Dhoom Dhaam: కొన్ని సినిమాలు పేరుతోనే మంచి ఇంపాక్ట్ క్రియేట్ చేస్తాయి. అలాంటి టైటిల్ ‘ధూం ధాం’ పేరుతోనే సినిమాపై మంచి అంచనాలు క్రియేట్ చేసాయి. ఈ చిత్రాన్ని ఫ్రైడే ఫ్రేమ్ వర్క్స్ బ్యానర్ పై ఎంఎస్ రామ్ కుమార్ నిర్మిస్తున్నారు. "ధూం ధాం" సినిమాను లవ్, ఫ్యామిలీ ఎంటర్ టైనర్ గా దర్శకుడు సాయి కిషోర్ మచ్చా డైరెక్టర్ చేశారు. గోపీ మోహన్ స్టోరీ స్క్రీన్ ప్లే అందిస్తున్నారు. ఈ నెల 8వ తేదీన ఈ సినిమా గ్రాండ్ గా ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ చేస్తున్నారు. తాజాగా శనివారం రోజు స్టార్ డైరెక్టర్ అనిల్ రావిపూడి ఈ సినిమా ట్రైలర్ ను విడుదల చేశారు.
డైరెక్టర్ అనిల్ రావిపూడి మాట్లాడుతూ - "ధూం ధాం" సినిమా ట్రైలర్ నా చేతుల మీదుగా రిలీజ్ చేయడం సంతోషంగా ఉందన్నారు. ఫుల్ ఔట్ అండ్ ఔట్ ఎంటర్ టైనర్ గా ఈ ట్రైలర్ ఆద్యంతం ఆకట్టుకునేలా ఉందన్నారు. ఇండస్ట్రీలోని 80 శాతం నటీనటులు ఈ చిత్రంలో నటించారన్నారు. ట్రైలర్ ఫష్ట్ నుంచి చివరి వరకు నవ్వుతూనే ఉంటారు. ఈ సినిమా విజయం సాధించాలని టీమ్ అందరికీ ఆల్ ది బెస్ట్ చెబుతున్నాను. ప్రొడ్యూసర్ రామ్ కుమార్ నాకు బాగా తెలిసిన వ్యక్తి. డైరెక్టర్ సాయి కిషోర్ నేను శ్రీను వైట్ల గారి దగ్గర వర్క్ చేసినప్పటి నుంచి పరిచయం ఉంది. ఆయనలో మంచి ఫన్ టైమింగ్ ఉంటుంది. వీరు చేసిన ప్రయత్నం సక్సెస్ కావాలన్నారు.
Now its the time for ????? ??????????? #DhoomDhaam will take over this season with the unlimited entertainment??#DhoomDhaamTrailer Out Now!
- https://t.co/Gez7PDqcwBGrand Releasing Worldwide on November 8th❤️?#DhoomDhaamOnNov8 ? pic.twitter.com/P1jOZpCUPF
— GSK Media (@GskMedia_Offl) November 2, 2024
"ధూం ధాం" సినిమా ట్రైలర్ ఎలా ఉందో చూస్తే - భూపతి ఫ్యామిలీలో కాబోయో అల్లుడిగా ఎన్ఆర్ఐ వెన్నెల కిషోర్ అడుగుపెట్టడంతో ట్రైలర్ స్టార్ట్ అవుతుంది. ఆయన కజిన్ గా హీరో చేతన్ ఎంట్రీ ఇస్తాడు. పెళ్లి ఇంట హీరోతో పాటు వెన్నెల కిషోర్ చేసిన హంగామా కావాల్సినంత నవ్వులు పూయిస్తాయి. విదేశాల్లో ఉన్నప్పుడే అతనికి హీరోయిన్ తో లవ్ ఏర్పడుతోంది. హీరో ప్రేమకథకు అతను ఈ ఊరికి రావడానికి సంబంధం ఏంటి ?, తండ్రిని ప్రాణంగా ప్రేమించే కొడుకుగా హీరో ఆయన కోసం ఏం చేశాడు? అనేది ట్రైలర్ లో ఇంట్రెస్టింగ్ గా చూపించారు. గోపీ సుందర్ కంపోజ్ చేసిన మూడు పాటలు ఛాట్ బస్టర్ గా నిలిచాయి. లవ్, ఎంటర్ టైన్ మెంట్, ఫ్యామిలీ ఎమోషన్స్, సూపర్ హిట్ మ్యూజిక్ తో "ధూం ధాం" ట్రైలర్ సాగింది. థియేటర్ లో సినిమా చూసేందుకు కావాల్సినంత ఇంట్రెస్ట్ క్రియేట్ చేస్తోంది. మరి థియేట్రికల్ గా ఈ సినిమా ఎలాంటి హంగామా క్రియేట్ చేస్తుందో చూడాలి.
ఇదీ చదవండి : Shraddha Kapoor: చిరంజీవికి శ్రద్ధా కపూర్ కు ఉన్న రిలేషన్ తెలుసా.. ఫ్యూజులు ఎగిరిపోవడం పక్కా..
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిFacebook, Twitter









