30 Years Prudhvi Raj: 30 ఇయర్స్ పృథ్వీ ముఖ్యపాత్రలో ప్రారంభమైన కామెడీ ఎంటర్టైనర్ ‘తెలియదు, గుర్తు లేదు, మర్చిపోయా’ మూవీ..

30 Years Prudhvi Raj: 30 ఇయర్స్ పృథ్వీ ముఖ్యపాత్రల్లో నివాస్, అమిత శ్రీ హీరో, హీరోయిన్లుగా నటిస్తున్న కొత్త చిత్రం ‘తెలియదు గుర్తు లేదు, మర్చిపోయా’. తాజాగా ఈ సినిమా హైదరాబాద్ లో గ్రాండ్ గా ప్రారంభమైంది. 30 ఇయర్స్ పృథ్వీపై ప్రముఖ నటుడు రఘుబాబు క్లాప్ ఇచ్చారు.

Written by - TA Kiran Kumar | Last Updated : Nov 15, 2024, 08:51 AM IST
30 Years Prudhvi Raj: 30 ఇయర్స్ పృథ్వీ ముఖ్యపాత్రలో ప్రారంభమైన  కామెడీ ఎంటర్టైనర్ ‘తెలియదు, గుర్తు లేదు, మర్చిపోయా’ మూవీ..

30 Years Prudhvi Raj: నివాస్, అమిత శ్రీ జంటగా యాక్ట్ చేస్తోన్న సినిమా "తెలియదు, గుర్తులేదు, మర్చిపోయా". ఈ చిత్రంలో 30 ఇయర్స్ పృథ్వీ మరో లీడ్ రోల్లో  యాక్ట చేస్తున్నారు. ఈయనతో పాటు వినోద్ కుమార్, రఘు బాబు, భరద్వాజ్, ఖయ్యూం యాక్ట్ చేస్తున్నారు. తెలియదు, గుర్తులేదు, మర్చిపోయా చిత్రాన్ని చెన్నా క్రియేషన్స్ బ్యానర్ పై శరత్ చెన్నా నిర్మిస్తున్నారు. ఫుల్ లెంగ్త్ కామెడీ ఎంటర్ టైనర్ ఈ చిత్రాన్ని డైరెక్టర్ వెంకటేష్ వీరవరపు తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమా గురువారం  హైదరాబాద్ రామానాయుడు స్టూడియోలో పూజా కార్యక్రమాలతో స్టార్ట్ అయింది. ముహూర్తపు షాట కు నటుడు  రఘుబాబు  క్లాప్ నివ్వగా, సంగీత  దర్శకులు ఆర్ పి పట్నాయక్ కెమెరా స్విచ్ఛాన్ చేశారు.

Add Zee News as a Preferred Source

ఈ సందర్భగా నటుడు పృథ్వీ మాట్లాడుతూ..మంచి కథ, కథనాలతో తెలియదు, గుర్తులేదు, మర్చిపోయా సినిమాతో  మీ ముందుకు రాబోతున్నాము. ఈ సినిమాలో ఒక ఇంట్రెస్టింగ్ రోల్ చేస్తున్నాను. ప్రేక్షకులకు ఈ పాత్ర ఎప్పటికీ గుర్తుండి పోతుంది. ఈ పాత్రకు ఎవరు సరిపోతారో వాళ్లనే పర్పెక్ట్ గా కాస్టింగ్ చేశారన్నారు. నిర్మాత శరత్ చెన్నా గారు బాగా చదువుకున్న వ్యక్తి. ఎంతో ప్యాషన్ తో ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. అలాగే డైరెక్టర్ వెంకటేష్ ఈ సినిమాను అనేక ఇంట్రెస్టింగ్ ట్విస్టులతో ఎంటర్ టైనింగ్ గా రూపొందిస్తున్నాడు. కొత్త హీరో నివాస్, హీరోయిన్ అమిత శ్రీకి నా బెస్ట్ విశెస్ తెలియజేస్తున్నాను.

దర్శకుడు వెంకటేశ్ వీరవరపు మాట్లాడుతూ - తెలియదు, గుర్తులేదు, మర్చిపోయా సినిమా ఫుల్ లెంగ్త్ కామెడీ ఎంటర్ టైనర్ గా రాబోతుంది. 30 ఇయర్స్ పృథ్వీ, వినోద్ కుమార్, రఘు బాబు లీడ్ రోల్స్ లో యాక్ట్ చేస్తున్నారు.  ఈ నెల 18వ తేదీ నుంచి రెగ్యులర్ షూటింగ్ కు మొదలుపెడతాము. మాకు ఎంతో సపోర్ట్ గా నిలుస్తున్న మా ప్రొడ్యూసర్ శరత్ కి, పృథ్వీ కి, మ్యూజిక్ డైరెక్టర్ అజయ్ పట్నాయక్ కి థ్యాంక్స్. మేమంతా అజయ్ పట్నాయక్ టీమ్ అని చెప్పుకోవడానికి ఆనందిస్తున్నాము. .

హీరోయిన్ అమిత శ్రీ మాట్లాడుతూ - తెలియదు, గుర్తులేదు, మర్చిపోయా సినిమాతో కథానాయికగా  మీ ముందుకు రాబోతున్నాము. హీరోయిన్ గా ఇది నా ఫస్ట్ మూవీ. ఫస్ట్ చిత్రంతోనే మంచి అవకాశం కల్పించిన నిర్మాత శరత్ కి, దర్శకుడు వెంకటేష్ కి థ్యాంక్స్ చెబుతున్నాను.

హీరో నివాస్ మాట్లాడుతూ - మా మూవీ ప్రారంభోత్సవానికి వచ్చిన అతిథులు  రఘుబాబు, పృథ్వీ, ఆర్పీ పట్నాయక్ కి థ్యాంక్స్ చెప్పాలి. మంచి హిల్లేరియస్ కామెడీ  చిత్రమిది. మీ అందరినీ ఎంటర్ టైన్ చేసేలా ఉంటుంది. ఈ సినిమాతో హీరోగా పరిచయం కావడం సంతోషంగా ఉందన్నారు.

ఇదీ చదవండి : Balayya Heroine: ఎఫైర్స్ తో టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీగా నిలిచిన బాలయ్య భామ.. మైండ్ బ్లాంక్ చేస్తోన్న హీరోయిన్ ఫ్లాష్ బ్యాక్..

ఇదీ చదవండి : Shraddha Kapoor: చిరంజీవికి శ్రద్ధా కపూర్ కు ఉన్న రిలేషన్ తెలుసా.. ఫ్యూజులు ఎగిరిపోవడం పక్కా..

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి. 

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

 సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిFacebookTwitter

About the Author

TA Kiran Kumar

కిరణ్ కుమార్ తంజావూర్ జీ తెలుగు తెలుగు న్యూస్‌లో ఛీఫ్ సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి  వినోదం, ఆధ్యాత్మికం, జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ వ్యవహారాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. సినిమా రివ్యూలు, సినిమాలకు సంబంధించి ప్రత్యేక కథనాలు కూడా రాస్తుంటారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు. ఆయనకు జర్నలిజంలో 18 ఏళ్లకుపైగా అనుభవం ఉంది.

...Read More

Trending News