Varun Sandesh Constable: వరుణ్ సందేశ్ ‘కానిస్టేబుల్’ మూవీ పోస్టర్ లాంఛ్..

Varun Sandesh Constable Poster Launch: వరుణ్ సందేశ్ హీరోగా డిఫరెంట్ మూవీస్ తో దూసుకుపోతున్నాడు. తాజాగా ఈయన ఆర్యన్ సుభాన్ డైరెక్షన్ లో జాగృతి మూవీ మేకర్స్ పతాకంపై ‘కానిస్టేబుల్’ మూవీ చేస్తున్నాడు. బలగం జగదీష్ నిర్మిస్తున్నారు. తాజాగా ఈ సినిమా పోస్టర్ ను లాంఛ్ చేసారు.

Written by - TA Kiran Kumar | Last Updated : Dec 4, 2024, 09:09 PM IST
Varun Sandesh Constable: వరుణ్ సందేశ్ ‘కానిస్టేబుల్’ మూవీ పోస్టర్ లాంఛ్..

Varun Sandesh Constable Poster Launch: వరుణ్ సందేశ్ తెలుగులో వరుస సినిమాలతో దూసుకుపోతున్నాడు. రీసెంట్ గా ‘నిందా’, ‘విరాజి’ వంటి మూవీస్ తో  అలరించిన వరుణ్ సందేశ్.. ఇపుడు ‘కానిస్టేబుల్’ చిత్రంతో రాబోతున్నాడు. తాజాగా ఈ సినిమా పోస్టర్ ను లాంఛ్ చేశారు.  ఈ సినిమాలో వరుణ్ కు జోడిగా మధులిక వారణాసి కథానాయికగా నటిస్తోంది. తాజాగా ఈ మూవీ పోస్టర్ ను  నెల్లూరు టౌన్ హాళ్ళో కలెక్టర్ K. కార్తీక్, సినిమా రచయిత యండమురి వీరేంద్ర నాథ్ సహా కొంతమంది ప్రముఖుల చేతుల మీదగా విడుదల చేయడం జరిగింది.

Add Zee News as a Preferred Source

ఈ సందర్బంగా నిర్మాత బలగం జగదీష్ మాట్లాడుతూ.. ప్రస్తుతం  పోస్ట్ ప్రొడక్షన్ పనులు కూడా శర వేగంగా జరుగుతున్నాయి. మరోవైపు దర్శకుడు ఆర్యన్ సుభాన్ మాట్లాడుతూ.. సస్పెన్ క్రైమ్ త్రిల్లర్ చిత్రాలకు ప్రేక్షకుల ఆదరణ ఎప్పుడు ఉంటుంది. ఈ కోవలో తెరకెక్కిన ‘కానిస్టేబుల్’ ప్రేక్షకులను అలరించడం పక్కా అని చెబుతున్నారు. తాజాగా ఈ సినిమాకు సంబంధించిన పాటలు, టీజర్ ను త్వరలో రిలీజ్ చేస్తున్నట్టు తెలిపారు.

ఈ చిత్రంలో వరుణ్ సందేశ్, మధులిక వారణాసితో పాటు దువ్వాసి మోహన్, సూర్య, రవి వర్మ, మురళీధర్ గౌడ్,  ప్రభావతి, కల్పలత, నిత్య శ్రీ, బలగం జగదీష్, శ్రీ భవ్య తదితరులు ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. ఈ చిత్రానికి కెమెరా; హజరత్ షేక్ (వలి), సంగీతం :సుభాష్ ఆనంద్ అందిస్తున్నారు. శ్రీ వర ప్రసాద్ ఎడిటర్ గా వ్యవహరిస్తున్నారు. B. G. M : జ్ఞాని, ఆర్ట్ డైరెక్టర్ : వి. నాని పండు.  మాటలు :శ్రీనివాస్ తేజ అందిస్తున్న ఈ చిత్రానికి పాటలు: రామారావు, శ్రీనివాస్ తేజ రాసారు.  వెంకట్ రెడ్డి మేకప్ మ్యాన్ గా వ్యవహరిస్తూన్న ఈ చిత్రానికి కాస్ట్యూమ్ డిజైనర్ గా సిరాజ్ వ్యవహరిస్తున్నారు. ప్రొడక్షన్ మేనేజర్: పి. లీల ప్రసాద్ ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: ఎం జగ్గయ్య ఉన్నారు. సహ నిర్మాత: బి నికిత జగదీష్, కుపెందర్ పవార్. నిర్మాత; బలగం జగదీష్, కథ, స్క్రీన్ ప్లే, దర్శకత్వం; :ఆర్యన్ సుభాన్

ఇదీ చదవండి: ముగ్గురు మొనగాళ్లు సినిమాలో చిరంజీవి డూప్ గా నటించింది వీళ్లా.. ఫ్యూజలు ఎగిరిపోవడం పక్కా..

ఇదీ చదవండి:  టాలీవుడ్ లో ఎక్కువ ప్రీ రిలీజ్ బిజినెస్ చేసిన చిత్రాలు.. ‘పుష్ప 2’ ప్లేస్ ఎక్కడంటే..

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

TwitterFacebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.

About the Author

TA Kiran Kumar

కిరణ్ కుమార్ తంజావూర్ జీ తెలుగు తెలుగు న్యూస్‌లో ఛీఫ్ సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి  వినోదం, ఆధ్యాత్మికం, జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ వ్యవహారాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. సినిమా రివ్యూలు, సినిమాలకు సంబంధించి ప్రత్యేక కథనాలు కూడా రాస్తుంటారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు. ఆయనకు జర్నలిజంలో 18 ఏళ్లకుపైగా అనుభవం ఉంది.

...Read More

Trending News