Premature White Hair Problem Solution: బ్లాక్ హెయిర్ వల్ల ముఖం అందంగా కనిపిస్తుంది. కానీ ప్రస్తుతం 20 నుంచి 25 ఏళ్ల యువత జుట్టు నెరిసిపోతుంది. అయితే ఇలాంటి సమస్యల రావడానికి ప్రధాన కారణాలు..వాతావరణంలో కలుష్యం పెరగడం, అనారోగ్య కరమైన ఆహారాలు అతిగా తినడం వల్లేనని నిపుణులు తెలుపుతున్నారు. ఇంతకముందు ఇలాంటి సమస్యలు పెద్దల్లోనే వచ్చేవి.. కానీ జీన శైలిలో మార్పుల కారణంగా చిన్న పిల్లల్లో కూడా ఇలాంటి సమస్యలు వస్తున్నాయని నిపుణులు చెబుతున్నారు. కాబట్టి ఇలాంటి సమస్యలతో చిన్న వయసుల్లోనే బాధపడేవారు తప్పకుండా పలు రకాల ఇంటి చిట్కాలను పాటించాల్సి ఉంటుంది. అంతేకాకుండా తీసుకునే ఆహారాలపై ప్రత్యేక శ్రద్ద తీసుకోవాల్సి ఉంటుంది.
తెల్ల జుట్టు నుంచి ఇలా ఉపశమనం పొందండి.
1. పెరుగు, టొమాటో:
తెల్ల జుట్టు సమస్యలతో బాధపడుతున్నవారు తప్పకుండా ఈ చిట్కాను పాటించాల్సి ఉంటుంది. దీని కోసం ముందుగా ఒక గిన్నెలో టొమాటోను గ్రైండ్ చేసి వేసుకోవాలి. అందులోనే పెరుగును కూడా వేసుకుని మిశ్రమంలా కలుపుకోవాల్సి ఉంటుంది. ఈ పేస్ట్‌లో యూకలిప్టస్ ఆయిల్ కలపండి. అయితే ఇలా తయారు చేసిన మిశ్రమాన్ని జుట్టుకు మసాజ్ చేయాల్సి ఉంటుంది. ఇలా 4 వారు పాటు చేయడం వల్ల మంచి ఫలితాలు పొందుతారు.
2. ఉల్లిపాయ రసం:
ఉల్లిపాయ రసం మధుమేహంతో బాధపడుతున్నవారికి ప్రభావవంతంగా సహాయపడుతుంది. ఇందులో ఉండే గుణాలు నెరిసిపోయిన జుట్టును నల్లగా చేసేందుకు సహాయపడుతుంది. అయితే దీని కోసం మీరు ఉల్లిపాయ రసాన్ని తీసి అందులో తేనె వేసి బాగా మిక్స్ చేసి జుట్టు అప్లై చేయాల్సి ఉంటుంది. ఇలా క్రమం తప్పకుండా చేయడం తెల్ల జుట్టు నుంచి ఉపశమనం పొందొచ్చు.
3. కరివేపాకు:
కరివేపాకు కంటికే కాకుండా జుట్టు కూడా ప్రభావవంతంగా సహాయపడుతుంది. అంతేకాకుండా ఇందులో ఉండే ఆయుర్వేద గుణాలు అన్ని రకాల అనారోగ్య సమస్యల నుంచి శరీరాన్ని రక్షిస్తాయి. అయితే జుట్టును నల్లగా చేసుకోవడానికి కరివేపాకును బాగా గ్రైండ్ చేసి..ఇలా చేసిన మిశ్రమాన్ని కొబ్బరి నూనెతో కలపండి. ఇలా కలిపిన మిశ్రమాన్ని ఉదయాన్నే స్నానం చేయడానికి రెండు గంటల ముందు అప్లై చేస్తే మంచి ఫలితాలు పొందుతారు.
(నోట్: ఇక్కడ ఇవ్వబడిన సమాచారం ఇంటి నివారణలు, సాధారణ సమాచారంపై ఆధారపడి ఉంటుంది. దానిని స్వీకరించే ముందు తప్పనిసరిగా వైద్య సలహా తీసుకోవాలి. ZEE NEWS దానిని ధృవీకరించలేదు.)
Also read: Kalatapasvi K Viswanath Death : అందుకే ఆయన ఈరోజే చనిపోయారేమో.. కళాతపస్వి మృతిపై చిరు ట్వీట్
Also read: Kalatapasvi K Viswanath Death : అందుకే ఆయన ఈరోజే చనిపోయారేమో.. కళాతపస్వి మృతిపై చిరు ట్వీట్
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook