వర్షాకాలంలో వస్తువులు జర భద్రం

Last Updated : Nov 9, 2017, 08:10 PM IST
వర్షాకాలంలో వస్తువులు జర భద్రం

వర్షాకాలం వచ్చిదంటే అందరూ ఎక్కడ ఏం తడిసిపోతాయో అని గాభరా పడుతూ కనిపిస్తుంటారు. పుస్తకాలు, బట్టలు, నగలు, చెప్పులు ఇలా తమ వస్తువులు ఎక్కడ తడిసిపోతాయోనని సందేహిస్తుంటారు. బయట ఉన్నా ఇంటికి తొందరగా వచ్చేస్తుంటారు. వచ్చి అన్ని సర్దుకుంటారు. ఈ చిన్న చిట్కాలను పాటిస్తే ఆ వస్తువులు తడవకుండా చేసుకోవచ్చు. మరి ఆలస్యం ఎందుకు.. ఆ చిట్కాలేంటో చూద్దాం పదండీ..! 

* వర్షాకాలంలో పుస్తకాల వైపు కాస్త ధ్యాస పెట్టాలి. చెమ్మకు చెదలు పట్టే అవకాశం ఎక్కువ. కనుక పుస్తకాలను పక్కకు పెట్టి కిరోసిన్ అద్దిన బట్టతో ఆ అరల్ని రుద్ది పుస్తకాలు సర్దుకోవాలి. ఇలా చేయడం వల్ల చెదలు పట్టవు. 

* ప్లాటినం, బంగారు నగలను ధరించి వర్షంలో బయటకు వెళ్లి తడిసి వస్తే, వెంటనే ఆభరణాలను పొడి వస్త్రంతో తుడిచి గాలికి ఆరబెట్టాలి. ఆతరువాత టిష్యూ పేపర్లో చుట్టి నగల పెట్టెలో భద్రపరచాలి. 

* వెండి నగలు ధరించి వర్షంలో తడిసివస్తే దాని కాంతి తగ్గి, నల్లగా మారుతుంది. గమనించారా? కప్పు నీళ్లలో చెంచా టూత్‌పేస్ట్ వేసి కలిపి, అందులో వెండి నగలను పదినిమిషాలు నానబెట్టాలి. తరవాత బ్రష్‌తో బాగా తోమి మంచినీటిలో కడిగి తుడిస్తే నలుపు పోతుంది.

Trending News