Honey Moon Express: హెబ్బా పటేల్‌ 'హనీమూన్ ఎక్స్‌ప్రెస్' చిత్రం లోని మూడో పాట విడుదల చేసిన అడివి శేష్..

Honey Moon Express: హెబ్బా పటెల్, చైతన్య రావు జంటగా నటించిన లేటెస్ట్ మూవీ 'హనీమూన్ ఎక్స్‌ప్రెస్'. న్యూ రీల్ ఇండియా ఎంటర్టైన్మెంట్స్ ప్రైవేట్ లిమిటెడ్ పతాకంపై తెరకెక్కుతోంది. తాజాగా ఈ సినిమాలోని మూడో పాటను హీరో అడివిశేష్ విడుదల చేశారు.  

Last Updated : May 19, 2024, 10:12 AM IST
Honey Moon Express: హెబ్బా పటేల్‌ 'హనీమూన్ ఎక్స్‌ప్రెస్' చిత్రం లోని మూడో పాట విడుదల చేసిన అడివి శేష్..

Honey Moon Express: అమెరికాకు చెందిన ఎన్ఆర్ఐ ఎంటర్టైంట్స్ (NRI Entertainment(USA)) సమర్పణలో న్యూ రీల్ ఇండియా ఎంటర్టైన్మెంట్ ప్రైవేట్ లిమిటెడ్ పతాకంపై తెరకెక్కిన చిత్రం 'హనీమూన్ ఎక్స్‌ప్రెస్'. ఈ సినిమాలో తనికెళ్ల భరణి, సుహాసిని లీడ్ రోల్స్‌లో యాక్ట్ చేస్తున్నారు. ఈ సినిమాకు బాల రాజశేఖరునికి రచయత దర్శకుడు.  కళ్యాణి మాలిక్ సంగీతం అందించారు. ఈ సినిమాను కెకె ఆర్ మరియు బాల రాజ్ సంయుక్తంగా ఈ రొమాంటిక్ కామెడీ ఎంటర్టేనర్‌ను నిర్మించారు. ఇప్పటికే హనీమూన్ ఎక్స్‌ప్రెస్ చిత్రం నుంచి కళ్యాణి మాలిక్ అందించిన రెండు రొమాంటిక్ మెలోడి పాటలను విడుదలై సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇప్పుడు ఈ చిత్రం నుంచి మూడో పాటను యాక్షన్ హీరో అడివి శేష్ విడుదల చేశారు.

అడివి శేష్ విషయానికొస్తే.. ప్రస్తుతం 'గూఢచారి 2', డెకాయిట్ చిత్రాలతో బిజీగా ఉన్నాడు అడివి శేష్. దర్శకుడు, నిర్మాత కోరిక మేరకు అన్నపూర్ణ స్టూడియోలోని 7 ఎకర్స్‌ ప్రాంగంలో ఈ పాటను విడుదల చేసారు శేష్.

సాంగ్ విడుదల తర్వాత అడివి శేష్ మాట్లాడుతూ...
'క్యూట్ గా స్వీట్' గా పాట చాలా స్వీట్ గా ఉంది, సాహిత్యం కొత్తగా బాగుందని కొనియాడారు. చిత్రం హిట్ సాధించాలని ఆకాంక్షించారు.

దర్శకుడు బాల రాజశేఖరుని మాట్లాడుతూ..
వరుస సినిమా షూటింగ్‌లతో ఎంత బిజీగా ఉన్నప్పటికీ, క్యూట్‌గా స్వీట్‌గా అనే అందమైన పాటను విడుదల చేసిన అడివి శేష్‌కు ఈ సందర్భంగా ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేసారు. అడివి శేష్ తన మొదటి చిత్రం అమెరికా లో విడుదల చేయడానికి అప్పట్లో నన్ను సంప్రదించారు. తనకు మంచి టాలెంట్ ఉంది అని అప్పుడే గమనించాను. మా హనీమూన్ ఎక్స్‌ప్రెస్ చిత్రం మంచి మ్యూజికల్ రొమాంటిక్ కామెడీ ఎంటర్టైనర్. మా చిత్రంలోని ప్రతి పాట చాలా బాగుంటుంది. మంచి పాటలు స్వరపరిచిన కళ్యాణి మాలిక్కు ఈ సందర్భంగా స్పెషల్ థాంక్స్ తెలియజేస్తున్నాను. ఈ క్యూట్ గా స్వీట్ గా పాటకు కిట్టూ విస్సాప్రగడ లిరిక్స్ అందించగా బాహుబలి ఫేమ్ దీపు తన గాత్రంతో ప్రాణం పోశారు.

త్వరలోనే ట్రైలర్ ను విడుదల చేసి, చిత్రాన్ని ఈ సమ్మర్ ఎండింగ్ వరకు  విడుదల చేయటానికి సన్నామాలు చేస్తున్నట్టు తెలిపారు.

సమర్పణ : ఎన్ ఆర్ ఐ ఎంటర్టైన్మెంట్స్ (యు ఎస్ ఎ) (NRI Entertainments (USA))
బ్యానర్ : న్యూ రీల్ ఇండియా ఎంటర్టైన్మెంట్స్ ప్రైవేట్ లిమిటెడ్ (New Reel India Entertainments Pvt Ltd)
చిత్రం పేరు : హనీమూన్ ఎక్స్‌ప్రెస్
నటీనటులు : చైతన్య రావు, హెబ్బా పటేల్, తనికెళ్ల భరణి, సుహాసిని, అరవింద్ కృష్ణ, అలీ, సురేఖ వాణి, రవి వర్మ, తదితరులు

సంగీతం : కళ్యాణి మాలిక్  
బ్యాక్ గ్రౌండ్ స్కోర్ : ఆర్ పి పట్నాయక్
లిరిక్స్ : కిట్టూ విస్సాప్రగడ
ఆర్ట్, సినిమాటోగ్రఫీ : శిష్ట్లా  వి ఎమ్ కె
ఎడిటింగ్ : ఉమా శంకర్ జి (యు ఎస్ ఎ), శ్రీ కృష్ణ అత్తలూరి
రచన, దర్శకత్వం : బాల రాజశేఖరుని

Also Read: Low Depression: బంగాళాఖాతంలో అల్పపీడన హెచ్చరిక, ఏపీలో అతి భారీ వర్షాలు

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి FacebookTwitter

Trending News