Charan Tej: ప్రభుదేవా, కాజోల్ మూవీతో బాలీవుడ్ ఎంట్రీ ఇస్తోన్న ఫిల్మ్ మేకర్ చరణ్ తేజ్ ఉప్పలపాటి..

Charan Tej: ఈ మధ్యకాలంలో అన్ని ఇండస్ట్రీస్‌లో ప్యాన్ ఇండియా సినిమాలు తెరకెక్కుతున్నాయి. కథ డిమాండ్ చేస్తే మేకర్స్ అలాంటి తరహా సినిమాలకే ప్రాముఖ్యత ఇస్తున్నారు. ఈ కోవలో ప్రముఖ ఫిల్మ్ మేకర్ చరణ్ తేజ్ ఉప్పలపాటి బాలీవుడ్ ఎంట్రీ ఇస్తున్నారు.  

Written by - TA Kiran Kumar | Last Updated : May 25, 2024, 07:28 AM IST
Charan Tej: ప్రభుదేవా, కాజోల్ మూవీతో బాలీవుడ్ ఎంట్రీ ఇస్తోన్న ఫిల్మ్ మేకర్ చరణ్ తేజ్ ఉప్పలపాటి..

Charan Tej: తెలుగులో చలన చిత్ర నిర్మాత చరణ్ తేజ్ ఉప్పలపాటి బాలీవుడ్ ఎంట్రీ ఇస్తున్నాడు. అంతేకాదు బీటౌన్‌లో సత్తా చాటాడానికి
రంగం సిద్దం చేసుకున్నాడు. చరణ్ తేజ్ ఉప్పలపాటి డైరెక్షన్‌లో ఓ భారీ బడ్జెట్ యాక్షన్ థ్రిల్లర్‌ తెరకెక్కుతోంది. ఈ ప్రాజెక్ట్‌లో బాలీవుడ్ స్టార్ నటులు కాజోల్, ప్రముఖ కొరియోగ్రాఫర్ ప్రభుదేవ లీడ్ క్యారెక్టర్స్‌ చేస్తున్నారు. వీరిద్దరితో పాటు  నసీరుద్దీన్ షా, సంయుక్త మీనన్, జిషు సేన్ గుప్తా, ఆదిత్య సీల్ ఇతర ముఖ్యపాత్రల్లో నటిస్తున్నారు. ఇక ప్రభుదేవ, కాజోల్  విషయానికొస్తే.. గతంలో వీళ్లిద్దరి కాంబినేషన్‌లో 27 యేళ్ల క్రితం 'మెరుపుకలలు'  చిత్రం వచ్చింది. ఈ సినిమా ఓ మోస్తరుగా నడిచింది.చాలా యేళ్ల తర్వాత మళ్లీ వీరి కలయికలో వస్తున్న సినిమా అంటే ప్రేక్షకుల్లో ఆసక్తి నెలకొంది. ఈ మాస్ ఎంటర్ టైనర్ చిత్రానికి సంబంధించిన మొదటి షెడ్యూల్ పూర్తైయింది. అతి త్వరలోనే ఈ మూవీకి నుంచి టీజర్ విడుదల చేయబోతున్నట్లు మేకర్స్ తెలిపారు.

భారీ ప్రెస్టీజియస్ ప్రాజెక్ట్‌లో అందరూ టాప్ టెక్నీషియన్స్ పనిచేస్తున్నారు. బాలీవుడ్ బాద్ షా షారుక్ ఖాన్ నటించిన జవాన్ చిత్రానికి సినిమాటోగ్రాఫర్‌గా పనిచేసిన జికె విష్ణు ఈ చిత్రానికి పనిచేస్తున్నారు. అలాగే గతేడాది హిందీలో బ్లాక్ బస్టర్ 'యానిమల్' మూవీకి పనిచేసిన హర్షవర్ధన్ రామేశ్వర్ ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నారు.  అలాగే అల్లు అర్జున్ పుష్ప చిత్రానికి ఎడిటర్‌గా పనిచేసిన నవీన్ నూలి ఈ సినిమాకు ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. భారీ టెక్నిషియన్స్‌తో అత్యంత భారీగా ఈ సినిమా తెరకెక్కుతోంది. అంతే కాదు మై నేమ్ ఈజ్ ఖాన్, వేక్ అప్ సిద్ చిత్రాలతో ప్రసిద్ది గాంచిన నిరంజన్ అయ్యంగార్, జెస్సికా ఖురానా ఈ మూవీకి స్క్రీన్ ప్లే అందిస్తున్నారు. ప్రొడక్షన్ డిజైనర్‌గా సాహి సురేష్ పనిచేస్తున్నారు. ఈ మూవీకి సంబంధించి మరిన్ని విషయాలను త్వరలోనే వెల్లడిస్తామని మేకర్స్ తెలిపారు.

ప్రభుదేవా విషయానికొస్తే..కొరియోగ్రాఫర్‌గా.. నటుడిగా.. నిర్మాతగా.. దర్శకుడిగా సత్తా చాటుతున్నారు. అటు కాజోల్ విషయానికొస్తే.. పెళ్లి తర్వాత కూడా ఆచితూచి సినిమాలు చేస్తోంది. అంతేకాదు రీసెంట్‌గా 'లస్ట్ స్టోరీస్ 2'లో నటించింది.

Read more: Drunken couple: తప్పతాగి రోడ్డు మీద హల్ చల్.. వాకర్స్ మీద రెచ్చిపోయిన యువతి.. వీడియో వైరల్..

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి FacebookTwitter

Trending News