంటారు. దీనివల్ల చర్మం ఆయిలీగా అయిపోతుంది. అందుకే రాత్రి పడుకునేముందు లైట్ మాయిశ్చరైజర్ వినియోగిస్తే మంచిది. రాత్రి పూట చర్మం పట్ల ఎక్కువ కేర్ తీసుకోవాలి. చర్మ సంరక్షణపై ఎంత శ్రద్ధ తీసుకంటే అంత మంచిది. ఇంకొందరైతే రాత్రి పూట మాయిశ్చరైజర్ రాస్తారు కానీ పగలు రాయరు. ఒకసారి రాస్తే సరిపోతుందనుకుంటారు. కానీ ఇది సరైన విధానం కాదు. ఉదయం కూడా మాయిశ్చరైజర్ రాయాల్సి ఉంటుంది. దీనివల్ల చర్మానికి కావల్సిన పోషకాలు లభిస్తాయి. అదే సమయంలో చర్మాన్ని హైడ్రేట్‌గా ఉంచేందుకు ప్రయత్నించాలి. మాయిశ్చరైజర్ కూడా అదేపనిగా ఎక్కువ వాడకూడదు. 24 గంటలూ మాయిశ్చరైజర్ రాస్తుంటే పింపుల్స్ సమస్య వెంటాడుతుంది.
Also read: Summer Effect: రోహిణీ కార్తె రేపట్నించే ప్రారంభం, ఎండల తీవ్రత మళ్లీ పెరగనుందా
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook