Rahasyam Idam Jagath:‘రహస్యం ఇదం జగత్’ మూవీ రివ్యూ.. సైన్స్ ఫిక్షన్ మూవీ ఎలా ఉందంటే..

Rahasyam Idam Jagath: తెలుగులో గత కొన్నేళ్లుగా సైన్స్ ఫిక్షన్ చిత్రాలకు మంచి గిరాకీ ఉంది. ఈ యేడాది ప్రభాస్ ‘కల్కి’ మూవీ కూడా సైన్స్ ఫిక్షన్ కమ్ పురాణ నేపథ్యంలో తెరకెక్కింది. ఈ కోవలో విడుదలైన మరో సైన్స్ ఫిక్షన్ మూవీ ‘రహస్యం ఇదం జగత్’. మరి ఈ మూవీ ఎలా ఉందో మన మూవీ రివ్యూలో  చూద్దాం..

Written by - TA Kiran Kumar | Last Updated : Nov 8, 2024, 10:30 PM IST
 Rahasyam Idam Jagath:‘రహస్యం ఇదం జగత్’ మూవీ రివ్యూ.. సైన్స్ ఫిక్షన్ మూవీ ఎలా ఉందంటే..

రివ్యూ: రహస్యం ఇదం జగత్  (Rahasyam Idam Jagath)

నటీనటులు : రాకేష్ గలేబి, స్రవంతి పత్తిపాటి, మానస వీణ, కార్తీక్, భార్గవ్ గోపీనాథం తదితరులు..

ఎడిటర్: చోటా కే ప్రసాద్

సినిమాటోగ్రఫీ: టైలర్ బ్లూమెల్

సంగీతం: గ్యానీ

నిర్మాత : పద్మ రావినూతుల,హిరన్య రావినూతల

దర్శకత్వం: కోమల్ ఆర్ భరద్వాజ్  

విడుదల తేది: 8-11-2024

గత కొన్నేళ్లుగా మన ఫిల్మ్ మేకర్స్.. పురాణ ఇతిహాసాలు, చరిత్రతో సైన్స్ ఫిక్షన్ జోడిస్తూ సినిమాలను తెరకెక్కిస్తున్నారు. ఈ రూట్లోనే వచ్చిన చిత్రమే ‘రహస్యం ఇదం జగత్’. తాజాగా ఈ కోవలో దర్శకుడు కోమల్ ఆర్ భరద్వాజ్ ఈ వెరైటీ సైన్స్ ఫిక్షన్ మూవీతో పలకరించారు. మరి ఈ ప్రయత్నం ఏ మేరకు ఫలించిందో చూద్దాం...

కథ విషయానికొస్తే..  

ఈ సినిమా స్టోరీ మొత్తం యూఎస్ బేస్ట్ గా జరగుతోంది. అమెరికాలో ఉంటున్న ఎన్ఆర్ఐ అకీరా (స్రవంతి) తండ్రి చనిపోవడంతో భారత దేశానికి బయలు దేరాలనుకుంటుంది. అదే క్రమంలో అకీరా బాయ్ ఫ్రెండ్ అభి (రాకేష్)ఆమెకు తోడుగా మన దేశానికి వద్దామనుకుంటాడు. భారత్ కు వెళ్లే ముందు ఫ్రెండ్స్ కు పార్టీ ఇవ్వాలంటాడు. అలా అమెరికాలో ఉన్న ఓ చిన్న ఊరుకు వెళతారు. అప్పటికే వాళ్లు అక్కడ బుక్ చేసుకున్న హోటల్ ఏదో కారణాలతో క్లోజ్ అయిపోతుంది. దీంతో దగ్గరలో ఉన్న ఓ ఇంట్లో దిగుతారు. ఈ పార్టీకి వచ్చిన ఫ్రెండ్స్ లో సైంటిస్ట్ అయిన అరు.. మల్టీ యూనివర్స్ కాన్సెప్ట్ పై రీసెర్చి చేస్తూ ఉంటుంది. ఈ క్రమంలో అందులో అభి, విశ్వకు పెద్ద గొడవ అవుతుంది. అదే టైమ్ లో విశ్వ డ్రగ్ తీసుకొకి అకీరాను,మరొకరిని చంపేస్తాడు. అదే సమయంలో ఇదే ఊర్లో మల్టీ యూనివర్స్ కు వెళ్లే దారి ఉందని అభిని తీసుకొని వెళుతుంది అరు. అక్కడికి వెళ్లాకా ఆమెను ఎవరో చంపేస్తారు. అసలు ఆమెను ఎవరు హత్య చేసారు. అకీరాను చంపడం విశ్వ నిజంగానే డ్రగ్ ఉందా ? మరేదైనా కారణం ఉందా.. ? అసలు మల్టీ యూనివర్స్ ఉందా.. ?  చివరకు ఏం జరిగిందనేదే ఈ సినిమా చూడాల్సిందే.

కథనం, టెక్నికల్ విషయానికొస్తే..

