Lip Care Tips: ఈ హోమ్‌ మేడ్‌ లిప్ బామ్‌తో పెదాల సమస్యలకు 2 రోజుల్లో చెక్‌!

How To Make Watermelon Lip Balm: వేసవి కారణంగా వాతావరణం తేమ శాతం పెరిగిపోతోంది. దీని కారణంగా చర్మ సమస్యలు వస్తున్నాయి. ముఖ్యంగా లిప్స్‌ పగిలిపోతున్నాయి. అయితే ఇలాంటి సమస్యలతో బాధపడేవారు తప్పకుండా పలు పుచ్చకాయ లిప్ బామ్ వినియోగించవచ్చు.  

Written by - ZH Telugu Desk | Last Updated : Apr 16, 2023, 03:19 PM IST
Lip Care Tips: ఈ హోమ్‌ మేడ్‌ లిప్ బామ్‌తో పెదాల సమస్యలకు 2 రోజుల్లో చెక్‌!

How To Make Watermelon Lip Balm: నీటి శాతం ఎక్కువగా ఉన్న పండ్లలో పుచ్చకాయ ఒకటి. దీనిని వేసవి కాలంలో క్రమం తప్పకుండా తీసుకోవడం వల్ల చాలా రకాల ప్రయోజనాలు కలుగుతాయి. అంతేకాకుండా ఇందులో ఉండే గుణాలు జీర్ణవ్యవస్థ ఆరోగ్యంగా ఉంచేందుకు కీలక పాత్ర పోషిస్తుంది. పుచ్చకాయలో విటమిన్ ఎ, బి6, సితో పాటు చాలా రకాల పోషకాలు లభిస్తాయి. కాబట్టి దీనిని తీసుకోవడం వల్ల వేసవి కాలంలో ఎండల నుంచి ఉపశమనం లభిస్తుంది. దీనిని వినియోగించడం వల్ల అనారోగ్య సమస్యలు దూరమవ్వడమేకాకుండా తీవ్ర చర్మ సమస్యలు కూడా సులభంగా దూరమవుతాయి. ఎండా కాలంలో UV కిరణాల వల్ల కలిగే కాలుష్యం కారణంగా పెదాలు అందహీనంగా(Chapped Lips) తయారవుతున్నాయి. కాబట్టి వీటిని రక్షించుకునేందుకు చక్కని పుచ్చకాయ లిప్ బామ్‌ను పరిచయం చేయబోతున్నాం.

ఈ లిప్ బామ్‌ను తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు:
1 టేబుల్ స్పూన్ షియా బటర్
2 టేబుల్ స్పూన్ల తేనె
1/2 టీస్పూన్ పుచ్చకాయ రుచిగల నూనె
2 టేబుల్ స్పూన్లు పచ్చి కొబ్బరి నూనె

Also Read: Jio Cinema Charges: జియో సినిమాకు ఇకపై డబ్బులు చెల్లించాల్సిందే.. ఐపీఎల్‌ 203 మాత్రం..! 

పుచ్చకాయ లిప్ బామ్ తయారీ విధానం:
పుచ్చకాయ లిప్ బామ్ చేయడానికి ముందుగా డబుల్ బాయిలర్‌ను తీసుకోవాల్సి ఉంటుంది.
బీస్వాక్స్, వర్జిన్ కొబ్బరి నూనె, షియా వెన్నను ఒక బౌల్‌ వేయాల్సి ఉంటుంది.
అందులోనే పుచ్చకాయ రుచిగల నూనె వేసి మరిగించాలి.
ఈ ఇలా మిశ్రమాన్ని వేడి చేసి పక్కన పెట్టాలి.
అయితే ఈ మిశ్రమం చల్లారిన తర్వాత 30 నిమిషాలు ఫ్రిజ్‌లో ఉంచండి.
ఇలా 30 నిమిషాల తర్వాత మీరు ఈ మిశ్రమాన్ని లిప్ బామ్‌గా వినియోగించవచ్చు.

(నోట్‌: ఇక్కడ ఇవ్వబడిన సమాచారం ఇంటి నివారణలు, సాధారణ సమాచారంపై ఆధారపడి ఉంటుంది. దానిని స్వీకరించే ముందు తప్పనిసరిగా వైద్య సలహా తీసుకోవాలి. ZEE NEWS దానిని ధృవీకరించలేదు.)

Also Read: Jio Cinema Charges: జియో సినిమాకు ఇకపై డబ్బులు చెల్లించాల్సిందే.. ఐపీఎల్‌ 203 మాత్రం..! 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe

TwitterFacebook మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.

 

Trending News