Vinod Film Academy: ఘనంగా వినోద్ ఫిల్మ్ అకాడమీ 4వ వార్షికోత్సవంలో లాంప్ మూవీ ట్రైలర్ లాంఛ్..

Vinod Film Academy: వినోద్ ఫిల్మ్ అకాడమీ భాగ్యనగరం వేదికగా 4 యేళ్ల క్రితం ప్రారంభమైంది. చిన్నగా ప్రారంభమైన ఈ అకాడమీ ఇంతింతై అన్నట్టుగా సాగిపోతుంది. తాజాగా వినోద్ ఫిల్మ్ అకాడమీ 4వ వార్షికోత్సవం ఘనంగా జరిగింది. అంతేకాదు ఈ ఫిల్మ్ అకాడమీకి నుంచి నటనతో పాటు ఇతర 24 విభాగాల్లో శిక్షణ తీసుకున్న విద్యార్ధుల ప్రతిభను గుర్తిస్తూ అకాడమీ వాళ్లు సర్టిఫికేట్లు, మెడల్స్ అందించారు.

Written by - TA Kiran Kumar | Last Updated : Dec 23, 2024, 04:00 PM IST
Vinod Film Academy: ఘనంగా వినోద్ ఫిల్మ్ అకాడమీ 4వ వార్షికోత్సవంలో లాంప్ మూవీ ట్రైలర్ లాంఛ్..

Vinod Film Academy: వినోద్ ఫిల్మ్ 4వ వార్షికోత్సవం  రీసెంట్ గా తెలంగాణ రాజధాని హైదరాబాద్ లోని జూబ్లీ హిల్స్‌లో జరిగింది. అక్కడ  ఒక ప్రముఖ ప్రాంగణంలో ఈ వేడుకను అట్టహాసంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో వినోద్ ఫిల్మ్ అకాడమీలో టాలెంట్ ప్రూవ్ చేసుకున్న  స్టూడెంట్స్ కు  సర్టిఫికేట్లు, మెడల్స్ అందజేశారు.ఈ సందర్భంగా వినోద్ నువ్వుల మాట్లాడుతూ.. "ఈ నాలుగేళ్ల ప్రయాణం ఎంతో సంతృప్తికరంగా సాగిందన్నారు.  మా అకాడమీ నుండి అనేక మంది విద్యార్థులు  ప్రస్తుతం టాలీవుడ్‌లో పనిచేస్తున్నారు. అందుకు ఎంతో గర్వంగా ఉంది. మధు ఫిల్మ్ ఇన్ స్టిట్యూట్ తర్వాత వినోద్ ఫిల్మ్ అకాడమీకి అంత గొప్ప పేరుందన్నారు.  కొత్త టాలెంట్‌ను గుర్తించి ప్రోత్సహించడంలో మా అకాడమీ  ముందుందన్నారు.

ఈ నాల్గో వార్షికోత్సవ కార్యక్రమంలో ఆయన హీరోగా నటించిన ‘ల్యాంప్’ సినిమా ట్రైలర్‌ను విడుదల చేశారు. ట్రైలర్ అందర్నీ ఆకట్టుకుంటూ మంచి రెస్పాన్స్ తెచ్చుకుంటుంది. చరిత సినిమా ఆర్ట్స్ పతాకంపై ల్యాంప్ చిత్రాన్ని తెలుగు ఫిలిం ఛాంబర్ లో ప్రముఖ దర్శకులు సముద్రతో పాటు  నవోదయ ఫిలిమ్స్ అధినేత రవీంద్ర గోపాల్ ,  జీవీఎం శేఖర్ రెడ్డి ఆధ్వర్యంలో వినోద్ ఫిలిం అకాడమీ సంస్థ ద్వారా ఘనంగా ట్రైలర్  లాంచ్ చేశారు. ఈ  ట్రైలర్  లాంచ్ లో ప్రముఖ అతిథులుగా  పృథ్వీరాజ్, కార్పొరేటర్ క్రాంతి, చలపతి,  డైరెక్టర్ రాజశేఖర్, హీరో వినోద్ నువ్వుల మధుమతి హీరోయిన్ కోటి కిరణ్ మధుమతి హీరోయిన్  అతిథుల సమక్షంలో ట్రైలర్ ను  లాంచ్ చేయడం జరిగింది.

ఈ వేడుకలో ప్రముఖ దర్శకులు సముద్ర  మాట్లాడుతూ, "ఫిల్మ్ అకాడమీలు పరిశ్రమకు మంచి టెక్నికల్ నిపుణులను  అందించడంలో కీలక పాత్ర పోషిస్తున్నాయి. వినోద్ ఫిల్మ్ అకాడమీ కూడా తమ మార్కును చూపించదన్నారు.

నటులు 30 ఈయర్స్ పృద్వి, నిర్మాత శబరి మహేంద్రనాథ్, నటుడు రాజశేఖర్, యంగ్ డైరెక్టర్ తల్లాడ సాయి కృష్ణ ఈ కార్యక్రమంలో పాల్గొని తమ అనుభవాలు పంచుకున్నారు.

కార్యక్రమం విజయవంతంగా ముగిసాయి. అకాడమీ భవిష్యత్తులో మరింత పెద్ద ఎత్తున కార్యకలాపాలు చేపడతుందని నిర్వాహకులు తెలిపారు.  వినోద్ ఫిలిం అకాడమీ ప్రిన్సిపాల్ ప్రముఖ హాస్య నటులు కిషోర్ దాస్, బబ్లు, ఉషశ్రీ మురళి , లాంప్ మూవీ డైరెక్టర్ రాజశేఖర్ ప్రొడ్యూసర్ శేఖర్ రెడ్డి  ప్రముఖ   డిస్ట్రిబ్యూటర్స్ నవోదయ ఫిలిమ్స్ రవీంద్రగోపాల్  ఈ ఈవెంట్ లో పార్టిసిపేట్ చేశారు.

ఇదీ చదవండి: పెళ్లి తర్వాత భారీగా పెరిగిన శోభిత ఆస్తులు.. ఎవరి ఎక్స్ పెక్ట్ చేయరు..

ఇదీ చదవండి: వెంకటేష్ భార్య నీరజా రెడ్డి గురించి ఎవరికీ తెలియని షాకింగ్ నిజాలు..

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

TwitterFacebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.

Trending News