దర్శకుడు కోమల్ కుమార్ తన రాసుకున్న కథను ఉన్న వనరులతో ఉన్నంతగా తీర్చిదిద్దాడు. ముఖ్యంగా అమెరికా బ్యాక్ డ్రాప్ లో కథను ఎంచుకోవడం. అక్కడ ఉండే భారతీయుల ఎలా ఉంటారనేది ఈ సినిమాలో చూపించాడు. ముఖ్యంగా హాలీవుడ్ లో ఇలాంటి తరహా చిత్రాలు వచ్చినా.. అటువంటి క్లిష్టమైన సబ్జెక్ట్ ను తెలుగు ప్రేక్షకులను మెప్పించేలా డీల్ చేయడం ఆషామాషీ వ్యవహారం కాదు. అంతేకాదు ఈ సైన్స్ ఫిక్షన్ చిత్రానికి మన పురాణా, ఇతిహాసాలను చొప్పిస్తూ.. సనాతన ధర్మాన్ని ఉన్నంతగా చూపించడం.. ముఖ్యంగా శ్రీ కృష్ణుడు 16 వేల మంది భామలతో చాలా చోట్ల కనిపించడం. ఆంజనేయ స్వామి, అర్జునుడు ఒక లోకం నుంచి మరో లోకానికి వెళ్లడం.. శ్రీ చక్రం నుంచి వామ్ హోల్ ఏర్పడటం వంటివి సినిమాలో  చొప్పించడం ఆకట్టుకుంటుంది.

సినిమా ఫస్టాఫ్ అంతా ఫ్రెండ్స్ పార్టీ, గొడవలు రొటీన్ గా సాగినా.. సెకండాఫ్ లో సినిమాను పరుగులు పెట్టించాడు. ఫస్ట్ హాఫ్ లో చనిపోయిన స్నేహితులను హీరో తిరిగి బతికించుకున్నాడా వంటివి ఇంట్రెస్ట్ కలిగిస్తాయి. ముఖ్యంగా వామ్ హోల్ లోకి హీరో వెళ్లడం  ఇంట్రెస్టింగ్ ఎలిమెంట్స్. అంతా కొత్త వాళ్లు కావడం కాస్త ఇబ్బందికర అంశమనే చెప్పాలి. ఏది ఏమైనా ఇలాంటి టిపికల్ సబ్జెక్ట్ ను డీల్ చేయడం కత్తి మీద సామే. దాన్ని దర్శకుడు విజయవంతంగా పూర్తి చేసాడు. ఉన్నంతలో నిర్మాణ విలువలు బాగున్నాయి. అమెరికాలో లొకేషన్స్ ను సినిమాటోగ్రాఫర్ అద్భుతంగా చూపించాడు. పైగా అందరు అమెరికన్ స్లాంగ్ లో మాట్లాడటం కాస్త ఇబ్బందికర అంశం. అక్కడక్కడ తడబడ్డా ఓవరాల్ గా దర్శకుడిగా అతని ప్రయత్నాన్ని మెచ్చుకోవాలి.

నటీనటుల విషయానికొస్తే..
షార్ట్ ఫిల్మ్స్ లో యాక్ట్ చేసిన రాకేష్ ఈ సినిమాలో తన నటనతో మెప్పించాడు. వామ్ హోల్ లోకి ట్రావెల్ చేసే వ్యక్తిగా బాగా యాక్ట్ చేసాడు. మిగిలిన నటీనటులు కొత్తవాళ్లైన మంచి నటన కనబరిచాడు. సైంటిష్ట్ పాత్రలో అరు ఒదిగిపోయింది. స్రవంతి తన యాక్టింగ్ తో మెప్పించింది.

షార్ట్ ఫిలింస్‌లో నటించి మెప్పించిన రాకేష్ హీరోగా నటించాడు. వామ్ హోల్‌లోకి ట్రావెల్ చేసి వచ్చే వ్యక్తిగా బాగా నటించాడు. మిగిలిన వాళ్లంతా కొత్త వాళ్లే అయినా అందులో స్రవంతి తన యాక్టింగ్‌తో మెప్పించింది. సైంటిస్ట్ పాత్రకు అరు చక్కగా సరిపోయింది. భార్గవ్ కామెడీతో నవ్వించేందుకు ప్రయత్నించాడు. కార్తీక్ విలన్‌గా బాగానే చేశాడు. అయితే వీళ్లంతా అమెరికాలోనే సెటిల్ అయినవాళ్లు కావడంతో మన ఆడియన్స్‌కు కొత్తముఖాలుగా అనిపిస్తారు. పైగా అమెరికన్ యాసలోనే మాట్లాడారు.

పంచ్ లైన్.. ‘రహస్యం ఇదం జగత్’.. ఆకట్టుకునే సైన్స్ ఫిక్షన్ డ్రామా..

రేటింగ్..2.75/5

ఇదీ చదవండి : Shraddha Kapoor: చిరంజీవికి శ్రద్ధా కపూర్ కు ఉన్న రిలేషన్ తెలుసా.. ఫ్యూజులు ఎగిరిపోవడం పక్కా..

ఇదీ చదవండి : Balayya Heroine: ఎఫైర్స్ తో టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీగా నిలిచిన బాలయ్య భామ.. మైండ్ బ్లాంక్ చేస్తోన్న హీరోయిన్ ఫ్లాష్ బ్యాక్..

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.

Trending News