World Kidney Day 2024: ప్రతి సంవత్సరం అన్ని దినోత్సవాల్లానే ప్రపంచ కిడ్నీ దినోత్సవం జరుపుకుంటారు. దీనిని ప్రతి ఏడాది మార్చి రెండవ గురువారం జరుపుకోవడం ఆనవాయితిగా వస్తోంది. ఈ దినోత్సావం రోజున ప్రపంచ వ్యాప్తంగా ఉన్న ప్రజలను కిడ్నీ సమస్యల గురించి అవగాహన కల్పించడానికి అన్ని ప్రభుత్వాలు ప్రత్యేకమైన కార్యక్రమాలు చేపడతాయి. అంతేకాకుండా ఈ రోజు కొన్ని స్వచ్ఛంద సంస్థలు ఫ్రీ కిడ్నీ వైద్యాన్ని కూడా అందిస్తారు. కాబట్టి ఇలాంటి ఎంతో ప్రముఖ్యమైన రోజును గుర్తించుకుని అందరూ కిడ్నీ ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాల్సి ఉంటుంది. అంతేకాకుండా సంవత్సరానికి ఒక్క రోజైన కిడ్నీల ఆరోగ్యం ఎలా ఉందో పరీక్షించుకోవాలి. అయితే ఈ రోజు కిడ్నీలకు సంబంధించిన కొన్ని ఆసక్తికరమైన విషయాలను తెలుసుకుందాం.
కిడ్నీ పనితీరు:
శరీరం యాక్టివ్‌గా ఉండడానికి కిడ్నీ కీలక పాత్ర పోషిస్తుంది. ఇది బాడీలో ఉన్న వ్యర్థాలు, మురికిని బయటకు చేరవేసేందుకు సహాయపడతాయి. అంతేకాకుండా ఇవి రక్తంలోని టాక్సిన్‌లను ఫిల్టర్ చేసేందుకు కూడా ప్రధాన పాత్ర పోషిస్తాయి. అలాగే మాత్రాన్ని బయటకు పంప్ చేయడానికి ఎంతగానో సహాయపడతాయి. దీంతో పాటు కిడ్నీలు శరీరంలోని ఎలక్ట్రోలైట్లను బ్యాలెన్స్ చేస్తాయి. అంతేకాకుండా రక్తపోటును నియంత్రించేందుకు కూడా దోహదపడతాయి. ఇవే కాకుండా శరీరంలో అనేక ప్రక్రియను చేసేంతుకు సహాయపడుతుంది.
శరీరంలో కిడ్నీలు సరిగ్గా పని చేయకపోతే అనేక రకాల అనారోగ్య సమస్యలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. అంతేకాకుండా శరీరంలో వ్యర్థాలు పేరుకుపోతాయి. మూత్నపిండాలు కూడా తీవ్రంగా దెబ్బతింటాయి. కాబట్టి కిడ్నీలు సరిగ్గా పని చేయకపోవడం కారణంగా శరీరంలో అనేక లక్షణాలు కనిపిస్తాయి.
వికారం
తులు
ఆకలి లేకపోవడం
అలసట, బలహీనత
నిద్ర సమస్యలు
తరచుగా మూత్రవిసర్జన,
ఏకాగ్రత తగ్గుదల
కండరాల నొప్పి
పాదాలు, చీలమండలలో వాపు,
పొడి, దురద చర్మం
అధిక రక్తపోటు
ఈ జాగ్రత్తలు పాటించండి:
కిడ్నీలు ఆరోగ్యంగా ఉండడానికి ప్రతి రోజుకు 7 నుంచి 8 గ్లాసుల నీటీని తాగాల్సి ఉంటుంది.
కేవలం ప్రతి రోజు ఆరోగ్యకరమైన పోషకాలు కలిగిన ఆహారాలు మాత్రమే తీసుకోవాల్సి ఉంటుంది.
ఆహారాల్లో తప్పకుండా పండ్లు, కూరగాయలు, తృణధాన్యాలు, ప్రోటీన్లు తీసుకోవడం చాలా మంచిది.
బ్లడ్ షుగర్, బ్లడ్ ప్రెజర్ నియంత్రణలో ఉంచుకోవడం కూడా చాలా మంచిది.
అలాగే ధూమపానం, మద్యపానానికి దూరంగా ఉండాల్సి ఉంటుంది.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి