Hair Fall Control Oil: వేగంగా జుట్టు రాలుతుందా? ఈ ఆయిల్‌ కేవలం 5 రోజుల్లో చెక్‌ పెట్టొచ్చు!

Hair Fall Control Oil: ప్రస్తుతం చాలా మంది ఎండ కారణంగా జుట్టు సమస్యలతో బాధపడుతున్నారు. ఇలాంటి సమస్యలతో బాధపడేవారు తప్పకుండా పలు రకాల జాగ్రత్తలు పాటించాల్సి ఉంటుంది. అంతేకాకుండా ఈ కింది చిట్కాలు పాటించాల్సి ఉంటుంది.  

Written by - ZH Telugu Desk | Last Updated : Apr 25, 2023, 04:16 PM IST
Hair Fall Control Oil: వేగంగా జుట్టు రాలుతుందా? ఈ ఆయిల్‌ కేవలం 5 రోజుల్లో చెక్‌ పెట్టొచ్చు!

Hair Fall Control Oil: వేసవి కాలం కారణంగా చాలా మందిలో జుట్టు సమస్యలు వస్తూ ఉంటాయి. ముఖ్యంగా వాతావరణంలో తేమ శాతం పెరగడం వల్ల చమటలు పట్టి చర్మ సమస్యలేకాకుండా జుట్టు రాలడం కూడా ప్రారంభమవుతుంది. కాబట్టి ఇలాంటి సమస్యలతో బాధపడేవారు తప్పకుండా పలు రకాల జాగ్రత్తలు పాటించాల్సి ఉంటుంది. వీటికి రసాయనాలతో కూడిన ప్రోడక్ట్స్‌ వినియోగించకుండా కొన్ని ఇంటి నివారణలు పాటించాల్సి ఉంటుంది. అయితే ఎలాంటి చిట్కాలు పాటించడం వల్ల సులభంగా జుట్టు రాలడం, చర్మ సమస్యల నుంచి ఉపశమనం లభిస్తుందో ఇప్పుడు మీరు తెలుసుకోండి.

వేసవిలో జుట్టు రాలే సమస్యలకు ఇలా చెక్‌ పెట్టండి:
కొబ్బరి నూనె:

వేసవి కాలంలో చాలా మందిలో జుట్టు రాలడం సమస్యలు ఎక్కువతున్నాయి. అయితే ఇలాంటి సమస్యలతో బాధపడేవారు తప్పనిసరిగా కొబ్బరి నూనెను వినియోగించాల్సి ఉంటుంది.  కొబ్బరినూనె తలకు చల్లదనాన్ని ఇస్తుంది. దీంతో మీరు ఎండ కారణంగా తలలో చెమట పట్టడం తగ్గుతుంది. దెబ్బతిన్న జుట్టును కూడా రిపేర్ చేసేందుకు కీలక పాత్ర పోషిస్తుంది. కొబ్బరి నూనె వల్ల తలలో రక్త ప్రసరణ పెరుగుతుంది. కాబట్టి ఎండ కాలంలో జుట్టు రాలడం సమస్యలతో బాధపడేవారు తప్పకుండా కొబ్బరి నూనె వినియోగించాల్సి ఉంటుంది.

Also Read:  Karnataka Assembly Elections 2023: బీజేపీకి భారీ షాక్.. కాంగ్రెస్‌లో చేరిన మాజీ ముఖ్యమంత్రి

కలబంద:
కలబంద చర్మానికే కాకుండా జుట్టు రాలడం వంటి సమస్యలను తగ్గించడానికి కీలక పాత్ర పోషిస్తుంది. ఎండా కాలంలో జుట్టు రాలడం సమస్యలతో బాధపడితే తప్పకుండా కలబంద జెల్‌ను వినియోగించాల్సి ఉంటుంది. కలబందలో యాంటీ ఫంగల్ గుణాలు లభిస్తాయి. కాబట్టి సులభంగా చుండ్రు సమస్యలను తగ్గించడానికి సహాయపడుతుంది. అంతేకాకుండా జుట్టును దృఢంగా చేస్తుంది. అయితే దీని కోసం మీరు ప్రతి రోజు స్నానానికి ముందు అలోవెరా జెల్‌ను తీసుకుని జుట్టుకు 30 నిమిషాల పాటు పట్టించాల్సి ఉంటుంది.

(నోట్‌: ఇక్కడ ఇవ్వబడిన సమాచారం ఇంటి నివారణలు, సాధారణ సమాచారంపై ఆధారపడి ఉంటుంది. దానిని స్వీకరించే ముందు తప్పనిసరిగా వైద్య సలహా తీసుకోవాలి. ZEE NEWS దానిని ధృవీకరించలేదు.)

Also Read:  Karnataka Assembly Elections 2023: బీజేపీకి భారీ షాక్.. కాంగ్రెస్‌లో చేరిన మాజీ ముఖ్యమంత్రి

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook

 

Trending News