IRCTC Refund Rules: చార్ట్ ప్రిపేర్ అయిన తరువాత రైల్వే టికెట్ క్యాన్సిల్ చేసినా రీఫండ్ పొందొచ్చు.. ఎలాగంటే..?

Indian Railways Ticket Refund Rules: టికెట్ క్యాన్సిలేషన్ రూల్స్‌ను మార్చింది ఇండియన్ రైల్వేస్. ఇక నుంచి చార్ట్ ప్రిపేర్ అయిన తరువాత టికెట్ క్యాన్సిల్ చేసుకున్న రీఫండ్ పొందొచ్చు. ఇందుకోసం టిక్కెట్ డిపాజిట్ రసీదు సబ్మిట్ చేయాలి. ఇందుకోసం ఏం చేయాలంటే..?  

Written by - Ashok Krindinti | Last Updated : Apr 24, 2023, 12:26 PM IST
IRCTC Refund Rules: చార్ట్ ప్రిపేర్ అయిన తరువాత రైల్వే టికెట్ క్యాన్సిల్ చేసినా రీఫండ్ పొందొచ్చు.. ఎలాగంటే..?

Indian Railways Ticket Refund Rules: నిత్యం లక్షలాది మంది రైళ్లలో ప్రయాణాలు చేస్తున్నారు. చాలా మంది ముందుగానే టికెట్లు బుక్ చేసుకుని.. హ్యాపీగా జర్నీ చేస్తుంటారు. మరికొందరు చివరి నిమిషంలో ప్రయాణాలు అనుకుని.. అప్పటికప్పుడు తాత్కల్, ప్రీమియమ్ తాత్కల్‌లో టికెట్లు బుక్ చేసుకుని వెళ్లిపోతారు. అయితే కొంతమంది టికెట్లు బుక్ చేసుకుని చార్ట్ ప్రీపేర్ అయిన తరువాత మరికాసేపట్లో ప్రయాణం ఉందనగా.. టికెట్లు క్యాన్సిల్ చేసుకుంటారు. చార్ట్ రెడీ అయిన తరువాత టికెట్ క్యాన్సిల్ చేసుకుంటే.. రీఫండ్ వస్తుందా..? రాదా..? అని చాలామందికి అనుమానం ఉంది. చార్ట్ ప్రీపేర్ అయిన తరువాత మీరు రైలు టిక్కెట్‌ను రద్దు చేసుకున్నా.. రీఫండ్ క్లైయిమ్ చేసుకోవచ్చని చేసుకోవచ్చని భారతీయ రైల్వే తెలిపింది.

ఐఆర్‌సీటీసీ ఈ విషయాన్ని వెల్లడించింది. రైల్వే టిక్కెట్లను రద్దు చేసుకుంటే రీఫండ్ చెల్లిస్తున్నట్లు పేర్కొంది. అయితే రీఫండ్ కోసం మీరు రైల్వే నిబంధనల ప్రకారం టిక్కెట్ డిపాజిట్ రసీదు (టీడీఆర్) సమర్పించాల్సి ఉంటుంది.

Also Read: Old Pension Scheme: ఓపీఎస్ అమలుకు సన్నాహాలు.. ఈ రాష్ట్ర ప్రభుత్వానికి మొండిచేయి  

ఆన్‌లైన్లో టీడీఆర్‌ను ఎలా ఫైల్ చేయాలి..?

==> ముందుగా ఐఆర్‌సీటీసీ అధికారిక వెబ్‌సైట్ www.irctc.co.in కి వెళ్లండి .
==> హోమ్ పేజీకి వెళ్లి నా అకౌంట్‌పై క్లిక్ చేయండి
==> డ్రాప్ డౌన్ మెనూలోకి వెళ్లి.. మై ట్రాన్సాక్షన్‌పై క్లిక్ చేయండి
==> ఇక్కడ మీరు ఫైల్ టీడీఆర్ ఆప్షన్‌పై క్లిక్ చేయండి
==> ఎవరి పేరు మీద టికెట్ బుక్ చేసుకున్నారో మీకు కనిపిస్తుంది.
==> ఇక్కడ మీ పీఎన్‌ఆర్ నంబర్, రైలు నంబర్, క్యాప్చాను ఎంటర్ చేయండి. రద్దు నియమాలకు అంగీకారం తెలపండి. 
==> ఆ తరువాత సబ్మిట్ బటన్‌పై క్లిక్ చేయండి.
==> బుకింగ్ సమయంలో ఫారమ్‌లో ఇచ్చిన మొబైల్ నంబరుకు ఓటీపీ వస్తుంది.
==> ఓటీపీని ఎంటర్ చేసి.. సబ్మిట్ ఆప్షన్‌పై క్లిక్ చేయండి.
==> పీఎన్ఆర్ వివరాలను ధృవీకరించిన తరువాత క్యాన్సిల్ టికెట్ ఆప్షన్‌పై క్లిక్ చేయండి.
==> మీకు రీఫండ్ మొత్తం డిస్ ప్లే అవుతుంది.
==> బుకింగ్ ఫారమ్‌లో ఫోన్ నంబర్‌కు పీఎన్ఆర్, రీఫండ్ వివరాలతో క్యాన్సిలేషన్ కన్ఫర్మేషన్ మెసేజ్ వస్తుంది. 

Also Read: Ajinkya Rahane IPL: రఫ్పాడిస్తున్న అజింక్యా రహానే.. ఆ టైమింగే వేరప్పా..!  

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe

TwitterFacebook మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

Trending News