Tomato Side Effects: భారతీయులు టమాటోలను ప్రతి కూరలో వినియోగిస్తారు. ఇవి ఆహారాల రుచిని పెంచడమే కాకుండా మంచి రంగును అందిస్తాయి. చాలా మంది వీటిని సలాడ్లు, సాస్‌లు ఎక్కువగా తయారు చేసుకోవడానికి వినియోగిస్తూ ఉంటారు. క్రమం తప్పకుండా టమాటోలను తినడం వల్ల శరీరానికి అనేక రకాల ప్రయోజనాలు కలుగుతాయి. కానీ ప్రస్తుతం చాలా మంది వీటిని అతిగా వినియోగిస్తున్నారు. నిజాని వీటిని ఆహారాల్లో అతిగా వినియోగించడ, ప్రతి రోజు తినడం వల్ల లాభాల కంటే నష్టాలే ఎక్కువ జరుగుతాయని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు. ఇందులో ఉండే కొన్ని మూలకాలు తీవ్ర దుష్ప్రభావాలకు దారీ తీసే ఛాన్స్‌లు ఉన్నాయి. అయితే అతిగా తినడం వల్ల కలిగే నష్టాలేంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం.
టమాటో దుష్ప్రభావాలు:
జీర్ణ సమస్యలు:
టమాటోలు సాలిసిలేట్స్ అనే సహజ రసాయనాలను కలిగి ఉంటాయి. ఇవి కొంతమందిలో అజీర్ణం, గ్యాస్‌తో పాటు విరేచనాలకు దారితీస్తుందని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు. తరచుగా పొట్ట సమస్యలతో బాధపడేవారు అతిగా ఈ టమాటోలను తినడం అస్సలు మంచిది కాదని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు. కాబట్టి అతిగా వీటిని తినడం మానుకుంటే చాలా మంచిది.
అలెర్జీ సమస్యలు:
కొంతమందికి టమాటోలు అతిగా తినడం వల్ల అలెర్జీ వంటి చర్మ సమస్యలకు కూడా దారీ తీస్తుంది. వీటిని తింటే చర్మపై దద్దుర్లు, దురద, వాపు, ముక్కు కారడం, శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు కూడా తలెత్తే ఛాన్స్‌లు ఉన్నాయి. ఇప్పటికే అలెర్జీ సమస్యతో బాధపడుతున్నవారు అతిగా టమాటోలను తినడం మానుకోవాల్సి ఉంటుంది. లేదంటే తినే ముందు వైద్యుడిని సంప్రదించడం మంచిది.
రక్తం గడ్డకట్టడం సమస్యలు:
టమాటోలు విటమిన్ K అధిక పరిమాణంలో లభిస్తుంది. ఇది రక్తం గడ్డకట్టడానికి సహాయపడే పోషకంగా భావిస్తారు. అయితే ఇప్పటికే రక్తాన్ని పలుచగా చేసే మందులు వాడుతుంటే లేదా రక్తం గడ్డకట్టడం వంటి సమస్యలు ఉన్నవారు టమాటోలను తినడం మానుకోవడం చాలా మంచిదని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు. వీటిని ఎక్కువగా తినడం వల్ల రక్తస్రావ ప్రమాదం పెరుగుతుంది.
గుండెల్లో మంట:
టమాటోలు సిట్రిక్ ఎక్కువ మోతాదులో లభిస్తుంది. దీని కారణంగా గుండెల్లో మంటలు వచ్చే అవకాశాలు ఉన్నాయని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు. ఇప్పటికే మంటలు ఉన్నవారిలో దాని తీవ్ర పెరిగే ఛాన్స్ కూడా ఉంది. మంటల సమస్యలు ఉన్నవారు టమాటో సాస్, ఇతర టమాటో ఉత్పత్తులను తినడం మానుకోవడం మంచిది.
ఇది కూడా చదవండి: Lakshmi Narayana Raja Yoga: లక్ష్మీ నారాయణ రాజయోగం ఏర్పాటు.. ఈ రాశుల వారు కుబేరులు కాబోతున్నారు..
అధిక రక్తపోటు:
టమాటోలు సోడియం ఎక్కువగా ఉంటుంది. దీనిని అధిక మోతాదులో తీసుకుంటే రక్తపోటు వచ్చే ప్రమాదం కూడా పెరుగుతుంది. ఇప్పటికే అధిక రక్తపోటు ఉంటే వీటిని పరిమితంగా తీసుకోవడం చాలా మంచిదని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు. దీంతో పాటు ఈ టమాటోలతో తయారు చేసిన ఆహారాలు కూడా అతిగా తినడం మానుకోవాల్సి ఉంటుంది.
ఇది కూడా చదవండి: Lakshmi Narayana Raja Yoga: లక్ష్మీ నారాయణ రాజయోగం ఏర్పాటు.. ఈ రాశుల వారు కుబేరులు కాబోతున్నారు..
ఇది కూడా చదవండి: 2024 Bajaj Pulsar N250: మార్కెట్‌లోకి కొత్త పల్సర్ N250 వచ్చేసింది.. ఫీచర్స్, స్పెషిఫికేషన్స్ ఇవే!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి