Vaishakha Amavasya 2023: పంచాంగం ప్రకారం..ప్రతి నెలలో అమావాస్యలు వస్తూ ఉంటాయి. హిందూ మతంలో అమావాస్య తిథి చాలా ముఖ్యమైనదిగా పరిగణిస్తారు. వైశాఖ మాసంలో వస్తే అమావాస్య ప్రాముఖ్యత మరింత పెరుగుతుంది. ముఖ్యంగా ప్రతి సంవత్సరంలో వచ్చే వైశాఖ అమావాస్య 20 ఏప్రిల్ 2023 న వస్తోంది. వైశాఖ మాసం రోజున చేసే స్నాన-దానం, ఉపవాసాలకు పెద్దలు చాలా ప్రాముఖ్యతను ఇచ్చారు. వైశాఖ అమావాస్య వ్రతాన్ని ఆచరించడం వల్ల అన్ని రాశులవారు గ్రహాల అనుగ్రహం పొందుతారు. కాబట్టి ఈ రోజున ఎలాంటి నియమాలతో పూజా కార్యక్రమాలు చేయడం వల్ల మంచి ఫలితాలు పొందుతారో ఇప్పుడు తెలుసుకుందాం.
వైశాఖ అమావాస్య ఇలా వ్రతం చేయాల్సి ఉంటుంది:
వైశాఖ అమావాస్య రోజు ఉపవాసాలు పాటించేవారు భక్తి శ్రద్ధలతో ఉండాల్సి ఉంటుంది. అంతేకాకుండా వీరు సూర్యోదయానికి ముందే నిద్రలేచి, నది స్నానం చేయాలి. లేకపోతే ఇంట్లో ఉండే నీటిలో గంగాజలం కలుపుకుని కూడా స్నానం చేయోచ్చు. ఇలా స్నానం పూర్తి అయిన తర్వాత పట్టు వస్త్రాలు ధరించాల్సి ఉంటుంది. ఆ తర్వాత ఉసిరి చెట్టు కిందికి వెళ్లి ధ్యానం చేస్తూ బ్రహ్మ, విష్ణు, శివుడం వల్ల చాలా రకాల లాభాలు కలుగుతాయి. ఆ తర్వాత పూర్వీకులకు ప్రత్యేకంగా తర్పణం చేయండి.
పూర్వీకులకు తర్పణం చేయలేని వారు వారిని భక్తి శ్రద్ధలతో స్మరించుకోవాల్సి ఉంటుంది. అమావాస్య రోజున ఆవు, కాకి, చీమ, కుక్కలకు మీరు తయారు చేసిన ఆహారాలను పెట్టాల్సి ఉంటుంది. అంతేకాకుండా వైశాఖ అమావాస్య పుణ్య ఫలం పొందడానికి..నిరు పేదలకు అన్నం, బట్టలు, డబ్బులను సమర్పించాల్సి ఉంటుంది. ఇలా చేయడం వల్ల చాలా రకాల ప్రయోజనాలు లభిస్తాయి. ముఖ్యంగా అనారోగ్య సమస్యల నుంచి ఉపశమనం లభిస్తుంది.
Also Read: Renu Desai Video : ఏడ్వాలో నవ్వాలో కూడా అర్థం కాని పరిస్థితులు.. రేణూ దేశాయ్ పోస్ట్
తప్పకుండా ఈ నియమాలు పాటించాల్సి ఉంటుంది:
వైశాఖ అమావాస్య రోజున ఇళ్లును శుభ్రం చేసుకోవాల్సి ఉంటుంది.
అమావాస్య రోజున ధరించిన వస్త్రాలను మళ్లీ ధరించకూడదు.
ఈ రోజు తప్పకుండా మాంసం, మద్యానికి దూరంగా ఉండాల్సి ఉంటుంది.
భిక్షాటన కోసం వచ్చిన వారికి వట్టి చేతులతో ఈ రోజు అస్సలు పంపరాదు.
Also Read: Renu Desai Video : ఏడ్వాలో నవ్వాలో కూడా అర్థం కాని పరిస్థితులు.. రేణూ దేశాయ్ పోస్ట్
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter, Facebook