Vidyarthi Movie Review చేతన్ చీను, బన్నీ వోక్స్ కాంబోలో విద్యార్థి అనే సినిమా నేడు థియేటర్లోకి వచ్చింది. 'మధు మాదాసు' దర్శకత్వం వహించిన ఈ సినిమాను మహాస్ క్రియేషన్స్ పతాకంపై ఆళ్ల వెంకట్ నిర్మించారు. ఇప్పటికే రిలీజ్ చేసిన టీజర్, ట్రైలర్, సాంగ్స్ ఇలా అన్నీ కూడా అంచనాలు పెంచాయి. మరి ఇప్పుడు ఈ సినిమా థియేటర్లో సందడి చేస్తోంది. ఈ కథ, కథనాలు ఎలా ఉన్నాయో ఓ సారి చూద్దాం.
అనాథ అయిన చైతన్య(చేతన్ చీను) అగ్రికల్చర్ స్టూడెంట్స్. ఇక మహాలక్ష్మి(బన్నీవోక్స్)పెద్దింటి బిడ్డ. ఆ ఊర్లో పెద్ద కుటుంబమైన భూపతికి ఒక్కగానొక్క కూతురు ఈ మహాలక్మీ. చైతన్య, మహాలక్ష్మీలు క్లాస్ మేట్స్ కావడంతో స్నేహం, ప్రేమ మొదలవుతుంది. భూపతి మీద రివేంజ్ తీసుకునేందుకు సత్యం అనేవాడు.. మహాలక్ష్మి మీద ఎటాక్ చేస్తాడు. ఇలాంటి పగలో తాను ప్రేమించిన అమ్మాయిని చైతన్య దక్కించుకోగలడా? తన ప్రేమని కాపాడుకోగలిగాడా? అసలు పెద్దలు ఆ ప్రేమను అంగీకరించారా? ఇక ఈ కథలో రఘుబాబు పాత్ర ఏంటి? అనేది కథ.
హీరో చేతన్ చీను పక్కింటి అబ్బాయిగా ఎంతో చక్కగా కనిపించాడు. అంతే చక్కగా నటించాడు. ఎమోషనల్, యాక్షన్ ఇలా అన్ని సీన్లలో ఆకట్టుకున్నాడు. బన్నీ వోక్స్ కనిపించినంత సేపు అందంగా కనిపిస్తుంది. లుక్స్ పరంగానే కాకుండా నటనతోనూ ఆకట్టుకుంది. మిగిలిన పాత్రల్లో నవీన్ నేని, యాదమ్మ రాజు, రఘు బాబు, టిఎన్ఆర్ తమ తమ పాత్రలకు న్యాయం చేశారు.
కుల, మత వివక్షలు, గొడవలు నిత్యం చూస్తూనే ఉంటాయి. ఇలాంటి, సున్నితమైన అంశాన్నే డైరెక్టర్ మధు మాదాసు ఎంచుకున్నాడు. తనదయిన స్టైల్లో కుల మతాల పిచ్చి వల్ల ఎంత మంది అమాయకులు బలి అవ్వుతున్నారో చూపించే ప్రయత్నం చేశాడు. సినిమా ఓపినింగ్‌లోనే డైరెక్టర్ స్టోరీ బోర్డు ద్వారా కథని చెప్పిన తీరు అందరినీ ఆకట్టుకుంటుంది.
Also Read: Kriti Sanon Sita Posters : అశోకవనంలో సీత.. ఆదిపురుష్ నుంచి కృతి సనన్ లుక్.. పిక్స్ వైరల్
ఇంట్రడక్షన్ సాంగ్ లో స్టూడెంట్స్ ఆలోచన తీరు చెప్తూ, మహాలక్ష్మి(బన్నీవోక్స్) ఎంట్రీ కాలేజీ లో రివీల్ చేసే సీన్ బాగుంటుంది. కాలేజ్ సీన్స్, లవ్ సాంగ్స్ , ఇద్దరి మధ్య కెమిస్ట్రీ తెర మీద మెప్పిస్తుంది. కాలేజ్‌లోని సంభాషణలు, డైలాగ్స్ కంటతడి తెప్పిస్తాయి. యాదమ్మ రాజు కామెడీ ఓకే అనిపిస్తుంది. కొన్ని చోట్ల సీన్స్ ల్యాగ్ అయ్యినప్పటికీ డైరెక్టర్ తన స్క్రీన్ ప్లేతో మెప్పిస్తాడు. క్లైమాక్స్ సీన్స్ ఎమోషనల్‌గా సాగుతాయి.
బొంతల నాగేశ్వర రెడ్డి ఎడిటింగ్ బాగుంది. విజయ్ బుల్గానిన్ అందించిన పాటలు, ఆర్ఆర్ మెప్పిస్తుంది. కన్నా పిసి ఫోటోగ్రఫీ ఓకే అనిపిస్తుంది. సినిమా ప్రొడక్షన్ వాల్యూస్ రిచ్‌గా అనిపిస్తాయి.
రేటింగ్ 2.75
Also Read: Rajinikanth Balakrishna : బాలకృష్ణను రజినీకాంత్ ట్రోల్ చేశాడా?.. ఆ మాటలకు అర్థం అదేనా?
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter, Facebook