Cashew Nuts: క్రమం తప్పకుండా జీడిపప్పు తీసుకోవడం వల్ల కలిగే ప్రయోజనాలు ఇవే..!

Cashew Nuts Benefits: డ్రై ఫ్రూట్స్‌లో జీడిపప్పును చాలా మంది ఎంతో ఇష్టంగా తింటారు. దీని మనం తీపి పదార్థాలలో కూడా ఉపయోగిస్తాము. దీని తీసుకోవడం వల్ల ఆరోగ్యానికి ఎన్నో లాభాలు కలుగుతాయి. జీడిపప్పు తినడం వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలు తెలుసుకుందాం..

Written by - ZH Telugu Desk | Last Updated : Mar 7, 2024, 08:03 PM IST
Cashew Nuts: క్రమం తప్పకుండా జీడిపప్పు తీసుకోవడం వల్ల కలిగే ప్రయోజనాలు ఇవే..!

Cashew Nuts Benefits: జీడిపప్పు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. ఇందులో అనేక రకాల పోషకాలు దాగి ఉన్నాయి. ముఖ్యంగా మెగ్నీషియం,  ఫాస్పరస్‌, ఐరన్ వంటి గుణాలు పుష్కలంగా లభిస్తాయి. దీని క్రమం తప్పకుండా తీసుకోవడం వల్ల ఆరోగ్యానికి ఎన్నో లాభాలు కలుగుతాయి. అయితే చాలా మంది డ్రై ఫ్రూట్స్‌ ను ఎప్పుడో ఒకసారి తీసుకుంటారు. కానీ ప్రతిరోజు తీసుకోవడం వల్ల శరీరం దృఢంగా తయారు అవుతుందని ఆరోగ్యానిపుణులు చెబుతున్నారు.  అయితే ప్రతిరోజు జీడిపప్పు తీసుకోవడం వల్ల కలిగే లాభాలు ఏంటో మనం ఇప్పుడు తెలుసుకుందాం.

జీడిపప్పు తినడం వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలు:

జీడిపప్పులో పోషకాలు:

విటమిన్లు: 

జీడిపప్పులు విటమిన్ ఎ, బి,ఇ, ఐరన్, మెగ్నీషియం, ఫాస్పరస్ వంటి అనేక ముఖ్యమైన పోషకాలు కలిగి ఉంటాయి.

ఆరోగ్యకరమైన కొవ్వులు:

జీడిపప్పులు మంచి కొలెస్ట్రాల్‌ను పెంచడానికి  చెడు కొలెస్ట్రాల్‌ను తగ్గించడానికి సహాయపడే ఆరోగ్యకరమైన కొవ్వులను కలిగి ఉంటాయి.

ఫైబర్:

 జీడిపప్పులు మంచి మొత్తంలో ఫైబర్‌ను కలిగి ఉంటాయి. ఇది జీర్ణవ్యవస్థ ఆరోగ్యానికి మేలు చేస్తుంది. కడుపు నిండుగా ఉంచడానికి సహాయపడుతుంది.

గుండె ఆరోగ్యం:

జీడిపప్పులు చెడు కొలెస్ట్రాల్‌ను తగ్గించడానికి, రక్తపోటును నియంత్రించడానికి సహాయపడతాయి. ఇది గుండె ఆరోగ్యాన్ని కాపాడుతుంది.

మధుమేహ నియంత్రణ:

జీడిపప్పులు రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రించడంలో సహాయపడతాయి.

బలమైన ఎముకలు:

జీడిపప్పులు మెగ్నీషియం, ఫాస్పరస్ వంటి ఎముకల ఆరోగ్యానికి మేలు చేసే గుణాలు కలిగి ఉంటాయి.

బరువు తగ్గించడం:

జీడిపప్పులు మిమ్మల్ని ఎక్కువసేపు కడుపు నిండుగా ఉంచుతాయి. ఇది బరువు తగ్గించడానికి సహాయపడుతుంది.

మెదడు ఆరోగ్యం:

జీడిపప్పులు మెదడు పనితీరును మెరుగుపరచడానికి జ్ఞాపకశక్తిని పెంచడానికి సహాయపడే పోషకాలను కలిగి ఉంటాయి.

ఈ విధంగా ప్రతిరోజు క్రమం తప్పకుండా జీడిపప్పు తీసుకోవడం వల్ల ఆరోగ్యానికి ఎంతో మేలు కలుగుతుంది. అంతేకాకుండా వీటిని పిల్లల నుంచి పెద్దల వరకు తీసుకోవడం చాలా మంచిది. జీడిపప్పు మాత్రమే కాకుండా డ్రై ఫ్రూస్స్‌లో  వచ్చే ప్రతి ఆహార పదార్థాలను తీసుకోవడం వల్ల శరీరానికి పోషకాలు అందుతాయి. అలాగే పాలతో వీటిని కలిపి తీసుకోవడం వల్ల ఆరోగ్యంగా ఉంటారని ఆరోగ్యానిపుణులు చెబుతున్నారు. అయితే వీటిని మితంగా తీసుకోవడం శరీరానికి మంచిది. అతిగా తింటే అనారోగ్య సమస్యల బారిన పడాల్సి ఉంటుంది. 

గమనిక: జీడిపప్పులు ఆరోగ్యకరమైనవి అయినప్పటికీ, వాటిలో ఎక్కువ కేలరీలు ఉంటాయి కాబట్టి, వాటిని మితంగానే తినాలి. మీకు ఏమైనా ఆరోగ్య సమస్యలు ఉంటే, జీడిపప్పులు తినడం మంచిదా కాదా అని డాక్టర్‌ను సంప్రదించడం మంచిది.

Also Read: LPG Cylinder Price Hike: ఫస్ట్‌రోజే సామాన్యులకు బిగ్ షాక్! ఎల్పీజీ గ్యాస్ ధరల పెంపు.. నగరాలవారీగా ధరలు ఎలా ఉన్నాయంటే?

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి FacebookTwitter

Trending News