Variety Breakfast Recipes : మధ్యాహ్నం సాయంత్రం కంటే ఉదయం పూట మాత్రమే ఎక్కువ ఆహారం తీసుకోవాల్సి ఉంటుంది. కానీ ఎంత తింటున్నాం అనే విషయం పక్కన పెడితే ఎక్కువ పోషకాలు ఉండే ఆహారం తీసుకోవడం మంచిది. ముఖ్యంగా ప్రోటీన్స్ ఎక్కువగా ఉండే బ్రేక్ఫాస్ట్ తీసుకోవడం వల్ల ఆరోగ్యం మెరుగు పడుతుంది.
రాగి పిండి దోశలు..
టిఫిన్ అనగానే ఇడ్లీ తర్వాత ఇడ్లీ దోస మాత్రమే చాలామందికి గుర్తొచ్చే ఐటమ్. కానీ వాటిని కూడా మనం హెల్తీగా మార్చుకోవచ్చు. దానికోసమే మామూలు దోశ బదులు రాగి దోశలను తినవచ్చు. రాగి లో ఉండే ఐరన్ కంటెంట్ శరీరానికి చాలా బాగా ఉపయోగపడుతుంది. కొంచెం రాగి పిండి తీసుకొని సరిపడా ఉప్పు వేసి, సన్నగా తరిగిన ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, జీలకర్ర, అల్లం తురుము, కరివేపాకు, కొత్తిమీర వేసి కొంచెం నీళ్లు పోస్తూ దోశ పిండి లాగా కలుపుకోవాలి. ఆ పిండితో దోశలు వేసుకుని తింటే ఆరోగ్యానికి ఎంతో మంచిది.
సలాడ్..
స్ప్రౌట్స్, బఠానీలు ఈ రెండిటిలోనూ మంచి ప్రోటీన్ కంటెంట్ ఉంటుంది కానీ అలాగే క్యాలరీలు కూడా చాలా తక్కువగా ఉంటాయి. మొలకెత్తిన బఠానీలను కూడా సాలాడ్ లో తీసుకోవచ్చు. దీనికోసం ముందుగా మొలకలు, కొంచెం ఉల్లి తరుగు, చిన్న ముక్కలుగా కోసిన టమాటా, దోసకాయ క్యారెట్ ముక్కలు వేసుకొని కొంచెం ఉప్పు, నిమ్మరసం కలుపుకొని సలాడ్ లాగా తినవచ్చు.
ప్రోతిన్ రిచ్ దోశ..
మామూలు దోశలు కాకుండా ప్రోటీన్ రిచ్ దోశలు వేసుకోవడం మంచిది. దానికోసం మనకి నచ్చిన పప్పుని కనీసం రెండు గంటల పాటు నానబెట్టి తర్వాత చిన్న పచ్చిమిరపకాయ, అల్లం ముక్క వేసి మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. కొంచెం నీళ్లు పోసుకుంటూ దోశ పిండి లాగా తయారు చేసుకుని దాంతో దోశలు వేసుకుంటే కూడా రుచిగా ఉండటంతో పాటు మన ఆరోగ్యానికి కూడా ఎంతగానో ఉపయోగపడుతుంది.
ఓట్స్ ఇడ్లీ..
చాలామందికి ఇష్టమైన టిఫిన్ లలో ఇడ్లీ కూడా ఒకటి. కానీ మామూలు రవ్వతో కంటే ఓట్స్ తో వేసిన ఇడ్లీ ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. మామూలుగానే ఇడ్లీ పిండి పట్టుకొని అందులో బియ్యానికి బదులుగా ఓట్స్ వేసుకొని గ్రైండర్ లో వేసుకోవాలి. గ్రైండ్ చేసే ముందు కొంచెం ఓట్స్ కూడా కలుపుకొని మిక్స్ చేశాక రాత్రి మొత్తం పులియబెడితే ఉదయానికి ఓట్స్ ఇడ్లీ పిండి రెడీ అవుతుంది. వాటితో ఇడ్లీలు వేసుకొని తింటే మన ఆరోగ్యానికి ఎంతగానో మంచిది.
టిఫిన్ చేసే సమయంలో సింపుల్ గా ప్రొటీన్ షేప్ కూడా చేసుకునే తాగొచ్చు. దానివల్ల బరువు కూడా తగ్గుతారు. 2 జీడిపప్పు, ఒక ఫిగ్, 3 బాదంపప్పు, 10 ఎండు ద్రాక్ష, రెండు పిస్తా పప్పులు, రెండు వాల్నట్స్, ఒక చెంచా వేరుశనగల్ని రాత్రంతా నానబెట్టుకుని ఉదయాన్నే చెంచా ఓట్స్, మీడియం సైజ్ అరటిపండు వేసి మెత్తగా బ్లెండ్ చేసుకుంటే ఎంతో టేస్టీ ప్రోటీన్ షేక్ రెడీ అవుతుంది.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.